పుట:Chali Jvaramu.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


91

ఎనిమిదవ ప్రకరణము

రెండు గ్రెయినులకంటె తక్కువమోతాదులనిచ్చుట వలన పిన్నలకుకూడ అంతగా నుపయోగకరముగా నుండదని నాఅభిప్రాయము. పిన్నల విషయములొ క్వయినా చేదుగనుండుట యొకగొప్ప అభ్యంతరము గా నున్నప్పుడు "యూక్వినీను" అను చేచులేని మరియొక తరహా క్వయినాను చక్కెరతో కలిపి పొడిగా నీయవచ్చును. నీళ్ళలో కలిసిన యెడల అదికూడ చేదగును. అయినను ఇదిచేదుగల క్వయినాయంత గుణణమునీయదు.

జ్వరముతగ్గిన తరువాత చేయవలసిన చికిత్స.

  జ్వరము తగ్గినతరువాత చేయవలసిన వైద్యము లొనే సామాన్యముగా మనదేశములో మిక్కిలి అశ్రద్ధ చేయుచున్నారు. జ్వరము నాలుగుదినములు రాకపోయిన తోడనే ఆజ్వరము పోయినదనుకొని ఔషధము తీసికొనుట మానుచున్నారు. ఇదిగాక క్వయినా అనిన మనదేశముప్రజలలో ననేకులకొక విధమైన ద్వేషముగలదు. దానియందు అనేకదుర్గుణములుగలవని చెడువాడుకలుగలవు. అవియన్నియు నంతగా నిజమైనవికావు. క్వయినా తీసికొనినతరువాత కొందరికి తాత్కాలికముగా చెవుడు పట్టుటయు, ఒకానొకప్పుడు పవరుపెరిగి వాంతులు గలుగుటయు, గలదు. కాని వీనిరెంటిని అంతగారోగి గమనించవలసిన పనిలేదు, మందుయొక్క మోతాదును తగ్గించిన వెంటనే చెవుడు పోవును. విరే