Jump to content

చలిజ్వరము/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

చికిత్స

జ్వరముతో కూడిన ఏవ్యాధికైనను చక్కగ వైద్యము చేయవలెననిన యెడల ఆ జ్వరమునకు కారన మెద్దియో నిశ్చయముగ తెలిసికొనుట మిక్కిలి అవశ్వకము. ఒక రోగియొక్క వ్యాధి చలిజ్వరమని నిశ్చ యముగా తెలియక పూర్వము ఏమి వైద్యము చేయాలెనీ 85-వ పుటలో చెప్పియున్నాము. "చలిజ్వరపురోగి" అని నిశ్చయముగా తెలిసిన తోడనే వానికీక్రింది ప్రకారము వైద్యము చేయవలెను.

మొదట విరేసనములకు మందుఇయ్యవలెను

వైద్యము ప్రారంభించిన దినమున సామాన్యముగా నాలుగైదు విరేచనము లగునట్లు మందు ఇయ్యవలెను. పైత్యతిత్తినిశుభ్రపరచు నిమిత్తము రసభస్మము (Colomel) గాని రసముకలిసిన ఇతర మందు దేనినైను గాని ఒకటి రెండు మాత్రల నిచ్చిన మేలగును. ఇందువలన జీర్ణకోశములు శుభ్రమైన తరువాత ఇయ్యబోవుమందులన్నియు చక్కగ జీర్ణమై రక్తములోనికి జేరును.

చలి జ్వరములకు క్వయినా సిద్దౌషధము

పిమ్మట ద్రావకముగనో లేక మూత్రలగనో క్వయినాను ఇచ్చుటయే చలిజ్వరమునకు సిద్దౌషధము. కానదీనినుపయోగించుటలో నెంత మెలకువగానుండిన అంతత్వరలో జ్వరము కుదుర్చవచ్చును.

క్వయినాను ఎప్పుడు ఎట్లు ఇయ్యవలెను

సాధ్యమైనప్పుడెల్లను ఏవేళయందు జ్వరము ప్రారంభించునో తెలిసికొని జ్వరమువచ్చు సమయమునకు పూర్వము 4గంటలముందుగా 10* గ్రెయినులు క్వయినాను ఇయ్యవలెను. పిమ్మట ఒక్కొక్క మోతాదుకు 5 గ్రెయినులు చొప్పున దినమునకు నాలుగు మొతాదుల క్వయినాను 5 దినముల వరకుఇయ్యవలెను. ఈఅయిదుదినములోగా జ్వరమునిలువనియెడల అది చలిజ్వరముకాదని సధారణముగ చెప్పవచ్చును. మొదట జీర్ణకోశములను శుభ్రపరచి పిమ్మట పైనచెప్పినప్రకారము క్వయినా ఇచ్చుట వలన ప్రతి చలిజ్వరపు రోగికిని తప్పక జ్వరము విడుచునని చెప్పవచ్చును. ఒకవేళ ఎవరికైనను కుదురనియెడల నారోగికితగినన్ని మోతాదులను తగిన సమయములలో నియ్యలేదనిగాని, ఆరోగియొక్క జ్వరము చలిజ్వరము కాదనిగని ఊహింపవచ్చును.

సరిగా క్వయినాను ఇచ్చిన తరువాత అనేక రోగులకు 24 గంటలు మొదలు 72 గంటలలోగానే


  • గ్రెయిను అనగా గురిగింజ యెత్తు.

జ్వరము నిలిచిపొవచ్చును. వారీ రక్తములోని చలి జ్వరపు పురుగులు చాలభాగము అప్పటృఇకి చచ్చి పోవును. అట్టివారిని వెంటనే తమమనిలోనికి పోనిచ్చి నను, మందు మాత్రము 5 దినములవరకు, దినమునకు 20 గ్రెయినులు చొప్పునను, అటుపిమ్మట ఈ క్రింది వివరించిన ప్రకారమును మిక్కిలి శ్రద్ధగానిచ్చుచుండవలెను.

