Jump to content

చలిజ్వరము/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

                       చలిజ్వర నిదానము
    చలిజ్వర నిదానమనగా చలిజ్వరమును గుర్చించు విధము.

ఈదేశములోని కొన్నివైద్యశాలలలోవైధ్యులు దినదినమ్ను వందలకొలది

కొన్నివైద్య శాలలలో
చేయబడువైద్యము..

రోగులను చూదవలసివచ్చును. అట్టిసమయములలో త్వరగా పని ముగించుకొనుటయే ముఖ్యమగుటచేత రోగికి సరియైన వైద్యము జరుగు చున్నదో లేదో విచారించుటకు వీలులేదు. ఒకవేళ నొకానొకవైద్యుడు శ్రద్ధచేసి వ్యాధులను గ్రహించిన తరువాతనే వైద్యము చేసెదనని ప్రతిజ్ఞబట్టి పనిచేసినను అట్టి వానికి కావలసిన సూక్ష్మదర్శనులు మొదలగు సాధన సామగ్రియంతయును సామాన్యముగా వైద్యశాలలో నుండదు. అందుచేత తనవద్దకు రోగి వచ్చినతోడనే వైధ్యుడు రోగికి అప్పటికప్పుడు ఏదో ఒక మందు ఈయవలసి వచ్చును. జ్వరముతో వైద్యమునకు వచ్చురోగికి వైద్యము చేయుటయందు రెండు పద్దతులు గలవు. ఒకటి సరియైనపద్దతి. రెందవది తప్పుపద్దతి. ఈ దేశమునందలి వైద్యులనేకులు సాధారణముగా నీతప్పుపద్ధతినే అవలంబింతురు. రోగివైద్య్హమునకురాగానే వైధ్యుడ్ రోగిని "నీకు ఏమి జ్వరము" అని అడుగును. రోగివెంటనే "చలిజ్వరము" అనిచెప్పును. వైధ్యుడు తనపని తొందరలో తన అలవాటుప్రకారము రోగి చెప్పిన రోగ నిదానమును బట్టి చలిజ్వరమునకు క్వయినా మందనిచెప్పి 3 లేక 6 మోతాదుల మందిచ్చి పంపును. అదృష్ట వశమున రోగియొక్క రోగము నిజముగా చలి జ్వరమైన పక్షమున వానికి కుదురును. లేదా రోగి యూమందును పుచ్చుకొని కుదురక వైద్యుని విసగించు నట్లు బాధించిన తరువాతనో, లేక రోగికి వ్యాధి యధికమై ప్రాణాపాయకరముగ ముదిరినతరువాతనో, వైద్యడు మేలుకొని రోగిని సరిగా పరీక్షించును.. ఒక్కొకవ్వాధి అప్పటికి అసాద్ద్యస్థితికి వచ్చియుండవచ్చును.

కావున బుద్ధిమంతుడగు వైధుడు జ్వరపురోగి వచ్చిన తోడనే యేదోయొక మంచిచ్చివేయక ఆజ్వర మేజాతిలోనిదో సరిగా తెలిసికొని వైద్యము చేసిన మిక్కిలి మెలగును. సరియైన వైద్య పద్ధతి. రోగిజ్వరముతో వైద్య పద్దతి.

అనేకవిధము - లగు జ్వరములు

రోగిజ్వరముతో వైద్యమునకు రాగానే జ్వరముకలిగించు వ్యాధులనన్నిటిని వైద్యుడు జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. అట్టిజ్వరములలో ననేక జాతులు గలవు. కొన్ని జ్వరములు ఊపిరితిత్తులలోని వ్యాధి చేగలిగిన కఫజ్వరములు, కొన్ని జ్వరములు మూత్ర సంబంధమైన అవయవములలో సుఖవాధిచేగాని, మరి యితర వ్యాధులచే గాని పుట్టిన తాపముచే గలుగు జ్వరములు. కొన్ని జీర్ణకోశములలోని మాంద్యము చేతగాని, ఏలుగుపాము, నులిపురుగు మొదలగు జంతువుల మూలమునగాని మలబద్ధకము వలన గాని గలుగు జ్వరములు; కొన్ని జలుబుచేతగాని, యెండ ఉడుకుచేతఘాని గలుగు జ్వరములు; కొన్ని మశూచికము, ఆటలమ్మ పొంగు మొదలగు వానిచే గలుగు జ్వరములు; కొన్ని సన్నిపాత జ్వరములు; మరికొన్ని సూతికా జ్వరములు. లేక గాయములు మొదలగు వానియందలి చీమువలన పుట్టిన వ్రణజ్వరములు. ఇట్లు లెక్కకు రాని అనేక జ్వరంకులు గలవు. ఇంకను మనకు కారణము సరిగా తెలియని కాల జ్వరము మొదలగు జ్వరము లెన్నియో గలవు. ఈజ్వరముల ననిటిని మనస్సు నం దుంచుకొనక రోగి "చలిజ్వరము" అనిచెప్పినతోడనే క్వయినా పంచిపెట్టుట తగదు. రోగి తనవద్దకు వచ్చినతోడనే ఒక్కొక్క అవయమును వరుసగ పరీక్ష చేసిన యెడల పైని చెప్పబడిన వ్యాధులలో నెద్దియైనను ఉన్నదో లేదో సాధారణముగా తెలియవచ్చును.

