పుట:Chali Jvaramu.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఒకప్పుడు రెండు మూడు సంవత్సరముల వరకు క్వయినా ఇయ్యవలెను - పది సంవత్సరముల పిల్లలకు మోతాదు - 5 మొదలు 10 సంవత్సరముల పిల్లలకు మోతాదు - 5 సంవత్సరముల లోపలి పిల్లలకు మోతాదు - జ్వరము తగ్గిన తరువాత చేయవలసిన చికిత్స - క్వయినా యందు మనప్రజలకు గల ద్వేషమునకు కారణములు - కొందరు స్వదేశవైద్యులు చేయు పద్ధతి - ఏ మందు త్వరలో వ్యాధిని కుదుర్చునో అదియే మంచి మందు - ప్రజలు క్వయినా యందలి ద్వేషమును విడువవలెను - మాత్రలు, ద్రావకము, పొడుము; వీనిలో నేది మంచిది - విషజాతుల చలిజ్వరములలో క్వయినాను నెత్తురులోనికి పిచ్చికారి చేయుట యుక్తము - చలిజ్వరముతో కూడ ఇతర వ్యాధు లున్నయెడల వానికి ప్రత్యేకముగ చికిత్స చేయవలెను. 86-98

చలిజ్వరమును నివారించు పద్ధతులు

క్వయినాయొక్క సాయముతో చలిజ్వరమును నివారించు పద్ధతులు - చలిజ్వరపు రోగులనందరను లెక్కించి వారల కందరకు క్వయినా యియ్యవలెను. తాముమాత్రము వారమున కొకసారి క్వయినా పుచ్చుకొనవలెను - క్వయినా యొక్క సాయము కోరకయే చలిజ్వరము నివారించు పద్ధతులు - అనాఫలీసు దోమలను నశింపు చేయవలెను - మనయిండ్లలో నుండు దోమల నివాసస్థానములు - ప్రతిమానవుని దోమకాటునుండి కాపాడవలెను - దోమలు ప్రవేశింపరాని ఇండ్లు ; దోమతెరలు - ఇతరులను చలిజ్వరపు రోగులను విడదీసి ప్రత్యేకముగ నివసింపచేయవలెను - గ్రామమున కర మైలుకంటె దూరమున నుండు నిండ్లలో నివసింపవలెను. - ఉపసంహారము - దొరతనమువారును ప్రజలును ఒండొరుల సాయము నపేక్షించుచు దేశక్షేమమునకు తోడ్పడవలెను. 99-112

పవిశిష్టము : - 113-116