చలిజ్వరము/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రెండవ ప్రకరణము

చలిజ్వరము యొక్క పూర్వచరిత్ర

చలిజ్వరమునకు (1) మన్యపు జ్వరము (2) వరుస జ్వరము (3) శీతకాల (శీతకట్టు) జ్వరము అని మారుపేర్లు. ఈ జ్వరమునకు ఇంగ్లీషున మలేరియా (Malaria) అని పేరు.

మన్యపుజ్వరము:- మన్యములనగా అడవిప్రదేశాములు. అచ్చట ఈజ్వరము హెచ్చుగ వ్యాపించి యుండును. కనుక ఈ జ్వరమును మన్యపు జ్వరమందురు. కాని ఇప్పుడీజ్వరము నిజమయిన అడవులనుండి చెన్నపట్టణము బొంబాయి మొదలగు మహా పట్టణములను నివాసస్థానముగా నేర్పరచుకొనుటచేత దీనికి ఈ పేరు నిరర్ధమ మగుచున్నది.

వరుసజ్వరము:- దినమువిడిచి దినముగాని, దినము దినముగాని, క్రమముతప్పక వచ్చుచుండుటచే నీ జ్వరమునకు చెన్నపట్టణపు ప్రాంతములందు వరుస జ్వరమని పేరు.

20

చ లి జ్వ ర ము

మలేరియా:- ఈపదమునకుఇంగ్లీషుభాషలో చెడుగాలి అని వ్యుత్పత్త్వర్ధము.ఈజ్వ్రము బురద గుంటలు మొదలగు వానినుండివచ్చు చెడుగాలిని పీల్చుటవలన కలుగుచున్నదని ఆంగ్లేయులు కొంతకాలముక్రిందట నమ్మియుండిరి.అందువలన దీనికి మలేరియా అని పేరుపెట్టిరి. కాని క్రింద మీరు చదువబోవు ప్రకారము ఈజ్వరమునకు ముఖ్యకారణము దోమకాటని స్పష్టపడి యున్నందున మలేరియా అను పేరుగూడ నిరర్దకము.


దోమజ్వరము:- కొందరు దీనికి దోమజ్వర మని పేరు పెట్టిన బాగుగనుండునని తలచిరి.

కాని చలిజ్వరమన్నపేరు అనేక ప్రదేశములలో తరుచుగ వాడుకలోనున్నందునను,సాధారణముగా ఈజ్వరమునకు ముఖ్యచిహ్నములు చలియు జ్వరమును అయి యున్నందునను, చలిజ్వరమను పేరే వాడుచున్నారు.

శీతకాల జ్వరము:- శీతకాలమునందు అనగా నవంబరు, డిశంబరు, జనవరి నెలలలో ప్రబలి యుండుటచే ఈజ్వరమునకు శీతకాల (శీతకట్టు) జ్వరమనియు కొన్ని చోట్ల పేరుగలదు.

21

రెండవ ప్రకరణము

(1) నియమితకాలమునకు జ్వరమువచ్చుట:- ఏదో యొకక్రమమున ప్రతిదినమునగాని దినమువిడి దినముగాని, రెండుదినములు విడిచి మూడవ దినమునగాని, జ్వరమువచ్చుట. అనగా జ్వరము వచ్చి పదిమొదలు 24 గంటలకుగసని, 48 గంటలు గాని, 72 గంటలుగాని తిరిగి జ్వరమువచ్చుట.

(2) విడిచి విడిచి జ్వ్రము వచ్చుట:- ఒకనాటి జ్వరమునకును మరియొకనాటి జ్వరమునకును మధ్య కొంతకాలము జ్వరములేకుండ నుండుట.

(3) జ్వరము సాధారణముగస చలితో ప్రారంభించి చెమటతో విదుచుట.

(4) రక్తహీనము, జ్వరపుగడ్డ, మొదలగునవి దీర్ఘ జ్వరములచే కలుగుట.

ఇవి ఈవ్యాధియొక్క ముఖ్య చిహ్నములు.

