చలిజ్వరము/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

చలిజ్వరమును నివారించు పద్ధతులు

చలిజ్వరమును నివారించుటకు రెండు పద్దతులు గలవు.

I.క్వయినాయొక్క సాయముతో నివారించు పద్ధతులు.

II. క్వయినాయొక్క సాయమున కోరకయే నివారించు పద్దతులు.

క్వయినాయొక్క సాయముతొడ జ్వరమును నిదానించు పద్దతులు.

I. క్వయినాయొక్క సాయముతో నివారించు అద్దతులు. ఇందు రెండు విధములు కలవు.

1.గ్రామములోని ప్రజల నందరను కాపాడుటకొక కేర్పడినవి.

2. ప్రతిమానవుడును తిన్నుతాన్ కాపాడుకొనుట కేర్పడినవి.

1. ఒకగ్రామములో ఎక్కడను చలిజ్వర మిక ముందు వ్యాపించకుంద చేయవలె ననిన అంతకు పూర్వ మాగ్రామములో నున్న చలిజ్వరమును నిర్మూలము చేయవలెను. పిమ్మట క్రొత్తగ నీ జ్వరములు రాకుండ చేయవలెను.

చలిజ్వరపు రోగుల నందరను లెక్కించి వారల కందరకు క్వయినా యియ్యవలెను.

ఇందులకు ఆ గ్రామమునందు చలిజ్వరముగల నందరిని లెక్కించి జాబితాలు తయారు చేయవలెను. ఆ గ్రామమునందు జ్వరపుగడ్డగల వారి జనాభా లెక్కలు వ్రాయవలెను. సందేహముగనున్న ప్రజలయొక్క, అందు ముఖ్యముగ బిడ్డలయొక్క నెత్తురుబొట్టు నొకదానిని తీసికొని సూక్ష్మదర్శనితో పరీక్షింపవలెను. ఈ ప్రకారము చలిజ్వరసంబంధమైన అనుమానముగల మనుష్యుల జాబితాలు తయారుచేసి వారి కందరకు క్వయినా మాత్రల నియ్యవలెను. చేదుమందు ఇచ్చిన యెడల వారు చాటునకు పోయి దానిని పారవేయుదురు. కావున చక్కెర పైకప్పుగల తియ్యని మాత్రల నిచ్చుట మిక్కిలి ఉపయోగకరము.

ఇట్లీమందులిచ్చి ఆరు మాసముల వరకు గ్రామములో చలిజ్వరపు రోగి యొక్కడుకూడ లేకుండ గాలించి చేయవలెను. గ్రామములోనికి క్తొత్తగా వచ్చు ప్రతివారిని పరీక్షించి వానిపేరు జాబితాలో చేర్చి వానికి చలిజ్వర మున్నయెడల చికిత్స చేయవలెను. ఇట్లు చేయుటవలన ఆ గ్రామములో దోమలున్నను ఆదోమలకు చలిజ్వరపు పురుగులు దొరకనందున చలిజ్వరము వ్యాపించక కాలక్రమమున నశించి పొవును.

ఒక గ్రామములోని జనుల కందరకును ఈ ప్రకారము వైద్యము చేయుట సాధారణముగా సాద్య ముగాదు. ఏలయన ప్రజలందరును అభిమానించు కొని ఒక కట్టుగా పనిచేసినగాని ఈపద్దతివలన చలిజ్వరము నశింపుగారు. ఒక్కరోగికి గ్రామములో మిగిలి యున్నను, దోమలు వానినుండి చలిజ్వరపు పురుగులను సంపాదించి వానిని పెంచి, యనేక వేలుగాచేసి, యనేకులకు పంచిపెట్టును. కావున ఐకమత్యముగాని, తగినంతకట్టు బాట్లుగాని లేని స్ధమలులలో ఈ పద్దతివలన ప్రయోజన మంతగా నుండదు. అయినను జయిళ్లలోను, పటాలముల లోను ఈ పద్దతి మిక్కిలి చక్కగ పనిచేయును. గ్రామములలో కూడా సాధ్యమైనంత వరకు అవలంబింప వచ్చును. ఎంత తక్కువమంది చలిజ్వరపు రోగులు గ్రామములో నున్నారో దోమలకు అంత తక్కువగా జ్వరపు విత్తనములు దొరకును గదా! దోమలకు చలిజ్వరము పురుగులు చాలినన్ని దొరకని యెడా వ్యాధి కొంతవఱకైనను తగ్గియుండును.

