పుట:Chali Jvaramu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

చ లి జ్వ ర ము


చనము సాఫీగా అగునట్లు మందు ముందుగా తీసికొని, అనుపానములను కొంచెముమార్చి ఇచ్చిన యెడల క్వయినాయందలి వాంతి గలిగించు గుణము నిలిచిపోవును.

క్వయినాయందు మన ప్రజలకు గల ద్వేషమునకు కారణము.

క్వయినా యందుమనప్రజ లకుండు ద్వేషమునకు మరి రెండుకారణములు గలవు. అందు ముఖ్యమైన దేమనగామన దేశమందలి శాస్త్రజ్ఞానము లేని వైద్యులనేకులు, చలిజ్వరమునకు తాముకూడ క్వయినా ఇచ్చి కుదుర్చునెడల తమ కభిమానమని యెంచి తాము క్వయినాను ఉపయోగించుట లేదని డంబములు కొట్టుచు క్వయినా యొక్క చెడుగుణములు గోరంతలు కొండంతలుగా వర్ణించు చుందురు.

కొందరు స్వదేశవైద్యులు చేయుపద్దతి.

నేనుకూడ క్వయినాయిచ్చి ఒక దినములో జ్వరములను నిలుపగలను. కాని దాని దుర్గుణములకు జడిసి నేను ఎన్నడును దానిని ఉపయోగించను ' అని కొందరు, 'క్వయినా ఇచ్చినయెడల జ్వరము లోపలనే అణగిపోయి శరీరమునకు కీడుకలుగజేయు నని మరికొందును, ఈవైద్యులు చెప్పుచుందురు. మలేరియా పురుగులను క్వయినా ఎంతశీఘ్రముగ నాశనముచేయునో తెలిసికొనినవార లెన్నడును అట్లు చెప్పరు. వీరిలో ననేకులు దానివాసన మారునట్లు కొంచెము కస్తూరినో, పిప్పర మెంటునో, హరతికర్పూ