(1) పూర్వచరిత్ర:--

మనదేశపు వైద్యులు పూర్వకాలమునందు ఈ జ్వరములను గుర్తించి యున్నారు. ఈజ్వరములను మనప్రాచీన గ్రంధములలో విషజ్వరములని వాడి యున్నట్లు తొచుచున్నది. ఈ విషయమై వైద్యరత్న పండిత డి.గోపాలాచార్యుల వారిచే ఆంధ్ర వ్యాఖ్యాన సహితముగ ప్రచురింపబదిన 'మాధవ

23

చ లి జ్వ ర ము

విదానము ' నుండి కొన్ని భారములను క్రింది కనబరుచు చున్నాను.

విషజ్వర భేదములు

    "శ్లో॥ సన్తత స్సతతొz న్యేద్యు
             స్తృతీయక చతుర్ద కొ॥

తా. సన్త్వత జ్వరమనియు, సతత జ్వరమనియు, అన్యేద్యుష్కజ్వరమనియు, తృతీయకజ్వరమనియు, చతుర్ధక జ్వరమనియు, విషంజ్వరం ఐదువిధంభులై యుండునని భావము.

రసము, రక్తము, మాంసము, మేనస్సు, అస్థి, మన్ధ, శుక్రము అనుధాతువుల నాశ్రయించి యున్న వాత, పిత్త, శ్లేష్మములను దోషముచే నీజ్వరములు గలుగుచున్న వని చెప్పబడి యున్నది.

  శ్లో॥ సన్తతంసరక్తస్ధసొన్యేద్యు: ఏశితాశ్రిత:
       మేదోగతస్తృతీయేహ్ని ; అస్ధిమజ్జగ్తవున
       కుర్యాచ్చర్ధకంయారం: అన్తకంరోగ

[సజ్కరం॥

తా॥ సంతత జ్వరము రసధాతువు నాశ్రయించి జనించుననియు, నతతజ్వరము రక్తధాతువు నాశ్ర యించిజనించుననియు, అన్యేద్యుష్కంబనుజ్వరము మాంసము నాశ్రయించి జనించుననియు, తృతీయక జ్వరముమేధస్సు నాశ్రయించి జ్రవమువ్యాపిం

28

రెండవ ప్రకరణము

చిన దినమునకు మూడవ దినము నందు వరుసగా వచ్చుననియు, అస్ధిమజ్జల నాశ్రయించి జ్వరం వ్యాపించినదినమునకు నాల్గవదినమున మరల వ్యాపిందునది చతుర్ధక జ్వరమనియు భావము. అట్టి చతుర్ధక జ్వరము ఓరున నసక్యమై యమునిబోలె ప్రాణముల హింసించుచు అనేకరోగముల గలిగించును. మరియు చరకమున:-

'రక్తధాత్వాశ్రయస్తాయోదోష న్సతతకంజ్వరం.'

"రక్తధాతువు నాశ్రయించి సతత జ్వరము తరుచుగ జనించును." అని యుండుటంజేసి ప్రకృత మూలమున "సంతత" అనుపదము "సతత" అను పదమునకుగూడ నుపలక్షణంబుగాన సతతజ్వరము రక్తధాతువు నాశ్రయించి యుండుననే యర్ధము లభించెనని యెరుంగునది.

శ్లో॥ సప్తాహంనా దశాపాలనా ద్వాదశాహ
     మధాసినా! నస్తత్యాయోవిసర్గస్యాత్సన్త

[తప్పనిగద్యతే॥

తా॥ఏడుదినముల కాలమైనను పదిదినములకా సంతతలమైనన్ పదిరెండు దినముల కాలమైనను ఒకక్షణ కాలముగూడ విడువక అనుసరించియుండు జ్వరము.