తాముమాత్రము వారమునకొకసారి క్వయినా పుచ్చుకొనవలెను.

2. గ్రామమంతయు గాపాడుటకు సాధ్యము కానప్పుడు తమ్ము మాత్రము చలిజ్వరమునుండి తప్పించుకొన దలచినవారు ప్రతివారును చలిజ్వర ముగల ప్రదేశములలో తాము నివసించుచున్న దినములును వారమున కొకసారి పది లెక పదిహేను గ్రెయినుల క్వయినాను నాలుగైదు అవున్సుల నీటి లోచేర్చి ద్రావకము చేసిగాని, మాత్రలుగ గాని పుచ్చుకొన వలెను. ఇందుచే దోమలు తమరక్తములో చలిజ్వరపు పురుగులను చేర్చినను ఆ పురుగులు వెంటనే నశించిపోవును. చలిజ్వరములుగల ప్రదేశములందు నివసింపవలసిన ఉద్యోగస్థు లనేకులు ఇట్లు క్వయినాను పుచ్చుకొని సంవత్సరముల కొలది ఈ జ్వరభాధ లేకుండ గడుపుదురు. ఇట్లు క్వయినాను తీసికొనుటవలన శరీరమున కేమియును చెరుపులేదు.

క్వయినా యొక్క సాయము కోరకయే చలిజ్వరమును నివారించు పద్ధతులు.

II. క్వయినా యొక్క సాయము కోరకయే చలిజ్వరమును నివారించు పద్దతులలో మూడు విధములు గలవు.

1.ఒక గ్రామము నందలి అనాఫలీసు దోమలను నశింపుచేయుట.

2. ప్రతి మానవుని దోమకాటునుండి కాపాడుట.

3. మనము కాపాడ దలచుకొనిన వారిని మాత్రము చలిజ్వరపు రోగులనుండి విడదీసి ప్రత్యేకముగ నివసింప జేయుట.

1.అనాఫలీసు దోమలను నశింపు చేయుట.

చలిజ్వరములుగల గ్రామమునందలి అనాఫలీసు దోమలను నశింపు చేసిన యెడల ఇతరులకు కొత్తగ చలిజ్వరము వచ్చుటకు వీలులేదు. ఇట్లే దోమలను నశింపు చేయుటకు మనకు సాధ్యమగునా? మనము చేయవలసిన దేమి?

అనాఫలీసు దోమలను నశింపుచేయవలెను.

దోమ లధికముగా గల ప్రదేశములలో నా దోమలను ఎగురుచుండగా వానిని పట్టిచంపుటకు మన మనేక పటాలలములను పెట్టినను వానితో మనము పోరలేము. కాని వాని పిల్లలను పెట్టుకొనుటకు ఈ దోమలకు చోటులేకుండ చేసినయెడల నీ దోమలజాతి ఒక తరముతోనే నశించిపోవును. దోమలు తమగ్రుడ్లను నీటిమీదనే పెట్టునని మనకు తెలిసియున్నది. ఇవి అరంగుళము లోతునకు తక్కువగా నున్న నీళ్లలో తమ గ్రుడ్లను పెట్టవు.