జ్వరపుగెడ్డపెరిగిఉన్నదా? లేదా?

రోగికి ఇతరవ్యాధులు ఏమియు లేక ఒక్క జ్వరమే యున్నయెడల వానికడుపులో జ్వరపుగడ్డ పెరిగియున్నదో లేదో చూడవలెను. జ్వరపుగడ్డ స్పష్టముగా తెలియుచున్న యెడల సామాన్యముగా రోగియొక్క జ్వరము చలిజ్వరమే అయి యుండును. చెన్నపట్టణములో ప్రస్తుతము వ్యాపించియున్న కాలజ్వరమను వ్యాధియుందును ఇంక మరికొన్ని వ్యాధుల యందును కూడ జ్వరపుగడ్డ పెరుగును. అయిన ఆవ్యధులు సామాన్యముగా నన్నిచొట్ల నుండవు.

లేనియెడల చలిజ్వరము గుర్తించుటెట్లు.

ఒకవేళ రోగి చలిజ్వరము వచ్చిన మొదటి వారములోనే వైద్యమునకు వచ్చినయెడల వానికి సామాన్యముగా జ్వరపుగడ్డ పెరిగియుండదు. అట్టి చో జ్వరపుగడ్డ పెరిగియుండని వ్యాధులలో నీచలిజ్వరము గుర్తింప వలెను. రోగి తన జ్వరము తప్పక చలితొగూడి వచ్చుననియు రెండుదినముల కొకసారిగాని మూడుదినములకొకసారిగాని నియమిత కాలమునకువచ్చి కొంతకాలముంది చలిజ్వర లక్షణముల నన్నిటిని చూపిన దనియు చెప్పినప్పుడును, రోగి ఆలక్షణములను తెలివిగ గ్రహించి చెప్పగలవాడని వైధునకు తొచినప్పుడు రోగియొక్క వ్యాధి చెలిజ్వరమని నిశ్చయముచేసి మందును ఈయవచ్చును.