సంతత జ్వరము

24

చ లి జ్వ ర ము

సంతత జ్వరమనంజను. ఇచ్చట దోషత్రయ ప్రకొపముచే జనించిన నన్తత జ్వరమునందు వాతము అధికముగ నున్నచో ఏడుదినముల వరకు జ్వరము విడువక అనుసరించి యుండుననియు, పిత్తము అధికముగ నుండునపుడు జనించినజ్వరము పదిదినముల వరకు నిరంతరముగ వ్యాపించియుండు ననియు, కఫము అధికముగ నుండునపుడు కల్గిన జ్వరము పదిరెండు దినములవరకు ఎడలేక యుండుననియు అర్ధము.

సతత అన్యేధుష్క తృతీయక చతుర్ధక జ్వర లక్షణములు.

 శ్లో॥ అహోరాత్రేనతతకో ద్వౌకాలావనువర్తతే,
      అన్యేద్యుష్కన్త్వహోరాత్ర ఏకకాలం ప్రవక్తతే
      తృతీయస్తృతీయేహ్నిచ్రుర్హేహ్ని చతుర్ధకం

తా॥ రాత్రిపగలు ఈరెండుకాలములయందును అనగా పగటియందు జ్వరము వ్యాపించి సాయంకాలమున శమించి మరల రాత్రియందు జ్వరవేగమును

సతత జ్వరము

జూపునది సతత జ్వరమని భావము. రాత్రియందైనను అగటియందైనను ఒక కాలమున వ్యా

అన్యేద్యుష్క జ్వరము

25

రెండవ ప్రకరణము

పించునది. అన్యేద్యుష్కజ్వరమని చెప్పందగును. జ్వర వేగము కల్గిన దినము మొదలు మూడవనాడు మరల వ్యాపించునది తృతీయక జ్వరమనందగు. జ్వర్ వేగము కల్గిన దినమునకు నాల్గవనాదు వ్యాపించునది.

తృతీయక జ్వరము

చతుర్ధక జ్వరమనదగు . ఇచట పగలు రెండుకల ములయందును రాత్రి రెండుకాలములయందును వ్యాపించు జ్వరము సతతక జ్వరమనియు,

చతుర్దక జ్వరము

పగలు ఒక కాలమునందును రాత్రియొక కాలమునందును వ్యాపించునంది అన్యేధుష్క జ్వరమనియు కొందదు వచించెదరు.

మతాంతరమున విషజ్వర లక్షణము:-

శ్లో॥ కేచిద్బూతాభిషజ్గోత్ధం
      బ్రువతే విషమజ్వరమ్॥
తా॥ కొందరు భూతసంబంధమువలన జనించిన జ్వరమునకు విషజ్వరమని వచించెదరు.
శ్లో॥కఫపిత్తాత్త్రిక గ్రాహీన్బష్టాద్వాతరి ఫాత్మక:
     వాతపిత్తాచ్చిరొగ్రాహిత్రి విధ స్స్యాత్తృతీయక:॥

తా॥ కఫపిత్తములు అధికములై యున్నప్పుడు జనించిన తృతీయక జ్వరము తొలుత వెన్నెముకకు జ్వరభేదములు క్రిందిభాగమున వేదనను కల్గించి శరీరమున వ్యాపిం

తృతీయక జ్వరభేదములు

26

చ లి జ్వ ర ము

చును. వాతకఫములు అధికములై యుండునప్పుడు జనించు తృతీయక జ్వరము తొలుతవీపునందు వేద నను కల్గించి శరీరమున వ్యాపించును. తావపిత్తములు అధికంబులై యుండునపుడు జనించు తృతీయక జ్వరము తొలుత శిరస్సునందు వేదనగల్గించి పిమ్మట శరీరమున వ్యాపించును. ఇత్తరంగున తృతీయక జ్వరము మూడువిధంబులై యుండును.

చతుర్ధక జ్వరభేదము

శ్లో॥ చతుర్ధకోదర్శయతి ప్రభావంద్వివిధంజ్వర॥
     జజ్ఝౌభ్యాంశ్లైష్మక: పూర్వంశిరస్తోనిలనంభ వ:॥

తా॥ వాతపిత్త కఫములలో కఫ మధికముగ నున్నపుడు జనించుచతుర్ధక జ్వరము తొలుతపిక్క లయందు నొప్పిని కల్గించి పిదప శరీరమునవ్యాపించును. ఇత్తెరంగున రెండు విధములైన శక్తిని చతుర్ధక జ్వరము జూపునని భావము.

