పుట:Chali Jvaramu.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
5
మొదటి ప్రకరణము


జ్వరము
వైద్యుల
లోపము.
యొక్క వ్యాపకమును గూర్చియు దానిని తప్పించుకొను మార్గమును గూర్చియు వివరముగ బోధింపక పోవుట మన దేశమందలి వైద్యులలోపము.

ఈ విషయముల యందు సర్కారువారు అంతగా సాయము చేయజాలరు. ఒకవేళ సాహసించి చేయబూనినను వారి ఉపదేశములు ప్రజలకంతగా హితవుగా నుండవు. ఇందుకు ఉదాహరణమేమన:-

సర్కారువారి
ఉపదేశము
ప్రజలకు
హితవుగా
నుండదు.

మునివిపల్ జవానువచ్చి కలరారోగిగల ఒక ఇంటియందలి వారికి "రోగినందరును తాకకూడదు; ప్రత్యేకముగా నొక గదిలోనుంచి వైద్యముచేయవలెను" అనిచెప్పి నప్పుడు "మీ యింటనుండు చలిజ్వరమునకు మీ పెరటిలోని పాడునూతిలో నున్న దోమలే కారణము. ఆ నూతిని పూడ్చిన మీకు జ్వరములురావు" అనిచెప్పినప్పుడు ఆజవాను చేసిన హితోపదేశమునకు ప్రత్యుపకారముగా రెండుతిట్లుతిట్టి తలుపులు మూసికొందురు. ఇట్టి ప్రజలకు నచ్చజెప్పి బోధించుట కేర్పడిన శానిటరీ ఇనస్పెక్టర్లనేకులు ప్రజలతో కలసి మెలసియుండి తగిన రీతిని బోధచేయుటకు బదులుగా తమ యధికారమును చెలాయించుచు వీదులలో నున్న బండ్లజాబితాలు తయారుచేయించి న్యూసెన్సు క్రిందచేర్చి