చలిజ్వరము/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాలుగవ ప్రకరణము

                             దోమ

వివిధజాతులదోమలు:- సాధారనముగా నిండ్లలోమనముచూచు దోమలన్నియు వ్యాధులను జేరవేయునవికావు. ఈ విషయమున రెండుజాతుల దోమలు మాత్రము మనకు ముఖ్యమైనవి.

1. ఆనాఫలీను దోమలు:- ఇవి మలేరియా జ్వరమును కలిగించు పురుగులు. ఒక మానవుని నుండి మరియొక మానవునికి జేరవేయునవి . 2. క్య్హూలెక్సు దోమలు:-ఇవి ఏనుగకాలు లెక మూదకాలు మొదలగు వ్యాధులను జేరవేయునవి.

3.స్టిగోమియాదోమలు:- ఈరెండుజాతులును గాక ఆకారమునందు కొంచెమించుమించుగా క్యూలెక్సు దోమవలెనె యుండి చెవులప్రక్కన జేరి గెయ్ అని కూయుచు విసుకు జెందించెడుదోమ మరియొకటి కలదు. దీనికి స్టిగోమియా దోమయనిపేరు. ఇది వ్యాధులను కలిగించుటలో సహకారి కాదు.
అనాఫలీను క్యూలెక్సు దోమలను వేర్వేరుగ గుర్తించువిధము

కొంచెముశ్రద్దతో పరీక్షించువానికి అనాఫలీక్యూలెక్సు దోమలను తక్కిన దోమలండి విడదీయుటకుగాని, అనా ఫలీసు దోమలను క్యూలెక్సు దోమలను వేర్వేరుగ గుర్తించుటకు గాని కష్టముకాదు. అట్లు గుర్తించుటకు తోడ్పడుటకు గాను దానినిగూర్చి కొన్ని అంశములను క్రింద వివవించుచున్నాను.

క్యూలెక్సుదోమ గొడమీదవ్రాలియున్నప్పుడు గూనివానివలె కొంచెము వంగియుండును (14-వ పటము) . అనాఫలీసుదోమ సిపాయివలె నిటారుగా శరీరమును నిగిడించి యుండును. (15-వ పటము) క్యూలెక్సుదోమ గోడమీద పరుపుగా (సమాంతరముగా- Parallel) వ్రాలును. అనాఫలీసు దోమ ఏటవాలుగా వ్రాలును. అనగా దాని తల గోడకు సమానముగను వెనుకభాగము గోడకు దూరముగను ఉండును.

అనాఫలీసు దోమలను క్యూలెక్సుదోమలనుండి విడదీసిన తరువాత అనాఫలీసు దోమలలో ఆడవెవ్వి యో మగవెవ్వియో కనిపెట్టవలెను. ఈ యాడదోమలే మన నెత్తురుత్రాగి మనకపకారము చేయునవి.

ఆడజాతి లీసు దోమగుర్తించువిధము

క్రింది 16-వ పటములో 1 అనుచోట జూపినట్లు ఆడదాని మూతిమీద రోమములంతగా నుండవు. మగవానికి కుచ్చువలె నుండు రోమము లుండును; క్రింది పటములో 2 అనుచోట చూడుము.

16-వ పటము

దోమలు పెద్దవై యుక్తవయస్సు వచ్చిన తరువాతనే రెక్కలు గలిగి గాలిలో తిరుగును. ఇవి చిన్నతనములో చేపలవలెనీటిలో నివసించును. ఇవి గ్రుడ్లుగా పుట్టి, నీటిపురుగులుగా పెరిగి తుదకు రెక్కలుగల దోమలుగా పరిణమించును. ఈ రూప భేరములను గూర్చి కొంతవర కీక్రింద వివరించెదము.

దోమ లెప్పుడును తమ గ్రుడ్లను నీటిమీదనే పెట్టును గాని ఇతరచోట్ల పెట్టవు. సధారణ


దోమల గ్రుడ్లు

ముగా అనాఫలీమదోమలు నీటిపైని తేలుచుండు నేదేని యొక ఆకు, పుల్ల మొదలగు తుక్కుమీద కూర్చుండి నీటిలోనికి తమగ్రుడ్లను విడుచును. ఇవి నీటిమీద పడిన వెంటనే విడిపోయి నీటిపైని నల్లని నలకలవలె తేలుచుండును.