రసగతి జ్వర చిహ్నములు

శ్లో॥ గురుతా హృదయోత్ల్కేశ
      న్సదనం చర్ధ్యరోచకౌ:
     రసస్థేతుజ్వరేలిజ్గం
     దైన్యంచాస్యోన జాయతే॥

27

రెండవ ప్రకరణము

తా॥ జ్వరంకు రసగతంబైన యపుడు శరీరము భారముగా నుండుట, రొమ్మడపు, అవయవములు శిధిలంబులై యుండుట, వమనము, అరుచి, మనస్సున క్లేశము గల్గుట, ఇట్టి చిహ్నములుగల్గును. మున్నునచించిన వాతపిత్త కఫములచే జనించిన నానావిధ జ్వరములను ఈలక్షణములచేత రసగతంబు లని యెరింగి రసాదిధాతువులకు నిరోధము గల్గ నీయక నాయాజ్వరమునకు చికిత్స జేయవలె నని భావము. క్రిందచెప్పబడు రక్తాది ధాతువుల యందును ఈరీతిగనే యెరుంగునది.

రక్తతగజ్వర లక్షణము.

శ్లో॥ రక్తనిష్ఠీవనందాహో।
     మో పాశ్చర్దిర్దేహ విభ్రమౌ।
     ప్రలాస। పీదకాకృష్ణా
     రక్తస్తాప్తేజ్వరేనృణామ్।

తా॥ రక్తమును ఉమియుటయు, తాపము, మూర్చ, వమనము, ఒడలుతిరుగుట, అనర్ధముగ మాటలాడుట, శరీరమున బొబ్బలు లేచుట, దప్పి, ఈలక్షణములు రక్తగతమైన జ్వరమునందు మనుజులకు కల్గును.

మాంసగతి జ్వరలక్షణము

శ్లో॥ సిణ్ణికొద్వేష్టనం తృష్ణా
     నృష్టమూత్రపురీషతా.

28

చ లి జ్వ ర ము

ఉష్మాన్త ర్ధాహవిక్షేపౌ
గ్లానిస్స్యాన్మాంసగేజ్వరే॥

తా॥ పిక్కల యందుండు మాంసమున కట్టెలతో గొట్టిన రీతిగ బాధగల్గుట,దప్పి, మూత్రపురీషము లధికముగా బైలు వెడలుట, ఒడలుముగుల వేడిగానుండుట, శరీరమునకు లోపల తాపముగల్గుట, హస్త పాదద్వవయవములను చలింప చేయుట, శరీరము బడలియుండుట, ఈలక్షణములు మాంస గతమైన జ్వరమునందు విశేషముగ కలుగును.

మేదోగతి జ్వరలక్షణము

శ్లో॥ భృశం స్వేదన్తృషా మూర్చా
     ప్రలాపశ్చ ర్ధీరేవచ ।
     దౌర్ఫంధ్యారోదకౌగ్లాని
     ర్మేదస్ధ్సే చనహిష్టం తా॥

తా॥ మేదోగతమైన జ్వరమునందు మిక్కిలి చెమటయు, దప్పికయు, మూర్చయు, అర్ధములేక అధికముగా మాట్లాడుటయు, వాంతియు, శరీరమున దుర్గందంబును, అరుచియు, బడలియు, బాధల నోర్వ జాలకుండుటయు. ఈలక్షణములు కలుగును.