కావున గ్రామమునందును, గ్రామమునకు చుట్టు ప్రక్కలనుండు ప్రదేశము లందును, దోమ పిల్లలు నివాసము చేయుటకు తగియుండు గోతులు, బురద నేలలు, మొదలగు వానియందలి నీటినంతను ఎప్పటి కప్పుడు మురుగు కాలువల మూలమున పోగొట్టి వేయవలెను. గ్రామముల్నకు అరమైలు దూరములో ఊడ్సుచేలుండగూడదు. పంట కాలములలో గడ్దిమొదలగు దుక్కు పెరిగి యున్న యెడల నాకాలువలను బాగుచేసి నీరు చక్కగా ప్రవహించు నట్లు చేయవలెను. ప్రవహించు నీటిలో దోమలు సధారణముగా తమగ్రుడ్లను పెట్టవు. గ్రామము నందలి పాడు నూతులను రోడ్లప్రక్కలను, దొడ్ల లొను, ఇటుక ఆవములయ్యెద్దను, ఉండు కొలుములను పూడ్చివేయవలెను. పూడ్చుటకు వీలుకానట్టి చెరువుల యందును, లోతులయందును, నుండు నీటిపైని కిరసనాయిల్ ను వారమున కొకసారి పోయుచుండవలెను. అట్లు చేయుటచే నా నీటియందలి దోమపిల్లలు పీల్చుటకు గాలిలేక చచ్చిపోవును. ప్రజల కుపయోగమైనట్టి నూతులు, చెరువులు మొదలగు వానియందు చేపలను పెంచిన వానియందు పెరుగుచుండు దోమపిల్లల నాచేపలు తినివేయును. అనాఫలీసు దోమలు నూతులలో పిల్లలను పెట్టి వ్యాధిని వ్యాపింప జెయుచున్న యెడల, దోమలు చొరలేని దోమ తెరలవంటి ఇనుపవలలతో నా నూతులను చక్కగ మూసి వేయవలెను. రాత్రులయందేగాని పగటి పూట దోమలు సంచరింపవు, కావున, ఆనూతులయందు వానిని గట్టిగా మూసి పెట్టవలెను. లేదా బొంబాయి (Pump) పంపులతొ నీరుతోడుకొన వచ్చును. ఇట్లు నీరు తోడుకొనుట కుపయోగించు బొంబాయి పంపు రు.25-లకు వచ్చును. ఇండ్లలోని తొట్లలలోను, కుడితి గోలెములలోను, రెండుమూడు దినముల కంటె హెచ్చుగ నీటిని నిలువచేయకూడదు. ఇండ్ల లోను, దొడ్లలో, పగిలిపోయిన డబ్బాలను, కుండ పెంకులును, సీసాలను లేకుండ చేయవలెను. లేని

యెడల వీనిలొ నొకప్పుడు నీరు చేరి దోమ పిల్లలకు అవి నివాసస్థానముగా నేర్పడును.

మన ఇండ్లలోనుండుదోమల నివాసస్థానములు.

నేను ఒకనాడు నాస్నేహితులకు కొందరకు దోమపిల్లలను చూపవలెనని ప్రయత్నించుచు, తొట్టిలోనైనను, పాత డబ్బాలలోనైనను, నిలవ నీరుండునేమో, ఆనీటిలో దోమపిల్లలు చిక్కునేమో యని ఇల్లంతయు దొడ్డియంతయు వెదకితిని. ఎక్కడ వెదకినను, దోమపిల్లలకు ఆధారమగుస్థలము నాకు దొరకలేదు. అయినను మాయింటిలో నప్పుడు దోమ లనేకములుండుట నేనెరిగినవాడ నగుటచేతను, ఆదోమలు ఇంటిలోనే యెక్కడనో పుట్టుచున్న వని నాకు గట్టి యనుమానము గలుగుట చేతను, నేను గదులలోను, అల్మారాలలొను వెదకుటకు ప్రారంభించితిని. కొంచె మించుమించుగ చీకటి కోణ మనదగు సామాను కొట్టునందు నాకు తుదకు ఒక నీటి పళ్లెరము కనబడెను. ఆపళ్లెములో ఒక అంగుళములోతు నీరుపోసి ఆనీటిమధ్య నొక ఇటుక పెట్టి దానిపై ఒక చక్కెరడబ్బా పెట్టబడియున్నది. ఆ పళ్లెరమును బైటికి తీసికొనివచ్చి పరీక్షింపగా 4-వ ప్రకరణమందు చూపబడిన దశలన్నిటియందు నుండు దోమపిల్లలు లెక్కింప శక్యముకానన్ని దానిలో నుండెను. బహుశ; ఆదోమపిల్ల లొక లక్ష యుండినను ఉండవచ్చును. ఆపిల్ల లన్నియు క్యూలెక్సు, స్టిగోమియా జాతులలోనివి. అందు అనాఫలీసు దోమపిల్ల యొక్కటి కూడలేదు. మా యింటిలో రాత్రులయందు చెవులప్రక్కను గుయ్యమనుచుండు దోమలు చేరు చుండినందులకును దోమ లధిమముగ నున్నను చలిజ్వరము లేనందునకును కారణము అప్పుడు తెలిసినది. ఇట్లే మనవారలు కొందరు మంచములకు నల్లులెక్కకుండు టకుగాను వాని కోళ్ళక్రింద చిన్నచిన్న నీటితొట్టులను పెట్టుదురు. నీనియందని నీటిని వారెన్నడును సామాన్యముగామార్చుచుండెడి అలవాటులేదు. దోమ పిల్లలు పెద్ద దోమలుగా పరిణమించుటకు సామాన్యముగా పదిదినములు పట్టును. కావున వారమున కొకసారి తప్పక వీనియందలి నీటిని మార్చుచుండినయెడల దోమపిల్లలందు పుట్టనేరవు.

