పుట:Chali Jvaramu.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చలిజ్వర భేదములు

చలిజ్వరభేదములు నాలుగు - ద్వితీయక జ్వరములు - సామాన్య తృతీయక జ్వరములు - విష తృతీయక జ్వరములు - చతుర్థక జ్వరములు - మలేరియా పురుగుల జాతులు నాలుగు - ఒక దినముననే రెండుసార్లు జ్వరము వచ్చుట - తృతీయక జ్వరపు పురుగుల వలన దినదినము జ్వరము వచ్చుట - రెండు మూడు జాతుల జ్వరము ఏకకాలములో వచ్చుట - సామాన్య జ్వరపు పురుగుల యొక్కయు విషజ్వరపు పురుగుల యొక్కయు ఆకార భేదములు. 63-68


చలిజ్వర లక్షణములు

చలిజ్వర లక్షణము లనేకము లన్నిజాతుల జ్వరములకు సామాన్యములు - జ్వరమునకు సూచకములు - నిజమైన జ్వరలక్షణములు - శీతలదశ - ఉష్ణదశ - స్వేదదశ - విరామ కాలము - విషజ్వర లక్షణములు - చలి ప్రారంభించునప్పుడు మలేరియా పురుగు పిల్లలు ఉత్పత్తి యగుచుండును - జ్వరము తీవ్రముగా నున్నప్పు డివి క్రొత్తయెర్రకణములలో ప్రవేశించును - విరామకాలములలో నివి యెర్రకణములను తినుచుండును. 69-77

చలిజ్వర నిదానము

కొన్ని వైద్యశాలలో చేయబడు వైద్యము - అనేక విధములగు జ్వరములు - జ్వరపుగడ్డ పెరిగి ఉన్నదా ? లేదా ? - లేనియెడల చలిజ్వరము గుర్తించుటెట్లు ? - నెత్తురును పరీక్షింపవలెను - సందేహముగా నున్నప్పుడు చేయవలసిన చికిత్స - సన్నిపాత జ్వరము క్షయజ్వరము మొదలగునవి. 78-85

చికిత్స

మొదట విరేచనములకు మందు ఇయ్యవలెను - చలిజ్వరములకు క్వయినా సిద్ధౌషధము - క్వయినాను ఎప్పుడు ఎట్లు ఇయ్యవలెను -