అస్థిగత జ్వర లక్షణము

   శ్లో॥ భేదోస్ధ్నాం కూజనం శ్వాసొ
         విరేకశ్చర్దిరేవచ।

29

రెండవ ప్రకరణము

   నిక్షేపణంచ గాత్రాణాం
   ఏతదస్థిగతేజ్వరే॥

  తా॥ అస్థిగతమైన జ్వరమునందు అస్థులలో విరిగినట్లు నొప్పిగల్గుట, కంఠమునకూతలు బుట్టుట, శ్వాసంబధికమగుట, విరేచనము, వాంతి, చేతులు, కాలు మొదలయిన అవయవములన్ కదలించుట. ఇట్టి లక్షణములు కలుగును.

మజ్జగత జ్వర లక్షణము.

  శ్లో॥ తమ:ప్రవేశన్ం హిక్కా
        కానశ్శైత్యంవమిస్తధా।
       అస్తర్ధాహో మహాశ్వాసొ
       మర్మభేదశ్చమజ్జగే॥

తా॥ మజ్జగతమైన జ్వరమునందు చీకటిలో ప్రవేశించినట్లు కన్నులుగానరాకుండుట, వెక్కిళ్లు, దగ్గు, చలి, వాంతి, అస్తశరీరమున తాపముగల్చుట, శ్వాసాధికారమున జెప్పంబడు మహాశ్వాసము మర్మంబుల భేదించినరీతిగ బాధగల్గుట ఈ లక్షణము లు గల్గును.

శుక్రగత జ్వర లక్షణము.

శ్లో॥ మరణం ప్రాప్ను యాత్తత్ర
      శుక్రస్థానగ తేజ్వరే
      శేఫన స్త్సబ్దతామోక్ష
      శ్శుక్రస్యతు విశేషత:॥

30

చ లి జ్వ ర ము

 తా॥ శుక్రస్థానమును పొందిన జ్వరమునందు మేధ్రము స్తంభించి యుండును. శుక్రం బధికమగా స్రవించును. రసాదిధాతువులలో శుక్రగత జ్వరము నందు మనుజుడు మృతుండగును.
 రసాది ధాతుగత జ్వరములలో సధ్యాసాధ్య నిర్ణయము.

శ్లో॥ రసక్తశ్శీతస్సాధ్యోమాంసమేదో గతశ్చయ॥
     అస్థిమజ్జగత:కృచ్చశుక్రస్థస్తునసిధ్యతి॥

 తా॥ మున్ను చెప్పిన రసదిగత జ్వరములలో రస రక్త మాంసమేదోగత జ్వరములు సాధ్యం బులై యుండును. అస్థిమజ్జలనాశ్రయించిన జ్వరములు కష్ట సాధ్యములై యుండును. శుక్రగతమైన జ్వరము సాధ్యంబుగాదు.

శ్లో॥ బలవత్సల్పదోషేము
     జ్వరస్సాధ్యో నుపద్రవ॥

సాధ్య జ్వర లక్షణము

 తా॥ మిక్కిలి బలవంతులైన మనుజులకు స్వల్పంబులైన వాతాది దోషములచే జనించిన జ్వరము కసాద్యున ద్రవములు లేకున్నయెడ అట్టి జ్వరము సాధ్యంబై యుండును. జ్వరోపద్రవములు
గ్రంధాంతమునం దీరీతిననున్నయవి:-

31

రెండవ ప్రకరణము

'కాసోమూర్చారుచిశ్చక్దిస్తృష్ట్యాతీసారవిద్గ్ర
 హా: । హిక్కా శ్వాసాజ్గభేదాశ్చజ్వరస్యో
  నద్రవాదశే॥'

 దగ్గు, మూర్చ, రుచి, వాంతి, దప్పి, అతిసారము, మలబంధము, వెక్కిళ్లు, శ్వాసము, ఒళ్లు నొప్పులు, ఈ పదియు జ్వరమునందు గల్గు నుపద్రవంబులని భావము.

