పుట:Chali Jvaramu.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


యినతరువాత ఆదినముననే మరికొంతసేపటికి రెండవవారి రక్తములో ప్రవేశించిన జ్వరపు పురుగుల సంబంధమైన జ్వరము దాని సమయమునకు లెక్క ప్రకారము 24 గంటలకు రావచ్చును. అట్టిరోగులకు ఒకదినమున రెందుసార్లు జ్వరమువచ్చును.

తృతీయకజ్వరపు పురుగులవలన దినదినము జ్వరము వచ్చుట:-

      లేదా 48 గంటల కొకసారి వృద్ధింబొందు జాతిలోని జ్వరపు పురుగులు కొన్ని యొకనాడును, మరి కొన్ని మరుసటిదినమునను రోగియొక్క రక్తములో ప్రవేశించినయెడల, మొదటిరినమున ప్రవేశించిన పురుగుల సంబంధమైనజ్వరము ఒకనాడును, రెండవదినమునప్రవేశించిన పురుగుల సంబంధమైనజ్వరము ఆదినమునకు మర్సటిదినమునను వచ్చును. అందుచేత 48 గంటల కొకసారి జ్వరమును కలుగజేయు పురుగు రక్తములో నున్నప్పుడు కూడ నొకానొకప్పుడు, జ్వరము 24 గంటల కొకసారి రావచ్చును. 5-వ పటములో చూపబడినది ఈజాతి జ్వరమే. మందు ఇచ్చుటవలన ఒకజట్టు పురుగులు చచ్చినవి. అందుచేతనె 5,7 తేదీలను జ్వరము రాలేదు.  ఆ మందు రెండవజట్టు పురుగులనేమియు చేయలేదు. కాబట్టిఆజట్టుపురుగులవలన గలిగిన జ్వరము దాని నియమితకాలమునకు అనగా దినమువిడిచి దినము వచ్చుచున్నది.