పుట:Chali Jvaramu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

చ లి జ్వ ర ము


లొను, ఇటుక ఆవములయ్యెద్దను, ఉండు కొలుములను పూడ్చివేయవలెను. పూడ్చుటకు వీలుకానట్టి చెరువుల యందును, లోతులయందును, నుండు నీటిపైని కిరసనాయిల్ ను వారమున కొకసారి పోయుచుండవలెను. అట్లు చేయుటచే నా నీటియందలి దోమపిల్లలు పీల్చుటకు గాలిలేక చచ్చిపోవును. ప్రజల కుపయోగమైనట్టి నూతులు, చెరువులు మొదలగు వానియందు చేపలను పెంచిన వానియందు పెరుగుచుండు దోమపిల్లల నాచేపలు తినివేయును. అనాఫలీసు దోమలు నూతులలో పిల్లలను పెట్టి వ్యాధిని వ్యాపింప జెయుచున్న యెడల, దోమలు చొరలేని దోమ తెరలవంటి ఇనుపవలలతో నా నూతులను చక్కగ మూసి వేయవలెను. రాత్రులయందేగాని పగటి పూట దోమలు సంచరింపవు, కావున, ఆనూతులయందు వానిని గట్టిగా మూసి పెట్టవలెను. లేదా బొంబాయి (Pump) పంపులతొ నీరుతోడుకొన వచ్చును. ఇట్లు నీరు తోడుకొనుట కుపయోగించు బొంబాయి పంపు రు.25-లకు వచ్చును. ఇండ్లలోని తొట్లలలోను, కుడితి గోలెములలోను, రెండుమూడు దినముల కంటె హెచ్చుగ నీటిని నిలువచేయకూడదు. ఇండ్ల లోను, దొడ్లలో, పగిలిపోయిన డబ్బాలను, కుండ పెంకులును, సీసాలను లేకుండ చేయవలెను. లేని