పుట:Chali Jvaramu.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


74

చ లి జ్వ ర ము

సామాన్యముగా వెంటనే రోగి నిద్రపోవును. పిల్లలకు సామాన్యముగా చెమట పట్టకపోవచ్చును.

విరామ కాలము

  3. విరామకాలము: జ్వరము దిగిపోయినతోడనే రోగి తన పనులు చేయుటకు దార్ద్యము కలిగియుండును. మొదటిసారి జ్వరము వచ్చినప్పటినుండి లెక్కచూచుకొనగా 24 లేక 48 లేక 72 గంటలకు తిరిగి  మొదతిరోజున నుండిన లక్షణములతొ అనగా చలుకుదుపు జ్వరము చెమ్మట వీనితోడ తిరిగి వచ్చును.  సామాన్యముగా మందు పుచ్చు కొననియెడల కొంతకాలమునకు నీరసమధికమై రోగి మృతినొందును. లేదా రెండుమూడు సంవత్సరముల వరకు అప్పుడప్పుడు జ్వరమువచ్చుచుండును. రోగిని బలహీనునిగ జేయుచు కొంత కాలమునకు వానిని ఇతర రోగముల పాలుచేయవచ్చును. ఒకసారివచ్చిన చలిజ్వరము నిశ్శేషముగ కుదరని యెడల నొకానొకప్పుడు 5 లెక 6 సంవత్సరముల తరువాత కూడ బయటబడి తిరిగి రోగిని బాధింపవచ్చును. మిక్కిలి బలవంతులగు కొంతమందికి జ్వరము క్రమక్రమముగ దానంత టది తగ్గిపోవచ్చును.

విషజ్వర లక్షణములు.

  విషజ్వరములలో కూడ పైనిచెప్పిన లక్షణములే యుండవచ్చునుగాని సాధారణముగా చలియుండు