పుట:Chali Jvaramu.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


56

చ లి జ్వ ర ము

ఇందుకొరకు పారవేయబదిన ఓటికుండలోను, కిర్సినాయిలు డబ్బాలలోను, ఉపయోగములే లేని కుడితిగోలెములోన్, వానిలో నిలువ నీళ్లుండిన యెడల ఆనీళ్లలో నతివేగముగ పరుగులాడుచున్న చిన్నచిన్న జంవుతులు కనబడును. అవి అంగుళములో 16-వ వందు మొదలు 4-వ వంతు వరకుండును. వీనినిపట్టి స్వచ్చమైన తెల్లని గాజుసీసాలోని నీళ్లలోవేసి పరీక్షించిన నవి నీటి యుపరితలమునకు వచ్చి తోకలోని గొట్టముతో గాలినిపీల్చు కొనుటయు వెంటనే మునుగుటయు చూడగలము.

దోమపిల్లలను పట్టుసాధనము

  ఇట్లు దోమపిల్లలను పట్టి వానిజాతులను తెలసి కొనుట కొక సులబమైన సాధనము గలదు. 1 1/2 అడుగు పొడుగుగ్ల ఒక ఇనుప తీగెను తీసిమొని దానిని కడియమువలె వంచికట్టవలెను. ఈకడియమును మూడుగొలుసులతో తక్కెడ పళ్లెము వలె వ్రేలాడదీయవలెను. ఈ గొలుసుల మూటియొక్క కొనలను ఒక చిన్న ఇనుప ఉంగరమునందు తగిలించి, ఆ ఉంగరమున కొకచేద త్రాడునుకట్టవలెను. ఒక నూతిలో దోమపిల్లలున్నవో లెవో తెలిసికొనుటకు ఈ వలను మెల్లగ