పుట:Chali Jvaramu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక దినమున అనేక లక్షల పిల్లలు పుట్టును

మన రక్తములో ప్రవేశించిన తరువాత ఈ ప్రకారము ఒక్కొక్క దినమునకు ఒక్కొక్క మలేరియా పురుగునుండి అనేక లక్షలు పిల్లలుపుట్టి పెద్దరుగు చుండును. ఇట్ఘ్లు దినదినమునకు కోట్లకొలది మలేరియా పురుగులు పెరిగి రక్తములోని యెర్రకణములన్నిటిని తిని రోగిని కృశింపజేయును. ప్రక్కనున్న 13-వ అటము చూడుము. కొంత కాలమున కారోగిచ్చ్చినయెడల ఆరోగిలయం దుండు మలేరియూపురుగు లన్నియు చావవలసినదే కదా? సృష్టి వైచిత్ర్య మేమోగాని ఈ జాతిజీవు లిట్లు నశింపక తరతరమునకు వృద్ధియగుటకై వేరొక విధమైన సంతానవృద్ధివిధానము ఏర్పడియున్నది.

సంయోగ సహిత సంతానవృద్ది

రెండవవిధమయిన సంతానవృద్ధికి సంయోగ సహిత సంతానవృద్ధి యని పేరు. ఈ రెండవ విధమయిన సంతానవృద్ధికి సాయపడుట కే దోమలు పోషకులగుచున్నవి. మన రక్తములోని ఎర్రకణములలోనుండు మలేరియా పురు గులు కొన్ని 22-వ పటమునందు 3,4,5,6 లలో చూపబడిన ప్రకారము యుక్తవస్సునకు పెరిగిన తరువాత వాని జీవస్థానవిభాగమునొందక 7 లో చూపబడిన ప్రకారము అర్ధ చంద్రాకరము నొందును. దీని నుండి 8, 6 పటముల లో చూపబడిన ప్రకారము