పుట:Chali Jvaramu.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


106

తొమ్మిదవ ప్రకరణము

యెడల వీనిలొ నొకప్పుడు నీరు చేరి దోమ పిల్లలకు అవి నివాసస్థానముగా నేర్పడును.

మన ఇండ్లలోనుండుదోమల నివాసస్థానములు.

 నేను ఒకనాడు నాస్నేహితులకు కొందరకు దోమపిల్లలను చూపవలెనని ప్రయత్నించుచు, తొట్టిలోనైనను, పాత్రడబ్బాలలోనైనను, నిలవ నీరుండునేమో, ఆనీటిలదోమపిల్లలు చిక్కునేమో యని ఇల్లంతయు దొడ్డియంతయు వెదకితిని. ఎక్కడ వెదకినను, దోమపిల్లలకు ఆధారమగుస్థలము నాకు దొరకలేదు. అయినను మాయింటిలో నప్పుడు దోమ లనేకములుండుట  నేనెరిగినవాడ నగుటచేతను, ఆదోమలు ఇంటిలోనే యెక్కడనో పుట్టుచున్న వని నాకు గట్టి యనుమానము గలుగుట చేతను, నేను గదులలోను, అల్మారాలలొను వెదకుటకు ప్రారంభించితిని. కొంచె మించుమించుగ చీకటి కోణ మనదదు సామాను కొట్టునందు నాకుతుదకు ఒక నీటి పళ్లెరము కనబడెను. ఆపళ్లెములోఒక అంగుళములోతు నీరుపోసి ఆనీటిమధ్య నొక ఇటుక పెట్టి దానిపై ఒక చక్కెరడబ్బా పెట్టబడియున్నది. ఆ పళ్లెరమును బైటికి తీసికొనివచ్చి పరీక్షింపగా 4-వ ప్రకరణమందు చూపబడిన దశలన్నిటియందు నుండు దోమపిల్లలు లెక్కింప శక్యముకానన్ని దానిలో నుండెను. బహుశ; ఆదోమపిల్ల లొక లక్ష యుండినను ఉండవచ్చును. ఆపిల్ల లన్నియు క్యూలెక్సు, స్టిగోమియా జాతులలోనివి. అందు