అయిదవ దినము మొదలు పూటకు 5 గ్రెయినుల చొప్పున 3 పూటలను మూడు మోతాదులు ఇయ్యవలెను. ఇట్లు 5 దినములవరకు తీసికొనగా తిరిగి జ్వరము రానియెడల ఆదినము మొదలు ఒకనెలవరకు దినమునకు 5 గ్రెయినులు చొప్పున ప్రతిదినమును ఒకమొతాదు ఈయవలెను. ఈమధ్యలో ఏదినమున జ్వరము వచ్చినను ఆదినముననే జ్వరము ప్రారంభించినట్లు ఎంచి తిరిగి మొదట ఇచ్చినట్లె దినమునకు 20 గ్రెయినుల్స్ చొప్పున ఇచ్చుచు చికిత్సనంతను తిరిగి చేయవలెను.

ఒకప్పుడు రెండుమూడు సంవత్సరముల వరకు క్వయినా ఇయ్యవలెను.

తిరిగి తిరిగి వచ్చు చలిజ్వరముల్కు రెండుమూడు సంవత్సరముల వరకు ఒక్కొక్కప్పుడు క్వయినాను ఇయ్యవలసివచ్చును. జ్వరపుగడ్డపెరిగి యున్నదను సందేహము తీరువరకును రోగిక క్వయినాను పుచ్చుకొనుచుండ వలసినదే. ఇట్టి రోగులకు క్వయినా తొ పాటుకొంచెము ఉల్లిపాషాణమును, (Arsenic) లోహమును (Iron) వైద్యులు తగిన మొతాదులను తెలిసికొని ఉపయోగింపవచ్చును.

దినమునకు 20 గ్రెయినుల చొప్పున మొదటి నిండియు తీసికొనినరోగికి సామాన్యమునగా తిరిగి జ్వరమురాదు. ఒక్కొక మొతాదుకు 10 గ్రెయినులు చొప్పున రెండు మూతాదులలో గాని, 5 గ్రెయినుల చొప్పున నాలుగు మోతాదులలో గాని ఈఇరువది గ్రెయినులను తీసుకొనవచ్చును.

పదిసంవత్సరముల పిల్లలకు మోతాదు.

10 లేక 12 సంవత్సరముల బిడ్దలకు దినమునకు 15 గ్రెయినులతొ ప్రారంభించి 5 దినములయిన తరువాత దినమునకు దినమునకు 10 గ్రెయినులు చొప్పున ఇచ్చి, 10 దినములైన తరువాత ఒకమాసము వరకు దినమునకు 5 గ్రెయినుల చొప్పున నీయవచ్చును.

5 మొదలు 10 సం॥వత్సరముల పిల్లలకు మొతాదు.

5 సంవత్సరములు మొదలు 10 సంత్సరముల వరకు వయస్సుగలబిడ్డలకు మోతాదుకు 5 గ్రెయినులు చొప్పున దినమునకు రెండు మొతాదులు ఈయవలెను.

5 సం॥రముల లొపలి పిల్లలకు మొతాదు.

5 సంవత్సరముల లోపలి వయస్సుగల బిడ్దలకు వయస్సును బట్టి ఒక్కొక సంవత్సరము వయస్సు నకు ఒక్కొక గ్రెయిను మొతాదు చొప్పున దినమునకు రెండుమొతాదులు ఇచ్చుటయుక్తము. సామాన్యముగా జ్వరము హెచ్చుగ నున్నప్పుడు, రెండు గ్రెయినులకంటె తక్కువమోతాదులనిచ్చుట వలన పిన్నలకుకూడ అంతగా నుపయోగకరముగా నుండదని నాఅభిప్రాయము. పిన్నల విషయములొ క్వయినా చేదుగనుండుట యొకగొప్ప అభ్యంతరముగా నున్నప్పుడు "యూక్వినీను" అను చేదులేని మరియొక తరహా క్వయినాను చక్కెరతో కలిపి పొడిగా నీయవచ్చును. నీళ్ళలో కలిసిన యెడల అదికూడ చేదగును. అయినను ఇది చేదుగల క్వయినాయంత గుణణమునీయదు.

జ్వరముతగ్గిన తరువాత చేయవలసిన చికిత్స.

