పుట:Chali Jvaramu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

107


రు 50 ల వరకు జరినామా విధింతురు. అట్టి శాసనము మన దేశములోకూడ పుట్టినయెడల అప్పుడే యిండ్లలోని పాడు నూతులును, నిలువ నీటి తొట్టులును, రూపుమాయును.

ఇదిగాక పెద్దవిగా పెరిగిన దోమలు, సాధరణముగా చిలక కొయ్యలమీదను దండెములమీదను, వ్రేలాడవేసిన బట్టలచాటున, దాగికొని యుండును. కావున మాసినబట్టల నెల్లప్పుడు తగినపెట్టెలలోవేసి మూసివేయవలెను. గంధకం సాంబ్రాణి మొదలయిన వానిని కాల్చిపొగవేసిన యెడల దోమలాపొగను భరింపజాలక పారిపొవును. లేదా చచ్చిపోవును. కావున గదులలో నట్టిపొగను రాత్రులయందు వేయు చుండివలెను. దోమలను తరిమివేయుటకు వట్టిగడ్డి పొగను రాత్రులయందు వేయుచుండ వలెను. దోమలను తరిమివేయుటకు వట్టిగడ్డి పొగవేసిన చాలును. అట్లు పొగవేయు నప్పుడు గదులలోని మనుష్యులు వెలుపలకు పోయి తలుపులన్నియు మూసివేయవలెను.

2. ప్రతి మానవుని దోమకాటునుండి కాపాడుట.

ప్రతిమానవుని దోమకాటునుండి కాపాడవలెను.

దోమలు రాత్రులయందేగాని కుట్టవను సిద్దాం తమునుండి యీ పద్ధతి యుపయోగము లోనికి వచ్చుచున్నది. చలిజ్వరముగల ప్రదేశములలో నివ సించువారు తమ యిండ్లలోని ద్వారములకును, కిటికీలకును, దొమతెరవలెనుండు ఇనుప వలలతో