పుట:Chali Jvaramu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్ని గ్రుడ్లు ఏర్పడును. పిమ్మట ఆడు మలేరియా పురుగు పైనుండుపొర పగిలి దానినుండి అనేకములయిన గ్రుడ్లు వెలువడును. 16, 17, 18 ల చూడుము. ఇవియే పిల్లమలేరియా పురుగులై 1 రోజులో చూపబదిన రక్తకణమున ప్రవేశించ బోవుచున్నవి.

ఒక్కొక్కదోమకాటుకు వందలకొలది మలేరియా పురుగులు నెత్తురులో కలియును

8 మొదలు 18 వరకు చూపబడిన మార్పులన్నియు మలేరియా పురుగులు దోమయొక్క కడుపులో నున్నప్పుడు జరుగుచున్నవి. ఈ మార్పు లన్నియు పూర్తియగుటకు 6 మొదలు 10 దినములుపట్టును. దోమ దోమ కడుపులో నుండి బయలువెడలిన పిల్ల మలేరియాపురుగు లన్నియు దోమయొక్క ఉమ్మితిత్తిలోనికివచ్చియచ్చట చేరియుండును. ఒక్కొక దోమకాటునకు వందలకొలది పిల్ల మలేరియా పురుగులు మన నెత్తురులో కలియును. దోమ ఎంతమందిని ఒక రాత్రియందు కుట్టునో అంతమందియొక్క రక్తం మలేరియా పురుగుల నది ప్రవేశపెట్టును.

మానవులును దోమయే మలేరియా పురుగుకు పోషకులు

.

పయిన వ్రాసిన దానిని బట్టి మలేరియాపురుగు, మానవునిచే కొంతవరకు పోషింబబడియు దోమచే కొంతవరము పోషింపబడియు జీవించు