పుట:Chali Jvaramu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

చ లి జ్వ ర ము


అనాఫలీసు దోమపిల్ల యొక్కటి కూడలేదు. మా యింటిలో రాత్రులయందు చెవులప్రక్కను గుయ్యమనుచుండు దోమలు చేరు చుండినందులకును దోమ లధిమముగ నున్నను చలిజ్వరము లేనందునకును కారణము అప్పుడు తెలిసినది. ఇట్లే మనవారలు కొందరు మంచములకు నల్లులెక్కకుండు టకుగాను వాని కోళ్ళక్రింద చిన్నచిన్న నీటితొట్టులను పెట్టుదురు. నీనియందని నీటిని వారెన్నడును సామాన్యముగామార్చుచుండెడి అలవాటులేదు. దోమ పిల్లలు పెద్ద దోమలుగా పరిణమించుటకు సామాన్యముగా పదిదినములు పట్టును. కావున వారమున కొకసారి తప్పక వీనియందలి నీటిని మార్చుచుండినయెడల దోమపిల్లలందు పుట్టనేరవు.

కాబట్టి గ్రామోద్యోగస్థులుగాని, తగిన ఆపీసర్లు గాని, జవానులుగాని వారమున కొకసారి ప్రతి యింటిని చక్కగ శోధించి దోమపల్లలకు ఉనికి పట్టగు స్థలములు లేకుండ జేయవలెను. ప్రజలకు దోమపిల్లలెక్కడ పెరుగునో, దోమల వలన గలుగు నష్టము లెవ్వియో, ఈ విషయముల నన్నిటిని నచ్చజెప్పి ప్రజల సాయముతో పనిచేసిన యెడల నొకగ్రామములోని దోమ నన్నిటిని త్వరలో నశింపు చేయవచ్చును.

అమెరిగా దేశములో దోమపిల్లల నెవ్వరైన ఇట్టి నీటితొట్టులలో పెరుగ నిచ్చిన యెడల వారికి