జ్వరము తగ్గినతరువాత చేయవలసిన వైద్యము లొనే సామాన్యముగా మనదేశములో మిక్కిలి అశ్రద్ధ చేయుచున్నారు. జ్వరము నాలుగుదినములు రాకపోయిన తోడనే ఆజ్వరము పోయినదనుకొని ఔషధము తీసికొనుట మానుచున్నారు. ఇదిగాక క్వయినా అనిన మనదేశముప్రజలలో ననేకులకొక విధమైన ద్వేషముగలదు. దానియందు అనేకదుర్గుణములుగలవని చెడువాడుకలుగలవు. అవియన్నియు నంతగా నిజమైనవికావు. క్వయినా తీసికొనినతరువాత కొందరికి తాత్కాలికముగా చెవుడు పట్టుటయు, ఒకానొకప్పుడు పవరుపెరిగి వాంతులు గలుగుటయు, గలదు. కాని వీనిరెంటిని అంతగారోగి గమనించవలసిన పనిలేదు, మందుయొక్క మోతాదును తగ్గించిన వెంటనే చెవుడు పోవును. విరే చనము సాఫీగా అగునట్లు మందు ముందుగా తీసికొని, అనుపానములను కొంచెముమార్చి ఇచ్చిన యెడల క్వయినాయందలి వాంతి గలిగించు గుణము నిలిచిపోవును.

క్వయినాయందు మన ప్రజలకు గల ద్వేషమునకు కారణము.

క్వయినా యందుమనప్రజ లకుండు ద్వేషమునకు మరి రెండుకారణములు గలవు. అందు ముఖ్యమైన దేమనగామన దేశమందలి శాస్త్రజ్ఞానము లేని వైద్యులనేకులు, చలిజ్వరమునకు తాముకూడ క్వయినా ఇచ్చి కుదుర్చునెడల తమ కభిమానమని యెంచి తాము క్వయినాను ఉపయోగించుట లేదని డంబములు కొట్టుచు క్వయినా యొక్క చెడుగుణములు గోరంతలు కొండంతలుగా వర్ణించు చుందురు.

కొందరు స్వదేశవైద్యులు చేయుపద్దతి.

నేనుకూడ క్వయినాయిచ్చి ఒక దినములో జ్వరములను నిలుపగలను. కాని దాని దుర్గుణములకు జడిసి నేను ఎన్నడును దానిని ఉపయోగించను ' అని కొందరు, 'క్వయినా ఇచ్చినయెడల జ్వరము లోపలనే అణగిపోయి శరీరమునకు కీడుకలుగజేయు నని మరికొందును, ఈవైద్యులు చెప్పుచుందురు. మలేరియా పురుగులను క్వయినా ఎంతశీఘ్రముగ నాశనముచేయునో తెలిసికొనినవార లెన్నడును అట్లు చెప్పరు. వీరిలో ననేకులు దానివాసన మారునట్లు కొంచెము కస్తూరినో, పిప్పర మెంటునో, హరతికర్పూ

ఏమందు త్వరలో వ్యాధిని కుదుర్చునో అదియే మంచిమందు.

ముచేత మనదేశమునందు పుట్టినదే మంచిమందనిగాని, మన పూర్వశాస్త్రములయం దెన్నడో చెప్పబడియుండునదే మంచిదనిగాని గర్వపడు వారు బుద్దికుశలులు గారని చెప్పవచ్చును. ఏదేశమునుండి వచ్చినను ఏవైధ్యునిచే కనిపట్టబడినను ప్రపంచము నందలి ప్రజలందరును తగినమందును గౌరవింపవలసినదే.

ప్రజలుక్వయినా యందలి ద్వేషమును విడువవలెను.

కాబట్టి మనదేశీయ వైద్యులు ప్రజలును, క్వయినా యందు తమకు గల ద్వేషమును విడిచి విరివిగ దానిని చలిజ్వరములలో నుపయొగించి దేశముయొక్క ఆరోగ్యస్థితిని బాగుపరుచుదురు గాక యని కోరుచున్నాను.

