పుట:Chali Jvaramu.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
6
చలిజ్వరము


బెదిరించుచు మునసపు కరణముల ద్వారా రాయబారములనంపుచు కరణముల ఇండ్లలో విందుభోజనము లారగింఫుచుందురు.

కావున ప్రజల జ్ఞానాభివృద్దికి చేయుభారము శాస్త్రజ్ఞానముగల వైద్యులదేకాని సర్కారువారి దంతగాకాదు. ఈవిషయమై ప్రజలకు కావలసిన సామాన్య విషయములను బోధించు నిమిత్తము ఆరోగ్య మనుపేర నొక మాసపత్రికను సాగింప బూనితిని గాని తగినంత ప్రోత్సాహము కనబడక పోవుటచే తను ఒక్కొక విషయమై పెక్కుసంచికలలో ముక్కలుముక్కలుగా వ్రాయుటకంటె ఒక్కొక విషయమును గూర్చి ప్రత్యేకముగా నొక్కొక చిన్నపుస్తకమును ప్రచుతించిన నది శాశ్వతముగా నుపయోగపడునని తలచుటచేతను ఈచిన్న పుస్తకమును వ్రాయబూనితిని.

మన దేశమునందు జనన మరణముల లెక్కలలో వ్యాధులను క్రమముగ పేర్కొనుట లేదు. ఈ రిజిష్టర్లను తయారుచేయు గ్రామాధికారికి దేహఖాయిలా, జ్వరము, విరేచనములు, అను ఈ 3 బాపతుల వ్యాధులుతప్ప తక్కినవి తెలియవు. ఈ బాపతుల క్రిందనైనను తనపై యుద్యోగస్థుడు గ్రామమునకు వచ్చిన దినముననే వినికిని బట్టి వ్రాయు