అసాధ్య జ్వర లక్షణము

శ్లో॥ హేతు భిర్చహుభిర్జాతొ బలిభిర్చహులక్షణ:।
      జ్వర:ప్రాణా న్తకృద్యశ్చశీఘ్రమిం ద్రియనాశన:॥

తా॥ మిక్కిలి బలయుక్తంబులైన అనేక హేతువులచే జనించి అనేక చిహ్నములుగల జ్వరంబును, జనించినతోడనే త్వక్ చక్షుశ్శోత్రజిహ్వాఘ్రములను జ్ఞానేంద్రియ పంచకములు: వాక్పాద పాణి పాయూపస్థలను కర్మేంద్రియములను స్వవిషయ ములయందు ప్రవర్తింప నీయక నశింపంజేయు జ్వరము ప్రాణాంతకరంబగును; అసాధ్యంబని భావము"

విషమ జ్వరములలో చలిజ్వరములుజెరియున్నవి

పైన వివరింపబడిన జ్వరలక్షణము లన్నియు ఇప్పుడు వ్యాపించియుందు చలిజ్వరములలో క్రమ ముగ కానుపింపకపోయినను ఈ జ్వరములుకూడ

32

చ లి జ్వ ర ము

వరుసక్రమమున ప్రతిదినము నిర్ణీత కాలమునందు గాని, దినము విడిచి దినముగాని, మూడు దినముల కొకసారిగాని, నాల్గుదినముల కొకసారిగాని వచ్చు చుండుటచే, పూర్వకాలపువైద్యులచేవివరింపబడిన జ్వరములలో ఈ చలిజ్వరములు చేరియున్నవని నిర్ధారణచేయక తప్పదు.

 కాని ఈ జ్వరములకు కారణము మన ప్రాచీన శాస్త్రజ్నులు చెప్పినట్లు కాదనియు దొమకాటుచే మనశరీరములో ప్రవేశించెడి యొకానొక సూక్ష్మమైన వృక్షజాతి ప్రాణియనియు ఇటెవలి ఐరోపాదేశపు వైద్యులు కనిపెట్టియున్నారు. ఈ విషయమైన క్రింద వివరింపబడును.

ఐరోపఖండమునందలి చలిజ్వరము

2.ఐరోపాఖండమునందు అనాది నుండి దక్షిణభాగము న నీజ్వరములు అమితముగ నుండు గ్రీసు దేశమునందు హిపొక్రెటీసు(Hippocrates) మొదలగు వైద్యులు ఈ జ్వరముగూర్చి వ్రాసియున్నారు.

పూర్వులు చలిజ్వరములకు చెడుగాలి కారనమనిరి

విడిచివిడిచి వచ్చుటయు చలితొవచ్చుటయు, వీరు వర్ణించియున్నారు. కొన్నిజ్వరములు విషజ్వరము లనియు, మరికొన్ని సామాన్యజ్వరములనియు విఅధ్యులు కనిపెట్టిరి. కాని మొన్న మొన్నటివరకు ఐరొపాదేశీయులు, ఈజ్వరములు చెడు

33

రెండవ ప్రకరణము

వాయులవలన వచ్చుచున్నవని నమ్మియుండిరి. ఏలయన ఈజ్వరము విరివిగ నీటుముంపుగల పల్లపు ప్రదేశముల యందును, తుక్కు, జమ్ము, మొదలగు నవి గల ఆనలు, బందలు, కుంటలు గల ప్రదేశముల యందును, ప్రబలి యుండుటచేత ఈ వ్యాధిని గలిగించు విషము బురద నేలలనుండి వెడలు వాయువుల నుండియే వచ్చునని వారు తలచియుండిరి. ఈ వ్యాధి యొక్క వ్యాపకమున కిట్టి బురదనెలలు కారనములు కాకపోయినను ఎట్లు సహాయకారులగునో ముందు చదువగలరు.