మాత్రలు ద్రావకము, పొడుము; వీనిలో నేదిమంచిది?
క్వయినాను మాత్రలుగా నిచ్చుట మంచిదా? పొడుముగా గాని ద్రావకముగా గాని ఇచ్చుట మంచిదా? అని సందేహము తొచవచ్చును. చౌకగ వైద్యము చేయుటయే ముఖ్యముగనుండు ధర్మ వైద్యశాలలో క్వయినాకు నిమ్మకాయ రసము లేక డైల్యూటు సల్ ప్యూరికాసిద్ధు మొదలగు పుల్లని ద్రాచ్వకములను కొంచెముచేర్చి ఒక్కొక మోతాదును ఒక్కొక అవున్సు నీటితో కలిపి ఇచ్చుట అనుకూలము.
కొందరు సుకుమారులు చేదు ద్రావకమును త్రాగుటకు ఇష్టపడక పోవచ్చును. అట్టివారికి 

చక్కెరఫాకములో పొదిపిన మాత్రలను ఇచ్చుట యుక్తము. ఈమాత్రలను ఎప్పటికప్పుడు క్రొత్తగా తయారుచేసికొనుచుండ వలెను. ఏలయన మాత్రలు ఆరిపోయి మిక్కిలి గట్టిపడినయెడల నవి జీర్ణకోశములో జీర్ణముగాక మలము నందుపోయి మందంతయు వృధా యగును. అందు చేతనే ఒక్కొకప్పుడొక్కొక్క రోగికి ఎన్నిదినములు ఎన్నిమాత్రలు ఇచ్చినను జ్వరము కుదురక యొకనాడు విరేచనములకు మందిచ్చిన ఆ మాత్రలన్నియు మలములో నొక్కపెట్టున ఉండలుండలుగా వెలువడును.

చక్కెరలో పొదివిన మాత్రల ఉపయోగము.వాలు పాఠ్యం

అయినను చక్కెర పైకప్పుగలమాత్రలు త్వరగా జీర్ణ మగునుల్. వానిని సామాన్యముగా నుపయోగింప వచ్చును. సర్కారువారు చలిజ్వరముగల ప్రదేశములలో క్వయినా పొట్లములను ఉచితముగ పంచిపెట్టుచున్నారు. కొద్ది నలలకు తపాలాఫీసులో అమ్ముచున్నారు.ఈమందు చేదుగ నుండుటచేత ప్రజలలో నంతగా హితవుగా వ్యాపకమగుటలేదు. ఇదిగాక ఇట్టిపద్ధతి ప్రజలకు క్వయినా యందుగల అనిష్టమును హెచ్చించుచున్నది. ఊరక వచ్చుచున్నందు వలన, వారికి దానివిలువ తెలియక పోవుటచేతనే సామాన్య ప్రజలు అట్టి పద్దతివలన లాభములను పొందనేరరు. దీనికి తోడు నేను ఇదివర లో చెప్పియున్నట్లు అజ్ఞానులగు వైధ్యులు దీనిని చేయు దూషణము, చేదువలన ప్రజలకు గలిగిన సహజద్వేషమును హెచ్చించును. సర్కారువారును, దిస్ట్రిక్టుబోర్డులును, మ్యునిసిపాల్టీలవారును, ప్రజల యుపకారమునకై క్వయినాను పంచిపెట్టినప్పుడు, ఆ పంచిపెట్టునది తియ్యనిమాత్రలుగా పంచిపెట్టినయెడల దీనివ్యాపకము ఇప్పటికంటె చలరెట్లు అదికము కాగలద్నినానమ్మకము.

జ్వరముచేత భాధపడునప్పుడు కొన్ని పొట్లముల నొకరోగికి కినినను, జ్వరము కొంచెము నెమ్మది యయినతోడనే ఈ పొట్లములలోని మందు చేదగుటచే వానిని పారవేయుచున్నారు. ఈమందే తియ్యగనున్న యెడల దానిని సామాన్యముగానా రోగివృధాచేయడు, తనకు గుణము తప్పక కనబడుచుండుటచే ఎంతవరక గత్యమో అంతమందును కొని యుపయోగించుకొనును

క్వయినాలలో నేదిమంచిది.

