Jump to content

చలిజ్వరము/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మలేరియా పురుగు

మలేరియా పురుగుమూల పదర్ధపు సముదాయము
  • చలిజ్వరముయొక్క కారణము చక్కగ తెలిసి కొనవలెనన్న మలేరియా పురుగు యొక్కజీవిత చరిత్రను మొదట తెలిసికొనవలెను. వేరొకమాట తెనుగు భాషలో లెనందున దీనికి పురుగు అనిపేరు పెట్టితిమేకాని దీనియొక్క నడవడికలు చదివిన పిమ్మట ఇది సామాన్యమైన పురుగుకాదని మీరు తెలిసి కొనగలరు. ఇది జీవశాస్త్రములోని వికారిణీ (Amoeba) వంటిది. విజ్ఞానచంద్రికా గ్రంధమూలలో ని 3-వ గ్రంధమగు జీవశాస్త్రముయొక్క మొదటి ప్రకరణము చూడు. ఇదియు దానివలెనె జీవస్ధానముగల మూలపదార్ధపు సముదాయము. 9-వ పటము చూడుము. దీనికి నోరు లేకున్నను నిదినెత్తురు త్రాగి వృద్ధిపొంది పిల్లలను పెట్టును. వీనిని ఒకదానిపైనొకటిని దొంతరగాపెట్టిన ఒక అంగుళము ఎత్తునకు 3000 మొదలు 24000 వేలవరకు పట్టును. దీనికి కాళ్లుచేతులు లేకున్నను నిది ఒక చోటనుండి మరి యొకచోటికి ప్రాకగలదు.

మలేరియా పురుగు ఇది మన నెత్తుటి లో బ్రతుకును.

ఇది నెత్తురుత్రాగి బ్రతుకునని చెప్పియుంటిమి. ఈపురుగు తన ఆహారమును సంపాదించుకౌనుటకు గాని జీర్ణముచేసి కొనుటకుగాని శ్రమపడదు. ఇతరజీవులచే తయారుచేయబడి సిద్ధంగానున్న ఆహారమునుతిని బ్రతుకును. ఇందుచే నిది జీవశాస్త్రములో పరాన్నభుక్కు లనియెడు (Parasites) జాతిలో చేరుచున్నది. దీనిని ఇద్దరు పోషింతురు. మొదటి పోషకుడు మానవుడు. మానవుల నెత్తురు దీని మొదటి నివాసస్ధానము. మానవులరక్తమను త్రాగిత్రాగి తుదకిది వారికే అపకారముచేయును. దీని పొషకులలో రెండవది ఆడదోమ. ఈ యిద్దరు పోషకుల సాయమున నీపురుగు ఎంతెంత కాలము ఎప్పుడెప్పుడు జెవించునో తెలిసికొనవలెను.

మననెత్తురులోని కణములు

మలెరియా పురుగు మన నెత్తురులో నెట్లు నివసిస్తుందో తెలిసికొనుటకు మన నెత్తురును గురించి ముందుగా నెరుగవలెను. మన నెత్తురులో ఎర్రకణములు తెల్లకణములు అని రెండువిధములగు ఆనుమాత్రములైన జీవులు గలవు. ఇవి రసి అను ఒకానొకవిధమైన ద్రవపదార్ధమునందు తేలుచుండును. నెత్తురుచుక్క నొకదానిని సూదిమొనతో నెత్తి యొకగాజు పలకమీద పరచి తొగరుచెక్క మొద లగు కొన్ని రంగులు దానికి పట్టించి ఆరనిచ్చి 12 వందల రెట్లు వృద్ధిగ కనుపింపజేయు సూక్ష్మదర్శినితొ పరీక్షింపగా 10-వ పటములో చూపబడిన ప్రకారము కనిపించును.

నెత్తురులోని తెల్ల కణములు..

అందు 1,2,3,4, అను అంకెలుగలవి తెల్ల కణములు. వీనిలో రంగుల భాగము జీవస్థానము. ఇది పలువిధములైన తెల్లకణములతొ పలువిధములగ నుండును. ఈ జీవ్సస్థానముచుట్టు నుండునది మూల పదార్ధము. దీనికి తేలికైన ఎర్రరంగు పట్టియున్నది. ఈ తెల్లకణములు మన పేగులలొ జీర్ణమైన ఆహారమును మనరక్తములోనికి జేర్చును. మన శత్రువులగు సూక్ష్మ జీవులు మొదలగునవి మనరక్తములోనికి ప్రవేశించినప్పుడీ వానితో కలహమాడి వాని నాశింపజేయుట కెల్లపుడు సిధ్దముగానుండును.

