పుట:Chali Jvaramu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

చ లి జ్వ ర ము


పెట్టునని కనిపెట్టెను. కాని మరియేమియును తెలిసికొనలేక పొయెను.

అంతట 1897 సంవత్సరం ఆగస్టు నెలలో నితడు ఈ క్యూలెక్సు దోమను విడిచి అనాఫలెను (Anopheles) దోమనుపట్టి పరీక్షఛేయుటకు ప్రారంభించెను.

పక్షుల్లోని చలిజ్వరము వంటిజ్వరము

1898-వ సంవత్సరములో ఇతడు కలకత్తాకు మార్చబడెను. ఇక్కడ అప్పుడు చలిజ్వరపురోగులు లేక పోవుటచేత ఈ చలిజ్వరమువంటి మరియొక జ్వరమును పక్షులలో కనిపట్టి ఆ పక్షులను పెంచి తన ప్రయోగములను వానిమీద చేయుచుండెను. ఈ పక్షుల జ్వరమును కలిగించు పురుగులను మలేరియా జ్వరమును కలిగించు పురుగుల వలెనే దోమ కడుపులో పెరుగుటయు అవి దోమయొక్క పొట్ట గోడను చొరుచుకొని రక్తప్రవాహము గుండ ఉమ్మి తిత్తులలోనికి ప్రవేశింఛుటయు కనిపెట్టెను. తరువార నితడు కొన్ని దోమలను పెంచి వానిని ఉమ్మిలో కొన్ని దినములు తరువాత చలిజ్వరపు పురుగుల గ్రుడ్లను కనుకొనెను. ఈ దోమలను రోగములేని పిచికలమీద కఱపించి, 5 మొదలు 8 దినములలో