పుట:Chali Jvaramu.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


33

రెండవ ప్రకరణము

వాయులవలన వచ్చుచున్నవని నమ్మియుండిరి. ఏలయన ఈజ్వరము విరివిగ నీటుముంపుగల పల్లపు ప్రదేశముల యందును, తుక్కు, జమ్ము, మొదలగు నవి గల ఆనలు, బందలు, కుంటలు గల ప్రదేశముల యందును, ప్రబలి యుండుటచేత ఈ వ్యాధిని గలిగించు విషము బురద నేలలనుండి వెడలు వాయువుల నుండియే వచ్చునని వారు తలచియుండిరి. ఈ వ్యాధి యొక్క వ్యాపకమున కిట్టి బురదనెలలు కారనములు కాకపోయినను ఎట్లు సహాయకారులగునో ముందు చదువగలరు.

క్వయినాపట్టనుచింకాను అను ఆమె కనిపెట్టెను

  1640 సంవత్సరమునందు (Countess Chinchon)  చింకా నను నామె, ఇప్పుడమెపేరు మీదుగా వాడబడు, సింకోనాబార్కు అను క్వయినా పట్టను కనిపెట్టి ఈ జ్వరములకు మిక్కిలి ప్రసిద్ధిగా ఉపయోగించుచుండెను. 60 సంవత్సరముల పిమ్మట టూర్టి యని ఇటాలియా వైధ్యుడు అక్కడి జ్వరములను క్వయినావలన కుదురునని అనియు రెండుతరగతులుగా విభజనచేసి చూపెను. 1880 వ సంవత్సరము వరకు వైధులనేకులు కొంద రీజ్వరము సూక్షజీవులవలన బుట్టినదనియు, మరికొందరు చెడుగసలివలన బుట్టిననియు వాదించుకొను చుండిరి.