క్యూలక్సుదొమలు ఈ క్రింది 17-వ పటములో చూపబదినట్లు తమగ్రుడ్లను దొప్పవలెనుండు నొక


17-వ పటము

ముద్దగాపెట్టును. ఈదొప్పలో ననేక వందల గ్రుడ్లు ఒక దానిప్రక్క నొకటి యంటుకొని యుండును. ఇట్లు తేలునప్పు డీదొప్ప చూచుటకు కిరసనాయిల్ మసియుండ నీటిలో తేలుచున్నట్లుండును.

దోమలు నీటిపురుగులు.

రెండుమూడు దినములలో ఈగ్రుడ్లుపెరిగి చిన్న చిన్నపురుగులవలెనయి నీటియం దతివేగమున నీదుచు ఆతురతతొ మురికిని తినుచు మునుగుచు తేలుచు మెలికలు తిరుగుచు పరుగులెత్తు చుండును. 18-వ పటములో 1 అనుచొట చూపబడినది అనాఫలీసు దోమపిల్ల. ఇది నీటియొక్క పైభాగము నుండి కొంచెములోతున పరుపుగా పరుండి వెనుక ప్రక్క కీదుచుందును. ఈ దోమపిల్లల వీపుమీద


18-వ పటము

చిన్న చిన్న దొప్పలవలె నుండు అవయవములు గలవు. (1 టిలోపైతట్టున చూడుము). ఈదొప్పలు నీటిపై నుండు గాలివైపునకు తెరచి యుండుటచే వీనిగుండ నీదోమపిల్లలు తమకు కావలసిన గాలిని నీటి యుపరితలమున నుండి పీల్చుకొనుచుడును.

క్యూలెక్సు దోమపిల్లలు 18-వ పటములో 2అను చోట చూపబడినప్రకారము నిలువు తలక్రిందుగా నీదుచుండును. ఇది క్షణక్షణమునకి నీటి పైభాగ }} మునకు తేలుచు తమతోకలో నుండు నొక చిన్న గొట్టముగుండ గాలిని పీల్చుకొని తిరిగి మునుగు చుండును.

నీటి యుపరితలముననుండు గాలిని దోమపిల్లలు పీల్చుకొనలేక పోయినచో నవియెల్లను తక్షణమే చచ్చిపొవును.

దోమగూడు

ఇట్లు 6 లేక 7 దినములయిన తరువాత నీ దోమ పిల్లలు కొక్కెమువలె ముడుచుకొని, రెండుమూడు దినములవరకు చురుకు తగ్గియుండును. ఇపు డీ పురుగుపై నొకగూటివలె నేర్పడి ఆ గుల్లలొపల నత్తవలె దోమపిల్ల రూప నిష్పత్తి జెందుచుండును. వీని తల పెద్దదగును నల్లగను ఉండును. వీని తల యందు బూరాలవలెనుండు గొట్టములు రెండు గలవు. ఇవి ఈ గొట్టములద్వారా గాలిని పీల్చుకొనును. ఈస్థితియందు అనాఫలీసు దొమలను క్యూలెక్సు దొమలనుండి గుర్తించుట కష్టము. రెండు దినము లిట్లుండవీనికి రెక్కలు పెరిగి తమపై నుండు గూటినకస్మాత్తుగా పగల్చుకొని బయటికి గాలిలో కెగిరిపోవును.

రెక్కలుగల దొమలు

ఇట్లెగిరి పొయిన తరువాత నీ దోమ రెండు మూడు దినములలో గ్రుడ్లను పెట్టును. ఒకతరము దోమనుండి మరియొక తరము దోమ పుట్టుటకు సాధారణముగా 10 లేక 12 దినములకంటె ఎక్కువ కాలము పట్టదు. అనగా ఒక్క తల్లిదోమ నుండి వందలు వేలకొలది పిల్లలు రెండువారములలో తయారగును.