నెత్తురు పరీక్షించవలెను

దినదినము జ్వరమువచ్చు రోగులవిషయములో జ్వరపుగడ్డ పెరిగియుండని యెడల రోగనిదానము కష్టము. ఏఅవయము నందును జ్వరమునకు కారణము కానరాని యెడల, మశూచికము ఆటలమ్మ మొదలగు వ్యాధులలో నేదైనను సోకి యుండునని అనుమానముగా నున్నయెడల, రెండదినములు నిదానించి చూచిన నవి బయలుపడగలవు. ప్రారంభ స్థితి లోని క్షయజాతిజ్వరముగాని, సన్నిపాత జ్వరముగాని, ప్రస్తుతము మనకు కారణము తెలియని ఇతర్ జ్వరములలో నేదైన గాని, రోగిని బాధించు చున్నప్పుడు వానినుండి చలిజ్వరమును గుర్తించుట కష్టము. అట్టియెడల రోగియొక్క నెత్తురుచుక్క నొకదానిని తీసి వైధ్యుడు తను పరీక్షింప గలిగినయెడల సూక్షదర్శినితో పరీక్షింపవలెను. లేదా చెన్నపట్టణమువద్ద అందుకొరకు ప్రత్యేకముగా సర్కారువారిచే నేర్పరుపబడియున్న కింగుఇన్ ట్యూటు (King Institute) అనుఆఫీసునకు ఒక చుక్క నెత్తురును అందు కొరకై యేర్పడియున్న గాజు పలపైపరచి పంపవలెను. అక్కడ రు.5-0-0 లు ఫీజు తీసికొని వారానెత్తురును పరీ క్షీణించి మలేరియా పురుగులు నెత్తురులో నున్న యెడ్ల చెప్పుదురు. లేదా యితరవ్యాధి ఏదియైన నున్నట్లు తకమకు తోచినయెడల తమసలహాను పంపుదురు. కాని, చలిజ్వరమైన దానికిని, కాని దానికిని క్వయినానుఇచ్చి కుదురలేదని తొందరపడుట ఎంత మాత్రమున సరికాదు. వ్యాధిని నిశ్చయముగ తెలిసికొనముందే క్వయినాను పుచ్చుకొనిన రోగియొక్క నెత్తురును పరీక్షించి నప్పుడు ఆనెత్తురు వలన నిజమైన వ్యాధి తెలియదు. జ్వరతీవ్రమునుబట్టి నిదానమును తెలిసికొనవలసి వచ్చినప్పుడు క్వయినాను మధ్యమధ్య ఇచ్చుచుండిన యెడల జ్వర నిదానము సరిగా తెలియదు. చలిజ్వరమునకే క్వయినా ఉపయోగ కరమైనది కాని యితర జ్వరము లలో దానిప్రయోజన మంతగాలేదు. కావున చలిజ్వరము అవునా కాదా యని సందేహముగా నున్నప్పుడు మనము ముఖ్యముగా గమనింప వలసిన అంశము లేవియన:-

సందేహముగా నున్నప్పుడు చేయవలసిన చికిత్స.

1.రోగికి అన్నముపెట్టుటమాని పాలుగాని, గోధుమ జావనుగని, పాలవలె పలుచగ నుండునటుల నూక జావగాని కాచి ఇయ్యవలెను.

2. నాలుగుగంటల కొకసారి శరీరపువేడిమిని జ్వరపు పుల్లతో కొలవ వలెను.

85

ఏడవ ప్రకరణము

3. ఒక్కచుక్క నెత్తురును తగిన గాజుపలకపైరాచి పరీక్షము పంపవలెను.

4. జ్వరము అధికముగా నున్నయెడల క్వయినా ఇయ్యక జ్వరము తగ్గించు ఇతరమందును దేని నైనను ఇయ్యవచ్చును.

5. సాఫీగావిరేచనమును చేయుమందును, చెమట పుట్టించుమందును దేనినైన ఇచ్చుట మంచిది.


6. చలిజ్వరము అవునో కాదో నిశ్చయించు కొనక పూర్వము క్వయినా మాత్రము ఇయ్యకూడదు.

ఇట్లు చికిత్సచేయుచు రోగిని కనిపట్టి చూచుచుండు నెడల బహుశ: ఒకటిరెండు దినములలో చలిజ్వరము సంబంధమైన లక్షణము లన్నియు వైద్యుడు కనిపట్ట వచ్చును. లేదా నెత్తురులో చలిజ్వరపు పురుగులు కనబడవచ్చును. చలితో ప్రారంభించుట, విడిచివిడిచి జ్వరమువచ్చుట, కొంత నియమితకాలమున కొకసారి జ్వరమువచ్చుట, జ్వరపుగడ్డ పెరుగుట. మొదలగు చలిజ్వర చిహ్నములుగాని, రక్తములో చలిజ్వరపు పురుగులుగాని యితరమైన నిదర్శనములు గాని, కనబడని యెడల నావ్యాధి చలి జ్వరము కాదని యూహించి యితా జ్వరములకు వైద్యము చేయుచు రోగిని క్రమమైన శోధనలో నుంచవలెను. నెత్తురును కఫమును అప్పటప్పట, సూక్ష్మదర్శినిలో పరీక్షించు చుండవలెను.

సన్నిపాత జ్వరము క్షయజ్వరము మొదలగునవి.

జ్వరము దినదినమునకు హెచ్చుచు 6వ పటములో చూపబడినట్లు ఒక క్షణమైనను విడువక రెండు వారములవరకు నున్నయెడల నది బహుశ: సన్నిపాత జ్వరము. ఇదిరక్తమును పరీక్షించుటచే తెలియగలదు. లేదా క్షయ జ్వరమో, రణజ్వరమో, కాలజ్వరమో (Kala Azar) మరియెద్దియో వైద్యుడు బుద్దికుశలతచే కనుకొనవలెను.