వైద్య శాలలోఫ్ సామాన్యముగ క్వయినా సల్పేటు అను దానిని ఉపయోగించెదరు. దీనినే మనవారు సాధారణముగా క్వయినా అని వాడుదురు. ఇది క్వయినా చేరిన మందులన్నిటిలో చౌక అయినది. దీనిని సామాన్యముగా నందరును వాడవచ్చును. ఒకానొక చోట క్వయినా హైడ్రోక్లేరైడు అనుమందు సల్పేటుకంటె వేగముగను,నిశ్చ యుముగను పని చేయును. దీని వెల కొంచ మధికముగ నుండుటచేత క్వయినా సల్పేటును సామాన్యముగా నుపయోగింపవచ్చును. ఈ సల్ఫేటు నీళ్లలో సరిగా కలియదు. నీళ్లవంటి చింతపండు రసము (చారు), నిమ్మకాయ రసము, మొదలుగాగల పుల్లని ద్రావకములలో నిది మిక్కిలి శేఘ్రముగ లీనమగును. (కలిసిపోవును). కావున క్వయినాను పొడుముగాతీసికొను వారలందరకును ఈరీతిని పుల్లని ద్రావకములలోకలిపి తీసికొనుట యుక్తము.

విషజాతుల చలిజ్వరములలో క్వయినాను నెత్తురులోనికి పిచికారిచేయుట యుక్తము.వాలు పాఠ్యం

కొన్ని ఇషజాతుల చలిజ్వరములలోను, ఒకసారి కుదిరి తిరిగి వచ్చి బాధించు చలిజ్వరముల లోను, క్వయినాను నోటిమార్గమున పుచ్చుకొనుటకంటే దానిని నేర్చిన వైద్యుడు తగిన గాజు పిచికారితో మోతారుకు పది గ్రెయినులు చొప్పున "క్వయినా హైడ్రోక్లోరైడు" ను మందును 20 చుక్కలు కాచిన నీళ్ళలోకలిపి నెత్తురులోనికి పోవునట్లు, పిఱ్ఱమీద కాని భుజముమీదగాని యుండు కండలోనికి పిచికారి చేసిన యుక్తము. దీనివలన శరీరమున కేవిధమయిన బాధగాని అపాయముగాని లేదు. ఇందువలన చిరకలము నుండి శల్యగతమై జీర్ణించిన జ్వరములుకూడా అతి శీఘ్రముగ కుదురును. కొన్ని విషజాతుల చలిజ్వరములలోను, చలిజ్వరపు పురుగుచే కలిగిన జిగట విరేచనములలోను, ఒక మొతాదునకు 60 గ్రెయినుల క్వయినా కలిసిన నీళ్లను ఆసనము ద్వారా పిచ్చికారీ చేసినయెడల నామందు పేగులోనుండి రక్తములోనికిపోయి రోగికి స్వాస్థ్యము కలుగజేయును.

చలిజ్వరముతోకూడిన ఇతర వ్యాధులున్నయెడల వానికి ప్రత్యేకముగ చికిత్స చేయవలెను.

పైనిచెప్పిన చికిత్సయంతయు రోగికి చలిజ్వరముతో పాటు ఇతర రోగములెమియు లెక యున్నప్పుడు మిక్కిలి యనుకూలముగ నడచును. కాని గుండెల యందు గాని, మొదడునందుగాని, ఇతర అవయవములందుగాని, మరియొక వ్యాధి ఏదైన నను చలిజ్వరములో మిశ్రమమై యున్నయెడల పై నుదాహరించిన చికిత్సకు తోడుగా నాయా వ్యాధులకు తగిన చికిత్సలను కూడ చేయుచుండవలెను. ఆ వ్యాధులను వాని చికిత్సలను గూర్చి ఇక్కడ వ్రాయుటలేదు. వ్యాధి నిదానము విషయములో ఎంత మాత్రము సందేహముగా నున్నను, రొగి తగ్ఫిన వైద్యుని సలహాను పుచ్చుకొనవలెను. ఏవైధ్యుని కయినను రోగముయొక్క నిదానమును గూర్చి సందేహ మున్న యెడల ఇతర వైద్యులతొ సంప్రదించవలెను.

                      --