దొమలకు కండ్లు రెండును గలవుగాని యవి దూరపు వస్తువులను చూడలేవు. వాసనయును రుచి యును మనకంటె మిక్కిలి సూక్ష్మముగ కనిపెట్ట గలవు. దొమలు సాధారణముగా రాత్రులయందు మాత్రము సంచరించు జంతువులు. పగటి సమయమున చల్లని నిశ్శబ్దమైన స్థలములో నిద్రించును. ఇవి సూర్యాస్తమయము కాగానే మేయుటకును గ్రుడ్లు పెట్టుటకును బయలువెడలును. కాని మబ్బుదినములయందును, ఎండ చొరని అడవులలోను, చీకటి గదులలోను, ఇవి ఎల్లప్పుడు తిరుగుచుండును. స్టెగోమియా దోమ పగలు రాత్రి యనక సర్వదా మేత మేయుచుండును. వీని కింగ్లీషులొ పులిదోమలు (Tiger mosquitoes) అని పేరు.

దోమపిల్లలను పరీక్షించు విధము

ఇదివరకెన్నడును దొమపిల్లలను చూడని వారలు తమ దొడ్దిలోకి పోయి ఎక్కడనైనను 10 లెక 15 దినములనాటి నిలువనీళ్లున్న యెడల కనిపట్టవలెను. ఇందుకొరకు పారవేయబదిన ఓటికుండలోను, కిర్సినాయిలు డబ్బాలలోను, ఉపయోగములే లేని కుడితిగోలెములోను, వానిలో నిలువ నీళ్లుండిన యెడల ఆనీళ్లలో నతివేగముగ పరుగులాడుచున్న చిన్నచిన్న జంవుతులు కనబడును. అవి అంగుళములో 16-వ వందు మొదలు 4-వ వంతు వరకుండును. వీనినిపట్టి స్వచ్చమైన తెల్లని గాజు సీసాలోని నీళ్లలోవేసి పరీక్షించిన నవి నీటి యుపరితలమునకు వచ్చి తోకలోని గొట్టముతో గాలినిపీల్చు కొనుటయు వెంటనే మునుగుటయు చూడగలము.

దోమపిల్లలను పట్టుసాధనము

ఇట్లు దోమపిల్లలను పట్టి వానిజాతులను తెలసి కొనుట కొక సులబమైన సాధనము గలదు. 1 1/2 అడుగు పొడుగుగల ఒక ఇనుప తీగెను తీసికొని దానిని కడియమువలె వంచికట్టవలెను. ఈకడియమును మూడుగొలుసులతో తక్కెడ పళ్లెము వలె వ్రేలాడదీయవలెను. ఈ గొలుసుల మూటియొక్క కొనలను ఒక చిన్న ఇనుప ఉంగరమునందు తగిలించి, ఆ ఉంగరమున కొకచేద త్రాడునుకట్టవలెను. ఒక నూతిలో దోమపిల్లలున్నవో లెవో తెలిసికొనుటకు ఈ వలను మెల్లగ నా నూతిలోనికి విడిచి, కొంచెము దూరమువరకు నీటిలో దీనినిఈడ్చి, పిమ్మట పైకిలాగవలెను. అంతట నీరంతయు గుడ్డలోనుండి క్రిందికిపోయి దోమ పిల్లలు మాత్రమందులో చిక్కుకొనును. వీనికొక సీసలో వేసి పెంచి వాని జాతిభేదములను గుణములను తెలిసికొననగును.

అనాఫలీసు దోమలయుపజాతులు, వాని నివాసస్థానములు.

1.దోమలు అమితముగనున్నచోట్ల ఎక్కడేవిధ మైన నిలువ నీరున్నను ఆనీటిలోనిట్ల దోమపిల్లలను పెట్టక యేస్థలమునందు పిల్లలను పెట్టిన మిక్కిలి అనుకూలమో అనువిషయము బాగుగ నాలోచించు ననియు, ఒక్కొక ఉజాతి అనాఫలీసు దోమలు ఒక్కొక మాదిరి స్థలములను తమపిల్లను పెట్టుటకు ఏర్పాటు చేసికొనుననియు తోచుచున్నది. ఇందు ముఖ్యముగ మూడు ఉపజాతులను మనము గమనించవలసి యున్నది. అందొక ఉపజాతి అనాఫలీసు దోమలు ఊరికి దూరముగనుండి నాచు మొదలగు ఆకలమును పెరుగుచుందు నీటియందు మాత్రము తన పిల్లలను పెట్టును. ఈ జాతిదోమలు సాధారణముగా ఇండ్లలోనికిరావు. 2.మఱియొక ఉపజాతి అనాఫలీసు దోమలు ప్రవాహముగల నీటిలో తమపిల్లలను పెట్టును. ఇట్టి వానికి సాధారణముగా పొలములలోని పంట కాలువ లాధారములు.

