పుట:Chali Jvaramu.pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


నాలుగవ ప్రకరణము

               దోమ

వివిధజాతులదోమలు:- సాధారనముగా నిండ్లలోమనముచూచు దోమలన్నియు వ్యాధులను జేరవేయునవికావు. ఈ విషయమున రెండుజారుల దోమలు మాత్రము మనకు ముఖ్యమైనవి.

1. ఆనాఫలీను దోమలు:- ఇవి మలేరియా జ్వరమును కలిగించు పురుగులు. ఒక మానవుని నుండి మరియొక మానవునికి జేరవేయునవి . 2. క్య్హూలెక్సు దోమలు:-ఇవి ఏనుగకాలు లెక మూదకాలు మొదలగు వ్యాధులను జేరవేయుంవి.

3.స్టిగోమియాదోమలు:- ఈరెండుజాతులును గాక ఆకారమునందు కొంచెమించుమించుగా క్యూలెక్సు దోమవలెనె యుందిచెవులప్రక్కన జేరి గెయ్ అని కూయుచు విసుకుజెందించెడుదోమ మరియొకటి కలదు. దీనికి స్టిగోమియా దోమయనిపేరు. ఇది వ్యాధులను కలిగించుటలో సహకారి కాదు.