Jump to content

చలిజ్వరము/ఐదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

చలిజ్వర భేదములు

చలిజ్వర భేదములు నాలుగు:- చలిజ్వరములందు ముఖ్యమైన భేదములు నాలుగు గలవు.

ద్వితీయకజ్వరములు:-

1. రెండవపటములో చూపబడిన ప్రకారము24 గంటల కొకసారి యనగా దిన దినము వచ్చు నదియొక జాతి జ్వరము. దీనికి ద్వితీయక జ్వరమని పేరు.

సామాన్యతృతీయక జ్వరములు:-

2. మూడవపటములో చూపబడిన ప్రకారము 48 గంటల కొకసారి జ్వరము వచ్చిన దినము మొదలు మూడవనాడు వచ్చునవి కొన్ని జ్వరములుగలవు. వీనికి తృతీయక జ్వరములని పేరు. ఈతృతీయక జ్వరములలో కొన్ని చికిత్సకు లొంగును వీనికి సామాన్య తృతీయక జ్వరములని పేరు.

విషతృతీయక జ్వరములు:-
3. తృతీయక జ్వరములలో మరికొన్ని చికిత్సకు సాధారణముగా లొంగవు. వీనికి విషతృతీయక జ్వరములని పేరు.
చతుర్ధకజ్వరములు::-

4 మరికొన్ని జ్వరములు నాలవ పటములో చూపిన ప్రకారము 72 గంటల కొకసారి అనగా జ్వరము కలిగిన దినము మొదలు నాలుగవ నాడు మరల వ్యాపించును. వీనికి చతుర్ధక జ్వరము అని పేరు.

మలేరియా పురుగుల జాతులు నాలుగు:-

పైన ఉదాహరించిన నాలుగు జాతులు మలేరియా జ్వరములకును నాలుగు జాతుల మలేరియా పురుగులు గలవు. ఒక జాతి పురుగువలన ఆజాతి జ్వరమే వచ్చునుగాని వేరొక జాతిజ్వరము రాదు. ద్వితీయకజ్వరపు పురుగులవలన దినదినం వచ్చెడి జ్వరము వచ్చునుగాని దినమువిడిచి దినమువచ్చు జ్వరము రాదు. ఇట్లే సామాన్య మలేరియా జ్వరపు పురుగు వలన విష మలేరియా జ్వరము రాదు. విషజ్వరపు పురుగులవలన సామాన్య జ్వరము రాదు.

ఒకదినముననే రెండుసార్లు జ్వరము వచ్చుట:-

అయినను ద్వితీయక జ్వరమును గలిగించు పురుగులు కొన్ని యొక నాడేదోయొక సమయమునందును, మరికొన్ని ఆదినముననే మరియొక సమయమునందును రోగియొక్క రక్తములొ ప్రవేశించినయెడల మొదట ప్రవేశించిన జ్వరపు పురుగులవలన గలిగిన జ్వరము దినమునకు ఒకసారివచ్చును. ఈపురుగులవలన కలిగిన జ్వరమువచ్చిదిగిపో యినతరువాత ఆదినముననే మరికొంతసేపటికి రెండవవారి రక్తములో ప్రవేశించిన జ్వరపు పురుగుల సంబంధమైన జ్వరము దాని సమయమునకు లెక్క ప్రకారము 24 గంటలకు రావచ్చును. అట్టిరోగులకు ఒకదినమున రెందుసార్లు జ్వరమువచ్చును.

