పుట:Chali Jvaramu.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


95

ఎనిమిదవ ప్రకరణము

చక్కెరఫాకములో పొదిసిన మాత్రలను ఇచ్చుట యుక్తము. ఈమాత్రలను ఎప్పటికప్పుడు క్రొత్తగా తయారుచేసికొనుచుండవలెను. ఏలయన మాత్రలు ఆరిపోయి మిక్కిలి గట్టిపడినయెడల నవి జీర్ణకోశములో జీర్ణముగాక మలమునందుపోయి మందంతయు వృధా యగును. అందుచేతనే ఒక్కొకప్పుడొక్కొక్క రోగిమి ఎన్నిదినములు ఎన్నిమాత్రలు ఇచ్చినను జ్వరము కుదూక యొకనాడు విరేచనములకు మందిచ్చిన ఆ మాత్రలన్నియు మలములో నొక్కపెట్టున ఉండలుండలుగా వెలువడును.

చక్కెరలో పొదివిన మాత్రల ఉపయోగము.వాలు పాఠ్యం

  అయినను చక్కెర పైకప్పుగలమాత్రలు త్వరగా జీర్ణ మగునుల్. వానిని సామాన్యముగా నుపయోగింప వచ్చును. సర్కారువారు చలిజ్వరముగల ప్రదేశములలో క్వయినా పొట్లములను ఉచితముగ పంచిపెట్టుచున్నారు. కొద్ది నలలకు తపాలాఫీసులో అమ్ముచున్నారు.ఈమందు చేదుగ నుండుటచేత ప్రజలలోనంతగా హితవుగా వ్యాపకమగుటలేదు. ఇదిగాక ఇట్టిపద్ధతి ప్రజలకు క్వయినాయందుగల అనిష్టమును హెచ్చించుచున్నది. ఊరక వచ్చుచున్నందువలన, వారికి దానివిలువ తెలియక పోవుటచేతనే సామాన్యప్రజలు అట్టి పద్దతివలన లాభములను పొందనేరరు. దీనికి తోడు నేను ఇదివర లో చెప్పియున్నట్లు అజ్ఞానులగు వైధ్యులు