పుట:Chali Jvaramu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

చ లి జ్వ ర ము


2.మఱియొక ఉపజాతి అనాఫలీసు దోమలు ప్రవాహముగల నీటిలో తమపిల్లలను పెట్టును. ఇట్టి వానికి సాధారణముగా పొలములలోని పంట కాలువ లాధారములు.

3. మరియొక ఉపజాతి అనాఫలీసు దోమలు ఇండ్ల సమీపముల నుండు లోతులేని బురదగుంటలలో తమ పిల్లలను పెట్టును. సాధారణముగా ఈ జాతిదోమలు మన దేశములో మిక్కిలి యధికముగ ప్రబలియున్నవి. వర్షకాలము రాగానె యూరి బయట గోతులలో జేరు నిలవ నీటిలో నీ దోమపిల్లలమితముగ నుండును. ఇండ్లలో తరుచుగ జొరబడు అనాఫలీసు దోమలు ఈజాతిలోనివే. అనాఫలీసు దోమలయందలి యుపజాతుల నివాసస్థానములు, వాని ఆహారపదార్ధములు, వాని నడవడికలు మొదలగువిషయము లింక ననేకములు నిశ్చయముగా మనకు తెలియవు. అయినను అనాఫలీసు దోమలనుగూర్చి ఈ క్రిందివిషయములను చక్కగ గమనించుట మంచిది.

అనాఫలీసు దోమల నడవడికల సంగ్రహము

1.అనాఫలీసు దోమలు ముఖ్యముగ రాత్రుల యందే సంచరించును. పగటియం దవి చీకటి గదులలోగాని, చీకటి గల తలుపు మూలలలోగాని,