పుట:Chali Jvaramu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మలేరియా పురుగు ఇది మన నెత్తుటి లో బ్రతుకును.

ఇది నెత్తురుత్రాగి బ్రతుకునని చెప్పియుంటిమి. ఈపురుగు తన ఆహారమును సంపాదించుకౌనుటకు గాని జీర్ణముచేసి కొనుటకుగాని శ్రమపడదు. ఇతరజీవులచే తయారుచేయబడి సిద్ధంగానున్న ఆహారమునుతిని బ్రతుకును. ఇందుచే నిది జీవశాస్త్రములో పరాన్నభుక్కు లనియెడు (Parasites) జాతిలో చేరుచున్నది. దీనిని ఇద్దరు పోషింతురు. మొదటి పోషకుడు మానవుడు. మానవుల నెత్తురు దీని మొదటి నివాసస్ధానము. మానవులరక్తమను త్రాగిత్రాగి తుదకిది వారికే అపకారముచేయును. దీని పొషకులలో రెండవది ఆడదోమ. ఈ యిద్దరు పోషకుల సాయమున నీపురుగు ఎంతెంత కాలము ఎప్పుడెప్పుడు జెవించునో తెలిసికొనవలెను.

మననెత్తురులోని కణములు

మలెరియా పురుగు మన నెత్తురులో నెట్లు నివసిస్తుందో తెలిసికొనుటకు మన నెత్తురును గురించి ముందుగా నెరుగవలెను. మన నెత్తురులో ఎర్రకణములు తెల్లకణములు అని రెండువిధములగు ఆనుమాత్రములైన జీవులు గలవు. ఇవి రసి అను ఒకానొకవిధమైన ద్రవపదార్ధమునందు తేలుచుండును. నెత్తురుచుక్క నొకదానిని సూదిమొనతో నెత్తి యొకగాజు పలకమీద పరచి తొగరుచెక్క మొద