పుట:Chali Jvaramu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

చ లి జ్వ ర ము


అక్కడ ననేక మాసముల వరకు ఆహారము కూడనక్కర లేకుండ నిద్రను జెందును. తమ వృద్దికి తగిన సమయము వచ్చినప్పుడే దోమలు తమ నిద్ర నుండి లేచి బయటికివచ్చి మరియొక సంవత్సరమునకు వ్యాపింపజేయును. కొన్ని దోమపిల్లలుకూడ వాని పెంపునకు తగినకలము సమకూరని యెడల ననేక మాసములవరకు నిట్టి నిద్రావస్ధకు జెంది తగిన తరుణము వచ్చినప్పుడే పెద్దదోమలుగా పరిణమించును.

క్యూలెక్సు దోమపిల్లల నివాస స్థానములు

క్యూలక్సుదోమ పిల్లలు మురికినీటిలో మిక్కిలి వేగముగ వృద్ధిజెందును. ఉపయోగములో లేని పాడు నూతులును, రోడ్లప్రక్కలనుడు గోతులును మురుగు గాలువలును, దీనిపిల్లలకు ప్రియమైన నివాసస్థానములు. మానవుల అశుద్ధసంబందమైన కల్మషముగల నీటిలో నీజాతిదోమపిల్లలు మిక్కిలి వృద్ది పొందును. ఓటికుండలు, పగిలిపోయిన సీసాలు, పీపాలు, మొదలగు వానిలోని నిలుకడ నీటియందును ఈజాతిదోమ పిల్లలను పెట్టును.

స్టిగోమియా దోమపిల్లల నివాసస్థానము.

స్టిగోమియా దోమపిల్లలు ఇంటిచుట్టు నుండు నిలువ నీటితొట్లలో సామాన్యముగ్తా సంవత్సరము పొడుగున ఉండును=. నల్లులెక్కకుండ మంచము