3. మరియొక ఉపజాతి అనాఫలీసు దోమలు ఇండ్ల సమీపముల నుండు లోతులేని బురదగుంటలలో తమ పిల్లలను పెట్టును. సాధారణముగా ఈ జాతిదోమలు మన దేశములో మిక్కిలి యధికముగ ప్రబలియున్నవి. వర్షకాలము రాగానె యూరి బయట గోతులలో జేరు నిలవ నీటిలో నీ దోమపిల్లలమితముగ నుండును. ఇండ్లలో తరుచుగ జొరబడు అనాఫలీసు దోమలు ఈజాతిలోనివే. అనాఫలీసు దోమలయందలి యుపజాతుల నివాసస్థానములు, వాని ఆహారపదార్ధములు, వాని నడవడికలు మొదలగువిషయము లింక ననేకములు నిశ్చయముగా మనకు తెలియవు. అయినను అనాఫలీసు దోమలనుగూర్చి ఈ క్రిందివిషయములను చక్కగ గమనించుట మంచిది.

అనాఫలీసు దోమల నడవడికల సంగ్రహము

1.అనాఫలీసు దోమలు ముఖ్యముగ రాత్రుల యందే సంచరించును. పగటియం దవి చీకటి గదులలోగాని, చీకటి గల తలుపు మూలలలోగాని, వ్రేలాడవేసిన బట్టల చాటునగాని, దాగికొని యుండును.

ii ఆడ అనాఫలీసు దొమలు నెత్తురు మాత్రము త్రాగి బ్రతుకును.

iii. అనాఫలీసు దోమ లధికముగ వృద్ధి చెందు కాలము ఆయా దేశములయందలి వర్షఋతువును బట్టియు ఆయా యుపజాతియొక్క నివాసస్థానములను బట్టియు మారుచుండును.

iv. అనాఫలీసు దోమలు చాల దూరము పరుగెత్తవు.

v. కొన్నిచోట్ల అనాఫలీసు దోమలు చలికాలము రాగానే ఎక్కడ వేడిగ నుండునో ఆ దేశమునకు పోయి తిరిగి తగినకాలము వచ్చినపుడు తమ నివాసస్థానమునకు వచ్చును. దోమలు చలికాలము రాగానే యొక్కటియు కనబడక పొవుటకును, తిరిగి వేసవికాలములో వేనవేలు ఉత్పత్తియగుటకును కారణము లూహింపనగును.

vi. కొన్ని దోమలు వానివృద్ధికితగని స్థితిగతులు వచ్చినప్పుడు తాము దాగియుండుటకు తగియుండు నెల కొట్లు మొదలగు చీకటి గగులలోనికిపోయి అక్కడ ననేక మాసముల వరకు ఆహారము కూడనక్కర లేకుండ నిద్రను జెందును. తమ వృద్దికి తగిన సమయము వచ్చినప్పుడే దోమలు తమ నిద్ర నుండి లేచి బయటికివచ్చి మరియొక సంవత్సరమునకు వ్యాపింపజేయును. కొన్ని దోమపిల్లలుకూడ వాని పెంపునకు తగినకలము సమకూరని యెడల ననేక మాసములవరకు నిట్టి నిద్రావస్ధకు జెంది తగిన తరుణము వచ్చినప్పుడే పెద్దదోమలుగా పరిణమించును.

క్యూలెక్సు దోమపిల్లల నివాస స్థానములు

క్యూలక్సుదోమ పిల్లలు మురికినీటిలో మిక్కిలి వేగముగ వృద్ధిజెందును. ఉపయోగములో లేని పాడు నూతులును, రోడ్లప్రక్కలనుడు గోతులును మురుగు గాలువలును, దీనిపిల్లలకు ప్రియమైన నివాసస్థానములు. మానవుల అశుద్ధసంబందమైన కల్మషముగల నీటిలో నీజాతిదోమపిల్లలు మిక్కిలి వృద్ది పొందును. ఓటికుండలు, పగిలిపోయిన సీసాలు, పీపాలు, మొదలగు వానిలోని నిలుకడ నీటియందును ఈజాతిదోమ పిల్లలను పెట్టును.