నెత్తురులోని ఎర్ర కణములు

ఈ అంకెలుగల కణములుగాక మిగిలినవి ఎర్ర కనములు. ఈఎర్రకణములలో జీవస్థానములేదు. ఈ ఎర్రకణములే మన జీవమునకు ముఖ్యాధారమైన ప్రాణవాయువును (Oxygen-ఆమ్లజని) మన ఊపిరి తిత్తులనుండి మననెత్తురులోనికి జేరవేయును.

నెత్తురులోని మలేరియా పురుగులు

11-వ పటములో (మ) అనుచోటులందు గల నెత్తురులోని యెర్రకణములలో మలేరియా పురుగులు పెరుగుచున్నవి. అందు కొన్ని చిన్నవి. కొన్నిక్రమముగా పెరిగి ఎర్రకణములను తిని నశింపు చేయుచున్నవి. ఎడమప్రక్క నొకచోట మలేరియా పురుగులు గ్రుడ్లు ఒక గుంపుగానున్నవి. అవియును యెర్రకణములలో ప్రవేశించుటకు ప్రయత్నించు చున్నవి. రక్తము నందలి ఎర్ర కణములే మలేరియా పురుగుల కాహారము.

ద్విఖండ సంతానవృద్ది విధానము.

ఈ యెర్ర కణములో ప్రవేశించిన మలేరియా పురుగు ఎట్లు పెరుగునో మనము తెలిసికొనవలెను. 1,2-వ పటములలో చూడుము. అందు 1. సాధారణమైన యెర్రకణము 2. అయెర్రకణములో మలేరియాపురుగు ప్రవేశించినది. 3. ఈ యెర్ర కణము లోని మలేరియా పురుగు పెద్దదయినది. 4. ఈయెర్రకణములో నీపురుగుయొక్క జీవస్థానము రెండుగావిభజించబడినది. 5. ఈ యెర్రకనములో మలేరియా పురుగుయొక్క జీవస్థానం అనేక ముక్కలుగా విభాగముజెంది ఒక్కొకముక్కచుట్టు కొంత మూలపదార్ధముచేరి ఒక్కొక్కముక్క యొక్కొక మలేరియాపురుగు పిల్లయగుచున్నది. 6. ఈయెర్ర

42

చ లి జ్వ ర ము

కణమును పగల్చుకొని అనేక మలేరియా పురుగు పిల్లలు వెలువడుచున్నది. అవి తిరిగి 1. యనుచోట చూపబడినట్లు యెర్రకణములలో ప్రవేశించ బోవుచున్నవి. ఇది సాధరణముగా మలేరియాపురుగు యొక్క సంతానావృద్ది (Reproduction)


                12-వ పటము

విధానము. మనరక్తములో ప్రవేశించిన మలేరియా పురుగు లనేకము లిట్లేయొక్కొకటి వందలు వందలుగా పెరుగును. ఈ మలేరియా పురుగులు మన రక్తములో లక్ష యెర్రకణముల కొక్కటి చొప్పున నున్నయెడల జ్వరము ప్రారంభ మగునని కొందరు కనిపట్టియున్నారు.

ఒక దినమున అనేక లక్షల పిల్లలు పుట్టును

మన రక్తములో ప్రవేశించిన తరువాత ఈ ప్రకారము ఒక్కొక్క దినమునకు ఒక్కొక్క మలేరియా పురుగునుండి అనేక లక్షలు పిల్లలుపుట్టి పెద్దరుగు చుండును. ఇట్ఘ్లు దినదినమునకు కోట్లకొలది మలేరియా పురుగులు పెరిగి రక్తములోని యెర్రకణములన్నిటిని తిని రోగిని కృశింపజేయును. ప్రక్కనున్న 13-వ అటము చూడుము. కొంత కాలమున కారోగిచ్చ్చినయెడల ఆరోగిలయం దుండు మలేరియూపురుగు లన్నియు చావవలసినదే కదా? సృష్టి వైచిత్ర్య మేమోగాని ఈ జాతిజీవు లిట్లు నశింపక తరతరమునకు వృద్ధియగుటకై వేరొక విధమైన సంతానవృద్ధివిధానము ఏర్పడియున్నది.