క్వయినాపట్టనుచింకాను అను ఆమె కనిపెట్టెను

1640 సంవత్సరమునందు (Countess Chinchon) చింకా నను నామె, ఇప్పుడమెపేరు మీదుగా వాడబడు, సింకోనాబార్కు అను క్వయినా పట్టను కనిపెట్టి ఈ జ్వరములకు మిక్కిలి ప్రసిద్ధిగా ఉపయోగించుచుండెను. 60 సంవత్సరముల పిమ్మట టూర్టి యని ఇటాలియా వైధ్యుడు అక్కడి జ్వరములను క్వయినావలన కుదురునని అనియు రెండుతరగతులుగా విభజనచేసి చూపెను. 1880 వ సంవత్సరము వరకు వైధులనేకులు కొంద రీజ్వరము సూక్షజీవులవలన బుట్టినదనియు, మరికొందరు చెడుగసలివలన బుట్టిననియు వాదించుకొను చుండిరి.

34

చ లి జ్వ ర ము

రక్తములో మలేరియా పురుగులు లేవరన్ కనిపెట్టెను

 ఈ సంవత్సరమున లేవరన్ (Laweran) అను ఫ్రెంచి వైద్యుడు ఈ వ్యాధిగలరోగుల నెత్తుటితో క్రింద 8-వ పటములో జూపబదినట్లు చంద్రవంకవలె ప్రత్యేక ఆకారముగల యొక పురుగును కనిపెట్టెను. పిమ్మట ఈ పురుగు కదులుచుండుటయు, కొన్ని మార్పులను చెందుటయు కూడ నితడు కనిపెట్టెను. చ్లిజ్వరముల యొక్క ఉత్పత్తిని కనుగొనిన మహానుభవులలో నీతడే మొదటివాడు. ఈతనికీర్తి శాశ్వతముగ నుండును. ఇతడిది కనిపెట్టినను చిరకాలమువరకు ప్రజలు దాని యుపయోగమును కనుగొన లేకపొయిరి. ఇటలీ దేశపు వైద్యసంఘమువారు తాము బురదనుండి తీసిన ఒకానొక విధమైన సూక్ష్మజీవియే ఈ చలిజ్వరమునకు కారణమని వాదించుటచే లెవరన్ యొక్క వాదము మూలబడెను.

దోమలకు మలేరియాకు సంబంధమున్నదని మేన్ స్సన్ కనిపెట్టెను

1894-వ సంవత్సరములొ మేన్ సన్ (Manson) అను నాతడు చలిజ్వరములు వచ్చు స్థలములును, దొమలుందు స్థలములును, ఒకటియేయని కనిపెట్టి అందుదేత దోమలకును, చలిజ్వరములకును ఏదొ ఒకవిధమైన సంబంధముండవలెనని ఊహచేసెను. ఇదిగాక మానవుల నెత్తురును వెలుపలికి తీసినప్పుడే

35

రెండవ ప్రకరణము

గాని, నెత్తురు మానవుల దేహములో ప్రవహించు నప్పుడు, చంద్రవంక వలెనుండు మలేరియా పురుగులు పెరుగుటగాని, మార్పులను పొందుటగాని లేదనికూడ్ మెన్ సన్ కనిపెట్టెను. ఇట్లు వెలుపలకు తీయబడిన రక్తమునందు మాత్రమె వృద్ధిపొందు స్వభావము మలేరియాపురుగుల కుండుట వలన దాని ప్రయోజన మేమో కనిపెట్ట వలెనని అతడు ప్రయత్నించెను.

దోమకడుపులో మలేరియా పురుగులు పెరుగుట రాన్ కనిపెట్టెను.

ఈతనిదారిననుసరించి (Major Ross) మేజరు రాస్ అనునతడు 1895 సంవత్సరం మేనెల మొదలు చెన్నపట్టణములో ననేక సంవత్సరములు కృషిచేసెను. ఇతడు సాధారణముగ మన యిండ్లలోనుండు క్యూలెక్సు (Culex) అను ఒకానొక విధమయిన దోమలను పట్టుకొని చలిజ్వరపు రోగులమీద కరపించెను. అట్లు చలిజ్వరపురోగుల నెత్తురును త్రాగిన దోమలను పెంచి ఆ దోమలను మొదటి దినమున ఒకదానిని రెండవదినమున మఱి యొక దానిని మూడవ దినమున కొక్కకదానిని కోసి వానిలోపలి అవయవములను పరీక్షించెను. ఇట్టి పరీక్షవలన మలేరియా పురుగు దోమ కడుపులో వెలుపలికంటే మిక్కిలి వృద్ధిగ పిల్లలను

36

చ లి జ్వ ర ము

పెట్టునని కనిపెట్టెను. కాని మరియేమియును తెలిసికొనలేక పొయెను.

