పుట:Chali Jvaramu.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పరిశిష్టము


ఇంతవరకు గ్రంధమంతయు చదివినవారు చలిజ్వరపు రోగిని గుర్తించుటయును, సామాన్య జ్వరములకు చికిత్స చేయుటయును, కూడ తెలిసి కొనియుందురు. అయినను గడచిన వారములలో నేను చూచిన ఒక రోగి యొక్క వ్యాధి లక్షణములను, ఆరోగికి నేను చేసిన చికిత్సలను వివరించి వ్రాసినయెడల మిక్కిలి యుపయోగకరముగా నుండు నని యెంచి ఈదిగువ నుదాహరించుచున్నాను.

1912-వ సంవత్సరము ఆగస్టు 2-వ తేదిని రాజమ్మకు జ్వరము ప్రారంభించినది. మొదటి నుండియు జ్వరము కాలక్రమము లేక 103 మొదలు 104 డిగ్రీలవరకు వచ్చుచుండెను. వేరొక వైద్యుడు 13-వ తేదీవరకు చికిత్స చేయుచుండెను. మొదట విరేచనములకు ఒకసారి మందిచ్చెనట. పిమ్మట జ్వరము తగ్గు మందులు ఎవ్వియో ఇచ్చుచుండెను. 13-వ తేదీన నేను వెళ్లువరకు క్వయినా సల్ఫేటు 3 గ్రెయినులు మాత్రలు దినము 1-కి రెండు చొప్పున రొగి కిచ్చుచుండిరి. వాంతులు మిక్కిలి అధికముగ నుండెను. నేను రోగిని చూచినది మొదలు జ్వర మెట్లుండునొ తెలియ పరచుటకు ఈ ప్రక్కపుటలోని పటము తయారు చేయబడినది.

దీనిని బట్టి చూడ సాధారణముగా చలిజ్వరము లలో నుండు నటులు రాజమ్మకు అనుదినము గాని దినము విడిచి దినముగాని జ్వరము దిగిపోయి తిరిగి వచ్చుచుండుట లేదని తెలియగలదు. రొగి తనకు తనకు చలి వచ్చుచున్నదని ఎన్నడును చెప్పియుండ లేదు. కాని యెడమ డొక్కలో శ్రధ్దగ పరీక్షింపగా జ్వరముగడ్డ పెరిగి యున్నట్టు స్పష్టముగా తెలియుచున్నది. పూర్వము చికిత్స చేసిన వైధుడు అదివరకే క్వయినా నిచ్చియుండి నందున నేర్పడిన నెత్తురును పరీక్షచేసిన నంతగా నుపయేగముండదని యెంఛి పరీక్షింప లేదు. రొగి యొక్క అవయవముల నన్నిటిని జాగ్రత్తగాపరీక్షిం