తృతీయకజ్వరపు పురుగులవలన దినదినము జ్వరము వచ్చుట:-

లేదా 48 గంటల కొకసారి వృద్ధింబొందు జాతిలోని జ్వరపు పురుగులు కొన్ని యొకనాడును, మరి కొన్ని మరుసటిదినమునను రోగియొక్క రక్తములో ప్రవేశించినయెడల, మొదటిరినమున ప్రవేశించిన పురుగుల సంబంధమైన జ్వరము ఒకనాడును, రెండవదినమున ప్రవేశించిన పురుగుల సంబంధమైన జ్వరము ఆదినమునకు మర్సటి దినమునను వచ్చును. అందుచేత 48 గంటల కొకసారి జ్వరమును కలుగజేయు పురుగు రక్తములో నున్నప్పుడు కూడ నొకానొకప్పుడు, జ్వరము 24 గంటల కొకసారి రావచ్చును. 5-వ పటములో చూపబడినది ఈజాతి జ్వరమే. మందు ఇచ్చుటవలన ఒక జట్టు పురుగులు చచ్చినవి. అందుచేతనె 5,7 తేదీలను జ్వరము రాలేదు. ఆ మందు రెండవ జట్టు పురుగులనేమియు చేయలేదు. కాబట్టి ఆజట్టుపురుగుల వలన గలిగిన జ్వరము దాని నియమిత కాలమునకు అనగా దినమువిడిచి దినము వచ్చుచున్నది. ఇట్లే రెండుజాతుల మలేరియాపురుగులు ఒకటే దినమున రక్తములో ప్రవేశించి రెండుజాతుల

రెండుమూడు
జాతుల జ్వరములు
ఏక కాలములో
వచ్చుట

జ్వరములను ఒకటే సమయమున గలుగ జేయవచ్చును. లెదా చలిజ్వరము పురుగులును ఇతర జ్వరములను కలుగజేయు సూక్ష్మజీఫులను ఒకటే సమయమున రక్తములో ప్రవేశించిన యెడల ఆరెండు జ్వరములును ద్వంద్వముగా ఒకటేసారి రోగిని బాధించవచ్చును. ఇట్టిజ్వరముల స్వరూపములను కనిపెట్టుట సామాన్య వైధ్యులకు కష్టసాధ్యము.


రోగియొక్కరక్తమున సూక్ష్మదర్శినితో పరీక్షించి మలేరియా పురుగులను వేర్వేరుగ పోల్చదగిన

సామాన్యజ్వరపుపురుగుల
యొక్కయు విష జ్వరపు
పురుగులయొక్కయు
ఆకార భేదము
వారికిమాత్ర మట్టిజ్వరభేదములు సులభముగ తెలియును. ఇట్లు పోల్చుటకు వేర్వేరు జాతుల మలేరియా పురుగుల ఆకారమ్లను వాని నడవడులను తెలిసికొనుట యవసరము. అవియన్నియు నీచిన్ని పుస్తకమునందు వ్రాయుటకు వీలులేదు. సామాన్య తృతీయక జ్వరపుపురుగుల యొక్కయు, విషతృతీయక జ్వరపుపురుగుల యొక్కయు విదిధ దశలయందలి ఆకారములను క్రింది19-వ పటములో కొంతవరకు చూపియున్నాము. సంయోగసహిత సంతానవృద్ది కేర్పడినరూపములు (8. చూడుము)
                                19-వ పటము

సామాన్యజ్వరముల్లో గుండ్రముగ నుండుటయు, విషజ్వరములలో అర్ధచ్ంద్రా కారముగ నుందుటయు గుర్తింపనగును.

విషమలేరియా జ్వరపుపురుగులవలన దినదినము వచ్చుచుండిన జ్వరముయొక్క స్వరూపమును తెలుపు పటము 15-వ పుటలోనున్నది చూడుడు. ఆరోగికి దఫాలుగా రెందుమాసములవరకు క్రమము

లేకుండ జ్వరము వచ్చుచుండెను. ఆరోగియొక్క రక్తమునందువిషమలేరియా పురుగు లప్పుడప్పుడు కనబడుచుండెను. ఇట్టి జ్వరములను మొదటి నుండియు కనిపట్టి వైద్యుడు చికిత్సచేసిన గాని కుదురుట కష్ణము.