పుట:Chali Jvaramu.pdf/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


100

చ లి జ్వ ర ము

చలిజ్వరపు రోగుల నందరను లెక్కించి వారల కందరకు క్వయినా యియ్యవలెను.

    ఇందులకు ఆ గ్రామమునందు చలిజ్వరముగల నందరిని లెక్కించి జాబితాలు తయారుచేయవలెను. ఆ గ్రామమునందు జ్వరపుగడ్డగల వారి జనాభా లెక్కలు వ్రాయవలెను. సందేహముగనున్న ప్రజలయొక్క, అందు ముఖ్యముగ బిడ్డలయొక్క నెత్తురుబొట్టు నొకదానిని తీసికొని సూక్ష్మదర్శనితో పరీక్షింపవలెను. ఈ ప్రకారము చలిజ్వరసంబంధమైన అనుమానముగల మనుష్యుల జాబితాలు తయారుచేసి వారి కందరకు క్వయినా మాత్రల నియ్యవలెను. చేదుమందు ఇచ్చిన యెడల వారు చాటునకు పోయి దానిని పారవేయుదురు. కావున చక్కెర పైకప్పుగల తియ్యని నాత్రల నిచ్చుట మిక్కిలి ఉపయోగకరము.
 ఇట్లీమందులిచ్చి ఆరు మాసముల వరకు గ్రామములో చలిజ్వరపు రోగి యొక్కడుకూడ లేకుండ గాలించి చేయవలెను. గ్రామములోనికి క్తొత్తగా వచ్చు ప్రతివారిని పరీక్షించి వానిపేరు జాబితాలో చేర్చి వానికి చలిజ్వర మున్నయెడల చికిత్స చేయవలెను. ఇట్లు చేయుటవలన ఆ గ్రామములో దోమలున్నను ఆదోమలకు చలిజ్వరపు పురుగులు దొరకనందున చలిజ్వరము వ్యాపించక కాలక్రమమున నశించి పొవును.
  ఒక గ్రామములోని జనుల కందరకును ఈ ప్రకారము వైద్యము చేయుట సాధారణముగా సాద్య