కాబట్టి గ్రామోద్యోగస్థులుగాని, తగిన ఆపీసర్లు గాని, జవానులుగాని వారమున కొకసారి ప్రతి యింటిని చక్కగ శోధించి దోమపల్లలకు ఉనికి పట్టగు స్థలములు లేకుండ జేయవలెను. ప్రజలకు దోమపిల్లలెక్కడ పెరుగునో, దోమల వలన గలుగు నష్టము లెవ్వియో, ఈ విషయముల నన్నిటిని నచ్చజెప్పి ప్రజల సాయముతో పనిచేసిన యెడల నొకగ్రామములోని దోమ నన్నిటిని త్వరలో నశింపు చేయవచ్చును.

అమెరిగా దేశములో దోమపిల్లల నెవ్వరైన ఇట్టి నీటితొట్టులలో పెరుగ నిచ్చిన యెడల వారికి రు 50 ల వరకు జరినామా విధింతురు. అట్టి శాసనము మన దేశములోకూడ పుట్టినయెడల అప్పుడే యిండ్లలోని పాడు నూతులును, నిలువ నీటి తొట్టులును, రూపుమాయును.

ఇదిగాక పెద్దవిగా పెరిగిన దోమలు, సాధరణముగా చిలక కొయ్యలమీదను దండెములమీదను, వ్రేలాడవేసిన బట్టలచాటున, దాగికొని యుండును. కావున మాసినబట్టల నెల్లప్పుడు తగినపెట్టెలలోవేసి మూసివేయవలెను. గంధకం సాంబ్రాణి మొదలయిన వానిని కాల్చిపొగవేసిన యెడల దోమలాపొగను భరింపజాలక పారిపొవును. లేదా చచ్చిపోవును. కావున గదులలో నట్టిపొగను రాత్రులయందు వేయు చుండివలెను. దోమలను తరిమివేయుటకు వట్టిగడ్డి పొగను రాత్రులయందు వేయుచుండ వలెను. దోమలను తరిమివేయుటకు వట్టిగడ్డి పొగవేసిన చాలును. అట్లు పొగవేయు నప్పుడు గదులలోని మనుష్యులు వెలుపలకు పోయి తలుపులన్నియు మూసివేయవలెను.

2. ప్రతి మానవుని దోమకాటునుండి కాపాడుట.

ప్రతిమానవుని దోమకాటునుండి కాపాడవలెను.

దోమలు రాత్రులయందేగాని కుట్టవను సిద్దాం తమునుండి యీ పద్ధతి యుపయోగము లోనికి వచ్చుచున్నది. చలిజ్వరముగల ప్రదేశములలో నివ సించువారు తమ యిండ్లలోని ద్వారములకును, కిటికీలకును, దొమతెరవలెనుండు ఇనుప వలలతో {{left|దోమలుప్రవేశింపరాని ఇండ్లు: దోమతెరలు.

చేయబడిన తలుపులను సరిగా నమర్చుకొనవలెను.ప్రొద్దుగ్రుంకక ముందే యింటిలో నివసించు వారందరును ఇంటికి చేరిన వెంటనే తలుపులన్నిటిని మూసి దోమలింటిలో ప్రవేశింపకుండ చేసికొనవలెను. రాత్రులయం దెంతమాత్రము వెలుపలకు పొకూడదు. వసారాలో కూర్చొన కూడదు. ఇట్టివారిని దోమలు కుట్టలేవు. మిక్కుటముగ చలిజ్వరములుగల ప్రదేశములలో సహితము అక్కడకు శోధనల నిమిత్తమై పోయిన వైద్యులు నెలల కొలది నివసించియు చలిజ్వరపు పాలబడకుండ తప్పించుకొని యున్నారు.