సంయోగ సహిత సంతానవృద్ది

రెండవవిధమయిన సంతానవృద్ధికి సంయోగ సహిత సంతానవృద్ధి యని పేరు. ఈ రెండవ

విధమయిన సంతానవృద్ధికి సాయపడుట కే దోమలు పోషకులగుచున్నవి. మన రక్తములోని ఎర్రకణములలోనుండు మలేరియా పురు గులు కొన్ని 22-వ పటమునందు 3,4,5,6 లలో చూపబడిన ప్రకారము యుక్తవస్సునకు పెరిగిన తరువాత వాని జీవస్థానవిభాగమునొందక 7 లో చూపబడిన ప్రకారము అర్ధ చంద్రాకరము నొందును. దీని నుండి 8, 6 పటముల లో చూపబడిన ప్రకారము

రెండువిధములగు మార్పులు కలుగును 8 లోచూపబదినది మొగపురుగుగను 9 లో చూపబడినది ఆడదిగను పరిణమించును.

మొగ మలేరియా పురుగు

మొగరానియొక్క జీవస్థానము 10 లోచూప బడిన ప్రకారము ముక్కలుముక్కలై 12 లో చూపబడిన ప్రకారము ఒక్కొక్క జీవస్థానముచుట్టు కొంత మూలపదార్దముచేరి తోకలుగానేర్పడును. ఈ తోకలు పరిపక్వమైన తరువాత ఊడిపోవును. ఈతోకలే పురుషబీజములు. అనగా ఒక్కొకటి ఒక్కొక ఆడు మలేరియాపురుగుతో చేరి 14 లో చూపబడిన ప్రకారం సంయోగము నొంది దానిని గర్భవతిగా జేయును.

ఆడ మలేరియా పురుగు

9 లో చూపబదిన ఆడుమలేరియా పురుగు మగమలేరియా పురుగు వలె విభాగమునొందక11, 13 లోచూపినప్రకారము గుండ్రనై పెద్దదియగును. 14 లో నొక ఆడుపురుగు పురుషబీజముతో సంయోగమునొంది గర్భవతి యగుచున్నది. ఇట్లు గర్భవతి అయినతోడనే దానిగుండ్రని ఆకారం మరి కోను గా నగును. పిమ్మట దానిజీవ స్థానముమనేక ముక్కలుగా చీలి ఒక్కొక ముక్క చుట్టు కొలత మూలపదార్దమేర్పడి దానినుండి లెక్కలే నన్ని గ్రుడ్లు ఏర్పడును. పిమ్మట ఆడు మలేరియా పురుగు పైనుండుపొర పగిలి దానినుండి అనేకములయిన గ్రుడ్లు వెలువడును. 16, 17, 18 ల చూడుము. ఇవియే పిల్లమలేరియా పురుగులై 1 రోజులో చూపబదిన రక్తకణమున ప్రవేశించ బోవుచున్నవి.

ఒక్కొక్కదోమకాటుకు వందలకొలది మలేరియా పురుగులు నెత్తురులో కలియును

8 మొదలు 18 వరకు చూపబడిన మార్పులన్నియు మలేరియా పురుగులు దోమయొక్క కడుపులో నున్నప్పుడు జరుగుచున్నవి. ఈ మార్పు లన్నియు పూర్తియగుటకు 6 మొదలు 10 దినములుపట్టును. దోమ దోమ కడుపులో నుండి బయలువెడలిన పిల్ల మలేరియాపురుగు లన్నియు దోమయొక్క ఉమ్మితిత్తిలోనికివచ్చియచ్చట చేరియుండును. ఒక్కొక దోమకాటునకు వందలకొలది పిల్ల మలేరియా పురుగులు మన నెత్తురులో కలియును. దోమ ఎంతమందిని ఒక రాత్రియందు కుట్టునో అంతమందియొక్క రక్తం మలేరియా పురుగుల నది ప్రవేశపెట్టును.

మానవులును దోమయే మలేరియా పురుగుకు పోషకులు

.

పయిన వ్రాసిన దానిని బట్టి మలేరియాపురుగు, మానవునిచే కొంతవరకు పోషింబబడియు దోమచే కొంతవరము పోషింపబడియు జీవించు నని తెలియుచున్నది. ఈ రెండును కాని చోట ఇదియొక క్షణమైనను బ్రతుకదు. ఒకమానవుని నుంది మరియొక మానవునకు మలేరియా అందు కొనవలెనన్న దోమయొక్క సాయములేనిదే కానేరదు.

మలేరియా పురుగుల జాతిభేదములు

.

మలేయా పురుగులలోన ననేకభేదములు గలవు. వాని నీ చిన్న గ్రంధమునందు వర్ణింఛుటకు వీలు లేదు. అయినను వాని జాతిభేదములను గూర్చిన కొన్ని ముఖ్యాంశములను చలిజ్వరభేరములను ప్రకరణములో వివరించెదను.