పుట:Chali Jvaramu.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


71

ఆరవ ప్రకరణము

కాళ్లుచేతులు నడుమ లాగినొని పోవుట, గ్రుడ్లు పీకుట, ఎడమ డొక్కలో నొప్పిగా నుండుట, అన్నహితవు తగ్గిపోవుట, విరేసనము, మొదలగునవి ఉండవచ్చును. కొంచెం చలి చలిగా గాని,కొంచము జ్వరమువచ్చినట్లుగాని, యొకదినములో ఏదో ఒక సమయమందు తొచవచ్చును. ఒక్కొక్కపుడు ఈ చిహ్నములు దినము విడిచి దినమున ఉండవచ్చును. మలేరియా పురుగుయొక్క అంటుసోకిన రెండువారము లలోగా ఈ జ్వరమెప్పుడు వచ్చినను రావచ్చును. ఈ జ్వరముయొక్క రాక, రక్తములో ప్రవేశించిన మలేరియా పురుగుల సంఖ్యను బట్టియు వాని శక్తిని బట్టియు, రోరియొక్క బలమును బట్టియు, మారుచుండును. ఈ సూచనలేవియు లేక యే నిజమైన జ్వరము అకస్మాత్తుగా రావచ్చును.

2.నిజమైన చలిజ్వరలక్షణములలో మూడు దశలు గలవు

నిజమైన జ్వరలక్షణములు శీతలదశ

1. శీతలదశా: ఇందు అదివరకున సూచనలు హెచ్చగును. రోగి పనిచేయలేక పోవును. తరుచు ఆవలించుచుండును. ఒడలు విరచుకొనును. తల నొప్పి హెచ్చగును. వెన్ను వెంబడిని, కాళ్లచేతుల