పుట:Chali Jvaramu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

చ లి జ్వ ర ము


చినను వేరొక వ్యాధి చిహ్నము లేవియు కాన రానందునను ,రోగి యొక్క సామాన్య లక్షణములను బట్టియు వ్యాధి తప్పక , చలిజ్వరమే అయి యుండునని నిశ్చయించితిని. పేరు - రాజమ్మ. వయస్సు 8 సంవత్సరములు


కాని కడుపులో క్రిమిజాతు లేవైననుండి వానివలన ఈ జ్వరముకలుగుచున్న దేమో యను సందేహము నిష్పత్తి చేసికొనుటకును, జీర్ణకోశము నందలి మందమును కొంత తగ్గించుటకును, నేను చూచిన మొదటి దినమున ఒక | గేయిను శాంట నిను (Santonine), రెండుభస్మము (Calomel) గలపొట్లమును రాత్రి యొకటియు, మరునాటయుదయమున ఒక టియు ఇచ్చి పిమ్మట సాఫీ గా విరేచనమగుటకు వేరొకటిచ్చితిని. దానివలన రెండు మూడు ని రేచనము లయ్యును 'జ్వరమ తగ్గక 104 డిగ్రీలవరకు మరునాటి సాయం కాలమునకు హెచ్చెను. అంతట రెండు గ్రెయినుల క్వయినా హైడ్రోక్లోరైడు అను మందును, ఒక మందు