తమయింటినంతను దోమలు చేరకుంద కాపాడుకొన లేనివారు తమశరీరమును మాత్రము దోమకాటునుండి మరియొక విధమున తప్పించు కొనవచ్చును. దోమలు సాధారణముగా కాళ్లుచేతులు మొదలగు కప్పబడి యుండని భారముల యందే కరచును. కావున ప్రొద్ధు గ్రుంకిన తోడనే ప్రతివారును, చేతులకును కాళ్ళకును మేజోళ్ళ వంటి గుడ్డ తొడుగులను పూర్ణముగా తొడుగుకొనవలెను. మనం మేలుకొని యున్నప్పుడు సమాన్యముగా దోమలు ముఖమీద కుట్టవు. ఒకవేళ ముఖముమీద కవి చేరినను, మనము వెంటనే వానిని తోలివేయుదుము. వీరు రాత్రులయందు దోమతెరతో చక్కగమూ యబడి యుండిన మంచముల మీదనే పరుండ వలెను. ఆమంచము విశాలముగ నుండవలెను. దోమతెరకు ఎక్కడను తమశరీరము తాకకుండ మంచమునకు మయముననే పరుండవలెను. లేని యెడల దోమలు తెరయొక్క వెలుపలి ప్రక్కనే కూర్చుండి తమ సన్నని ముట్టెలను తెరల్లోని రంధ్రము గుండ దూర్చి పొడుచును. దోమతెరలోనే మూలకొంచమురంద్రము పడినను అది ప్రయోజనములేదు. తాము దోమతెరలో పరుండుటకు ప్రవేశించు నప్పుడు తమతో పాటు దోమలుకూడ దూరకుండునట్లు జాగ్రత్త చూచుకొనవలెను. అదివరకే తెరలో దోమలెట్లయిన ప్రవేశించియున్నయెడల వ్చానినిముందుగా పట్టి చంపి వేయవలెను.

ఇతరులను చలిజ్వరపురోగులను విడదీసి ప్రత్యేకముగ నివసింపచేయవలెను.

1.చలిజ్వరముగల రోగులను రాత్రియందెప్పుడు దొమతెరలలో పరుండబెట్టుట, ఇందుచే వెలుపల దోమలు తిరుగుచుండి ఇతరులను కుట్టుచుండినను ఆదోమలకు మలేరియా పురుగులు దొరకకపోవుట చే నచి చలిజ్వరమును కలిగింపలేవు. ఈ పద్దతి వైద్యశాలలో నవలంబించెదరు. అనేక వ్యాధుల వైద్యము నిమిత్తము చేరియున్న పెక్కు రోగులను ఒకరిద్దరు చలిజ్వరపు రొగులును, ఒక టే గదిలో పరుండవలసి వచ్చినప్పుడు చలిజ్వరపు రోగులను దోమ తెరలలో పరుండబెట్టుదురు.

గ్రామమున కరమైలుకంటె దూరముననుండు నిండ్లలో నివసించవలెను.