 అంతట 1897 సంవత్సరం ఆగస్టు నెలలో నితడు ఈ క్యూలెక్సు దోమనువిడిచి అనాఫలెను (Anopheles) దోమనుపట్టి పరీక్షఛేయుటకు ప్రారంభించెను.

పక్షుల్లోని చలిజ్వరము వంటిజ్వరము

 1898-వ సంవత్సరములో ఇతడు కలకత్తాకు మార్చబడెను. ఇక్కడ అప్పుడు చలిజ్వరపురోగులు లేక పోవుటచేత ఈ చలిజ్వరమువంటి మరియొక జ్వరమును పక్షులలో కనిపట్టి ఆ పక్షులను పెంచి తన ప్రయోగములను వానిమీద చేయుచుండెను. ఈ పక్షుల జ్వరమును కలిగించు పురుగులను మలేరియా జ్వరమును కలిగించు పురుగులవలెనే దోమ కడుపులో పెరుగుటయు అవి దోమయొక్క పొట్ట గోడను చొరుచుకొని రక్తప్రవాహముగుండ ఉమ్మి తిత్తులలోనికి ప్రవేశింఛుటయు కనిపెట్టెను. తరువార నితడు కొన్ని దోమలను పెంచి వానిని ఉమ్మిలో కొన్ని దినములు తరువాత చలిజ్వరపు పురుగుల గ్రుడ్లను కనుకొనెను. ఈ దోమలను రోగములేని పిచికలమీద కఱపించి, 5 మొదలు 8 దినములలో పరీక్ష్యార్ధమేర్పడిన 28 పిచికలలో 22 పిచికలకు ఈ వ్యాధితప్పకవచ్చినట్టు కనిపెట్టెను.
  *అటుపిమ్మట ఇటలీదేశపు వైద్యులందరును దోమమూల మిక్కిలి శ్రమపడి పనిచేసి ఒక మనుష్యునినుండి ముననె చలి మరియొక మనుష్యునికి దోమ మూలముననే చలిజ్వరపు పురుగు వాపించుచున్నదని కనిపట్టిరి. వారు చలిజ్వరముగల రోగియొక్క నెత్తురున్ త్రాగిన దోమలను ఏమియున్ రోగములెని మనుష్యుల మీద కరిపించిరి. ఆ మనుష్యులకు కొన్ని దినములలో తప్పక చలి జ్వరము వచ్చుటయు, వారి నెత్తుటిఓ మలేరియాపురుగులు పెక్కువేలుగా వృద్ధి నొందుటయు పిమ్మట కనిపెట్టబడెను. ఈ విషయమునే ఇంగ్లాండు దేశములో ((Manson) మెన్ సన్ కూడ శోధించి స్థిరపరచెను. అది ఎట్లన చలిజ్వరపురోగిని కరచిన దోమలను ఇతర దేశముల నుండి లండను పట్టణమునకు రవాణాచేసి అక్కడ రోగములేని ఇద్దరు మనుష్యులమీద నిడు కరపించెను. ఈ యిద్దరికి కొన్ని దినములయిన పిమ్మట చలిజ్వరమువచ్చి వారి నెత్తురులో మలేరియా పురుగులు కనబడెను.
  మలెరియాజ్వరముయొక్క వ్యాపకమునకు ఇట్లు తోడ్పడు మలేరియా పురుగును గూర్చియు దోమను గూర్చియు, ముందు ప్రకరణలలో తెలియగలదు.

 *దోమమూలముననె చలిజ్వరపుపురుగు వ్యాపించుచున్నది.