పుట:Chali Jvaramu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

చ లి జ్వ ర ము

} మలేరియా పురుగు పిల్లలయొక్క యుత్పత్తి ఎప్పుడు ప్రారంభించునో అప్పుడు చలియు ప్రారంభమగును.

జ్వరతీవ్రముగా నున్నప్పుడివి క్రొత్త యెర్ర కణములలో ప్రవేశించును.

2.జ్వరము తీవ్రముగా వచ్చునప్పటికి మలేరియా పురుగు పిల్లలలో ననేకములు తిరిగి క్రొత్త యెర్రకణము లలో ప్రవేశించి యుండును. కొన్ని మాత్రము అప్పుడు ప్రవేశించు చుండును.

విరామకాలములలోని యెర్రకణములను తినుచుండును.

3.చెమటపోసి జ్వరము తగ్గినప్పుడు జ్వరము పూర్ణముగా విడిచియున్న సమయము నందును, అంతకుపూర్వమే యెర్రకణములలో ప్రవేశించిన మలేరియా పురుగు లాయెర్రకణములను తినుచు పెద్దవగుచుండును.

విషజ్వరములలో కొన్నిదినములవరకు వచ్చిన తరువాత సంయోగసహిత సంతానవృద్ది విదానముచే మాత్రము పెంపొందునట్టియు, అర్ధచంద్రాకారము గలిగినట్టియు, ఆడు మలేరియాపురుగులు కూడ రక్తమునందు కన్పట్టును. ద్విఖండన విధానముచే వృద్దిబొందు మలేరియా పురుగులు రక్తములో నున్నప్పుడే జ్వరము పైకివచ్చును. ఇట్టి అర్ధచంద్రా కారముగల మలేరియా పురుగులు మాత్రము రక్తములోనున్నయెడల జ్వరమురాదు.