పుట:Chali Jvaramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

చలిజ్వరము

వ్యాధిని గురించి మాటలాడినప్పుడు ప్రజలు భయపడుచున్నారుగాని అంతకంటె 15 రెట్లు హెచ్చుగ మన దేశపు ప్రజలప్రాణములను తీయుచున్న ఈ జ్వరములను గూర్చి అందరును నిర్లక్ష్యముగ నున్నారు. ఈ జ్వరముల వలన, చనిపోవువారల సంఖ్యకంటె, చిరకాలము రోగపీడితులై బలమును కోల్పోయి పనిపాటలు చేయలేక, భూమికి బరువు చేటుగానున్న ప్రజలసంఖ్య ఏటేట ఎంత హెచ్చుచున్నదో చెప్పనలవికాదు.

ఒక్క బొంబాయి పట్టణములో ఒక్కొక సంవత్సరమునకు[1] పనిపాటలు ఛేయువారలలో మాత్రము లెక్కవేయగా సంవత్సరము ఒక్కింటికి రెండు లక్షల ఇరువది అయిదువేలమంది జ్వరపడుచున్నారు. వీరందరు సగటున సంవత్సరమునకు ఒక వారము పని చెడుచున్నారు. పనివానికి సగటున దినము 1-కి రు. 0-5-0-లు జీతముచొప్పున లెక్క వేసికొనిచూడగా మొత్తముమీద పనివారలకు మాత్రము ఒక్కొక సంవత్సరమునకు 5,62,500. రూపాయలునష్టము వచ్చుచున్నది.


  1. ఈ లెక్కలు 1911 సం॥ రంలో ప్రచురింపబడిన డాక్టరు బెంట్లే గారి ' మలేరియా జ్వరకారణ విచారణ ' యను గ్రంథమునుండి తీసికొనబడినవి.