పుట:Chali Jvaramu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

103


చలిజ్వరము వచ్చుటకు వీలులేదు. ఇట్లే దోమలను నశింపు చేయుటకు మనకు సాధ్యమగునా? మనము చేయవలసిన దేమి?

అనాఫలీసు దోమలను నశింపుచేయవలెను.

దోమ లధికముగా గల ప్రదేశములలో నా దోమలను ఎగురుచుండగా వానిని పట్టిచంపుటకు మన మనేక పటాలలములను పెట్టినను వానితో మనము పోరలేము. కాని వాని పిల్లలను పెట్టుకొనుటకు ఈ దోమలకు చోటులేకుండ చేసినయెడల నీ దోమలజాతి ఒక తరముతోనే నశించిపోవును. దోమలు తమగ్రుడ్లను నీటిమీదనే పెట్టునని మనకు తెలిసియున్నది. ఇవి అరంగుళము లోతునకు తక్కువగా నున్న నీళ్లలో తమ గ్రుడ్లను పెట్టవు.

కావున గ్రామమునందును, గ్రామమునకు చుట్టు ప్రక్కలనుండు ప్రదేశము లందును, దోమ పిల్లలు నివాసము చేయుటకు తగియుండు గోతులు, బురద నేలలు, మొదలగు వానియందలి నీటినంతను ఎప్పటి కప్పుడు మురుగు కాలువల మూలమున పోగొట్టి వేయవలెను. గ్రామముల్నకు అరమైలు దూరములో ఊడ్సుచేలుండగూడదు. పంట కాలములలో గడ్దిమొదలగు దుక్కు పెరిగి యున్న యెడల నాకాలువలను బాగుచేసి నీరు చక్కగా ప్రవహించు నట్లు చేయవలెను. ప్రవహించు నీటిలో దోమలు సధారణముగా తమగ్రుడ్లను పెట్టవు. గ్రామము నందలి పాడు నూతులను రోడ్లప్రక్కలను, దొడ్ల