పుట:Chali Jvaramu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ii

రన్ ' కనిపట్టెను—దోమలకు మలేరియాకు సంబంధమున్నదని ' మేన్ సన్ ' కనిపట్టెను—దోమకడుపులో మలేరియా పురుగులు పెరుగుట ' రాస్ ' కనిపట్టెను—పక్షులలోని చలిజ్వరమువంటి జ్వరము—దోమ మూలముననే చలిజ్వరపు పురుగు వ్యాపించుచున్నది. 19-38

మలేరియా పురుగు

మలేరియా పురుగు మూలపదార్థపు సముదాయము - మలేరియా పురుగు, ఇది మన నెత్తురులో బ్రతుకును - మన నెత్తురులోని కణములు - నెత్తురులోని తెల్లకణములు - నెత్తురులోని ఎర్రకణములు - నెత్తురులోని మలేరియా పురుగులు - ద్విఖండ సంతానవృద్ధి విధానము - ఒక దినము కనేకలక్షలు పిల్లలు పుట్టును - సంయోగ సంహిత సంతానవృద్ధి - మలేరియా పురుగు - ఆడు మలేరియా పురుగు - ఒక్క దోమకాటునకు వందలకొలది మలేరియా పురుగులు నెత్తురులో కలియును - మానవులును దోమలే మలేరియా పురుగుకు పోషకులు - మలేరియా పురుగుల జాతి భేదములు. 39 - 46


దోమ

వివిధజాతుల దోమలు - అనాఫలీసు క్యూలెక్సు దోమలను వేర్వేరుగ గుర్తించు విధము - ఆడు అనాఫలీసు దోమను గుర్తించు విధము - దోమయొక్క రూపభేదములు నాలుగు 1. గ్రుడ్డు. 2. నీటిపురుగు. 3. కామాపురుగు. 4. రెక్కలుగల పురుగు - దోమలగ్రుడ్లు - దోమలు నీటిపురుగులు - దోమగూడు - రెక్కలుగల దోమలు - దోమపిల్లలను పరీక్షించు విధము - దోమపిల్లలను పట్టుసాధనము - అనాఫలీసు దోమల యుపజాతులు, వాని నివాసస్థానములు - అనాఫలీసు దోమల నడవడికల సంగ్రహము - క్యూలెక్సు దోమపిల్లల నివాసస్థానములు - స్టిగోమియా దోమపిల్లల నివాసస్థానములు - దోమలయొక్క నైసర్గిక విరోధులు - దోమలను నశింపుజేయు ఇతర సాధనములు. 47-6-