స్టిగోమియా దోమపిల్లల నివాసస్థానము.
స్టిగోమియా దోమపిల్లలు ఇంటిచుట్టు నుండు నిలువ నీటితొట్లలో సామాన్యముగ్తా సంవత్సరము పొడుగున ఉండును=. నల్లులెక్కకుండ మంచము

61

నాలుగవ ప్రకరణము

కోళ్లక్రింద పెట్టుకొను నీటిపళ్లములలోను, చీమలు రాకుండ బెల్లము, నెయ్యిమొదలగు పదార్దముల నుంచుకొను పళ్లెములలోను పోయునీటిని 10 లేక 15 దినములవరకు మార్చకుండ పెట్టిపెట్టినయెడల నట్టి నీటియందును, తరుచుగ నీదోమపిల్లలు కనబడును. ఇవి నూతులలోను, పగిలిపోయిన బుడ్లలోని నీళ్ల లోను, కుండపెంకులలోను, చెట్లతొర్రలలోని నిల్వ నీళ్ల లోనుకూద కనబడును.

దోమలయొక్క నైసర్గిక విరోధులు

పెద్దపెరిగిన తరువాత దోమలను అనేకములగు పక్షులు, చేపలు, పురుగులు, గబ్బిలములు, మొదలగు జంతువులు తిని నశింపుజేయును. సరిగాదొరినప్పుడు చీమలుకూడ దోమలను పట్టీ తినును. పెద్ద దోమలకంటె ననేకరెట్లు వీనిపిల్లలు సృష్టిలో నాశనము జెందుచున్నవి. కొన్నిజాతుల దోమపిల్లలే మరికొన్నిజాతులదోమపిల్లలను తినివేయును. కొన్ని నీటిపురుగులు ఈదోమపిల్లలను దొరికినప్పుడెల్లను విడువక మ్రింగివేయును. పరిగెలు మొదలగు కొన్ని చేపలు మిక్కిలి చమత్కారముగ నీదోమపిల్లలకై కాచియుండి వానినిపట్టి నశింపుజేయును. ఈచేపలు సామాన్యముగా అన్ని చోట్లను దొరకును. తగినన్ని చేపలుండి, దోమపిల్లలు దాగుకొనుట కనుకూల పడు తుక్కలేనప్పుడే నీటియందైనను దొమపిల్లలు వృద్ధి పొందకుండ చేయువచ్చును., అయినను మురిగి పోయిన నీటిలో వానికి చాలినంత ప్రాణవాయువు లేకపోవుటచేత చేపలుబ్రతుకజాలవను విషయమును గమనింపవలెను.

గాలికూడ నీటి యుపరితలమునకు దొరకుండునట్లు నీటిమీద నాచుమిక్కిలి దట్టముగ అల్లుకొని యున్నయెడల అట్టినీటిలో దోమపిల్లలు పెరిగినను తరువాత గాలిలేక యవి యుక్కిరి బిక్కిరి అయి చచ్చును.

దోమలనశిం
పుజేయుఇతర
సాధనములు

ఉప్పుసున్నము, మైలతుత్తము, అన్నభేది మొదలగు పదార్దములను నీళ్ళలో కలిసి నప్పుడా నీరు దోమపిల్లలను నాశనంచేయును. కాని అవి సామాన్యముగా నన్నిచోట్ల నుపయోగకరములు కావు.కిర్సనాయిలును నీటి మీద వేసినతోడనే యది మిక్కిలి పలుచనిపొరగా నీటిమీద ప్రాకిపోవును.ఇట్లు నీటియుపరితలము నంతను ఆక్రమించిన ఈకిర్సనాయిల్ పొరగుండ గాలిచొరదు. అందుచే నీటిలోని దోమపిల్లలన్నియు పీల్చుటకు గాలిలేక చచ్చిపోవును. అయినను గాలి వేగముగవీచుచున్న యెడల కిరసనాయిలు అంతయు ఒకవైపునకు కొట్టుకొని పోవుటచే దోమపిల్లలు తప్పించుకొని పోవచ్చును. కిరసనాయిలులో కార్బాలికు ఆసిడ్ మొదలగు కొన్నిమందులు చేర్చిన యెడల ఈదోమపిల్లలు ఇంకను సులభముగ చచ్చును.