2.గ్రామమునకు అరమైలుకంటె దూరమున నుండి నిండ్లలో నివసించుట, అనేకమంది చలిజ్వరపు రోగులున్నచోట ఇతరులను కొందరను మాత్రము కాపాడవలెననిన ఈక్రిందిపద్దతి యుప యుక్తము. దోమలు అరమైలుకంటె హెచ్చుదూరము పరుగెత్తలేవను సిద్దాంతమునుబట్టి ఏర్పడుచున్నది. ఇది భాగ్యవంతులకు మాత్రము సామాన్యముగా నుపయోగకరము. చలిజ్వరముగల గ్రామములలో తగిన వీలుగలవారు ఆగ్రామమునకు అరమైలకంటె దూరముగా ఇండ్లను కట్టుకొని ఆయిండ్లలో నివసింప వలెను. వారురాత్రులయందు తమయిండ్లనువిడిచి బయటకు పోకూడదు. తమకు చుట్టుపట్ల అరమైలు దూరములో దోమల కుపయుక్తములగు నిలువ నీరు చెరువులోను గోతులలోను, లేకుండ వాని నన్నిటిని పూడ్చివేయవలెను. లేదా వానిలో చేపలనుపెంచి అప్పుడప్పుడా ప్రదేశముల నెల్ల పరీక్షించు చుండవలెను. ఆయిండ్లకు చుట్టు అరమైలు దూరములో ఊడ్పుచేలుగాని నీరు నిలకడగా పెట్టి పెంచు పైరులుగాని ఉండకూడదు. చలిజ్వరముగల తమసేవకుల నెవ్వరిని తమయింటి చుట్టు కాపురములు పెట్టుకొనకూడదు. వారలను రాత్రుల యందు తమ ఇంటిలో పరుండనీయకూ డదు. ఈ యుపాయములచే వారు దోమల బాధనుండి తప్పించుకొనగలరు.

పైన చెవ్పబడిన పద్దతులలో కొన్ని భాగ్యవంతుల కుపయోగించునవి. కొన్నిమాత్రము బీదల కుప యోగ కరములైనవి. ఒక్కచొ ననుకూలిచు పద్దతులు మరి యొక చోట పనికిరావు. కావున ఏ పధ్దతులు ఏ ప్రదేశమునకు ఏసమయమునందు మిక్కిలి యుప యుక్తములో ఆయాపద్ధతులను యోచించి అవలంభింపవలెను. బుద్దికుశలత గలవారు దోమల యొక్క నివాసస్ధానముల గూర్చియు, కాలమాన స్థితినిబట్టి యవిచెందు మార్పులను గూర్చియు ఇంకను క్రొత్తయంశములను కనిపెట్టుటకు ప్రయత్నించు చుండవలెను.

ఉపసంహారము

మనకిప్పుడు రెండువిషయములు చక్కగ దెలిసి యున్నవి. వానిని మనము శ్రద్ధగ గమనించిన యెడల మన మేప్రదేశమునందైనను చలిజ్వరము లేకుండ చేయవచ్చును.

1.దోమలనశింపుచేయుట:-- దోమలను, గాని గ్రుడ్లను, పిల్లలను, చేతనైనట్లెల్లను, మనముచంపు చుండినయెడల నీజ్వరములు త్వరలో నశింంచిపోవును.

2. చలిజ్వరపు పురుగులను నశింపచేయుట:- సందేహాస్పదులగు ప్రజలకెల్లను, క్వయినా మాత్రలను చక్కెర పాకములో పొదిసి పంచిపెట్టిన యెడల నీజ్వరములు త్వరలో నశించిపోవును.

దొరతనము వారును ప్రజలును ఒండొరుల సాయము నపేక్షిచుచు దేశక్షేమమునకు తొడ్పడవలెను.

ఈపనులను దొరతనమువారు ప్రజలసాహాయ్య మపేక్షింపక చేయదలచినయెడల వారికిని స్వాధీన మగునవికావు. సర్కారు ఉద్యోగస్థులు ఈ పనులను చేయు ప్రయత్నించునప్పుడు అవి ప్రజల కాపనులు హితవుగా నుండవు. ఒకఇంటివారి ఆరోగ్యము కొరకే వారి దొడ్దిలోని పాడునూతిని పరీక్షించు నిమిత్తము సర్కారు ఉద్యోగస్థుడు పొవలెననిన, ఆయింటి యజమానుడు తనకిష్టము లేనియెడల మాయింటిలో ఘోషాస్త్రీ లున్నారని గాని, మాదేవుని గది మయిలబడి పొవుననిగాని చెప్పి, వానిని ఆటంకపరచును. ప్రజలకు ఇట్లే ఏదోవిధమైన అడ్దమును వారు పెట్టుచుందురు. ప్రత్యేకము ప్రజలే తామీ పనులను చేయవలననిన ప్రయత్నించిన యెడల వారికిని ఇవి స్వాధీనమగునవి కావు. కావున సర్కారువారును ప్రజలును ఆన్యోన్యముగా పనిజేయుచు ఇరువురును దేశక్షేమమునకుతోడ్పడ వలయును.

             ==0==