చలిజ్వరము/పరిశిష్టము

వికీసోర్స్ నుండి

ఇంతవరకు గ్రంధమంతయు చదివినవారు చలిజ్వరపు రోగిని గుర్తించుటయును, సామాన్య జ్వరములకు చికిత్స చేయుటయును, కూడ తెలిసి కొనియుందురు. అయినను గడచిన వారములలో నేను చూచిన ఒక రోగి యొక్క వ్యాధి లక్షణములను, ఆరోగికి నేను చేసిన చికిత్సలను వివరించి వ్రాసినయెడల మిక్కిలి యుపయోగకరముగా నుండు నని యెంచి ఈదిగువ నుదాహరించుచున్నాను.

1912-వ సంవత్సరము ఆగస్టు 2-వ తేదిని రాజమ్మకు జ్వరము ప్రారంభించినది. మొదటి నుండియు జ్వరము కాలక్రమము లేక 103 మొదలు 104 డిగ్రీలవరకు వచ్చుచుండెను. వేరొక వైద్యుడు 13-వ తేదీవరకు చికిత్స చేయుచుండెను. మొదట విరేచనములకు ఒకసారి మందిచ్చెనట. పిమ్మట జ్వరము తగ్గు మందులు ఎవ్వియో ఇచ్చుచుండెను. 13-వ తేదీన నేను వెళ్లువరకు క్వయినా సల్ఫేటు 3 గ్రెయినులు మాత్రలు దినము 1-కి రెండు చొప్పున రొగి కిచ్చుచుండిరి. వాంతులు మిక్కిలి అధికముగ నుండెను. నేను రోగిని చూచినది మొదలు జ్వర మెట్లుండునొ తెలియ పరచుటకు ఈ ప్రక్కపుటలోని పటము తయారు చేయబడినది.

దీనిని బట్టి చూడ సాధారణముగా చలిజ్వరము లలో నుండు నటులు రాజమ్మకు అనుదినము గాని దినము విడిచి దినముగాని జ్వరము దిగిపోయి తిరిగి వచ్చుచుండుట లేదని తెలియగలదు. రొగి తనకు తనకు చలి వచ్చుచున్నదని ఎన్నడును చెప్పియుండ లేదు. కాని యెడమ డొక్కలో శ్రధ్దగ పరీక్షింపగా జ్వరముగడ్డ పెరిగి యున్నట్టు స్పష్టముగా తెలియుచున్నది. పూర్వము చికిత్స చేసిన వైధుడు అదివరకే క్వయినా నిచ్చియుండి నందున నేర్పడిన నెత్తురును పరీక్షచేసిన నంతగా నుపయేగముండదని యెంఛి పరీక్షింప లేదు. రొగి యొక్క అవయవముల నన్నిటిని జాగ్రత్తగాపరీక్షిం

చినను వేరొక వ్యాధి చిహ్నము లేవియు కాన రానందునను ,రోగి యొక్క సామాన్య లక్షణములను బట్టియు వ్యాధి తప్పక , చలిజ్వరమే అయి యుండునని నిశ్చయించితిని. పేరు - రాజమ్మ. వయస్సు 8 సంవత్సరములు


కాని కడుపులో క్రిమిజాతు లేవైననుండి వానివలన ఈ జ్వరముకలుగుచున్న దేమో యను సందేహము నిష్పత్తి చేసికొనుటకును, జీర్ణకోశము నందలి మందమును కొంత తగ్గించుటకును, నేను చూచిన మొదటి దినమున ఒక | గేయిను శాంట నిను (Santonine), రెండుభస్మము (Calomel) గలపొట్లమును రాత్రి యొకటియు, మరునాటయుదయమున ఒక టియు ఇచ్చి పిమ్మట సాఫీ గా విరేచనమగుటకు వేరొకటిచ్చితిని. దానివలన రెండు మూడు ని రేచనము లయ్యును 'జ్వరమ తగ్గక 104 డిగ్రీలవరకు మరునాటి సాయం కాలమునకు హెచ్చెను. అంతట రెండు గ్రెయినుల క్వయినా హైడ్రోక్లోరైడు అను మందును, ఒక మందు గ్రెయిను 'పొటాషియంబ్రోమైడు ' అను మందును చేర్చి నిమ్మకాయరసముతో జేసిన షర్బతుతో నాలుగు గంటల కొకసారి యిచ్చితిని.

15-వ తేది ఉదయమున వాంతులు తగ్గెను గాని జ్వరము నిలువలేదు. ఆ తేది సాయంకాలము 3 గ్రెయినుల క్వయినా హైడ్రోక్లోరైడును 10 చుక్కల అరిశుభ్రమైన నీతిలో కలిపి పిఱ్ఱమీది కండలోనికి చిన్న గాజు పిచికారితొ ఎక్కించితిని, 16-వ తేది సాయంకాలం 4గంటలకు జ్వరము 88 డిగ్రీలకు దిగియుండెను (పటము చూడుము) అయినను రెండు గ్రెయినుల క్వయినా హైడ్రోక్లోరైడు గల మందును నాలుగు గంటల కొక మోతాదు చొప్పున అనుదినము విడువక ఇచ్చుచుంటిని. కాని జ్వరము నిలువక క్రమమున క్రమముగ పటములో చూపిన ప్రకారము తిరిగి హెచ్చుచునే యుండెను.

19-వ తేది సాయంకాలం జ్వరము తిరిగి 103 డిగ్రీలవరకు వచ్చి యున్నందున ఈజ్వరము కాలజ్వరము (Kala Azar) ఏమోయని మిక్కిలి సందేహముతొ రోగిని తిరిగి శ్రద్ధగా పరీక్షించితిని. ఎడమడొక్కలో నుండు జ్వరపుగడ్డ (Spleen) తగ్గుచున్నట్లు కనుబడినను, కుడిప్రక్కను పైత్యకోశము (Liver) పెద్దదై చేతికి బాగుగ గడ్డవలెతెలియుచుండెను. అందుచే క్వయినాఎంత యిచ్చినను సరిగా నెత్తురులోనికి చేరుటలేదని యూహించి తిరిగి 8 గ్రెయినుల క్వయినాను మరియొక పిఱ్ఱమీది కండలోనికి పిచికారీ చేసితిని. కాల జ్వరము గూర్చి ప్రత్యేకముగ శోధనలను చేయుటకై సర్కారువారిచే నియమింపబదినన డాక్టరునకు ఈరోగిని చూపి సలహాపుచ్చుకొను నిమిత్తము ఆ డాక్టరునకు సమాచారముతెలిపితిని. కాని మరునాడు అనగా 20 తేది ఉదయము ఏడు గంటలకే రోగి యొక్క జ్వరము దిగిపోయి, శరీరవేడిమి 97 డిగ్రీలకు వచ్చియుండెను. ఆ తేది మొదలు మోతాదుకు రెండు గ్రెయినుల చొప్పున 'క్వయినా హైడ్రోక్లోరైడు ' దినమునకు 6 సార్లు ఇచ్చుచుంటిని. జ్వరము దిగిపోవుటచే కాలజ్వరము అనుమానము లేక పోయెను. రోగి నానాటికి ఆరోగ్యమును పొందుచున్నది. ఇంకను (2-9-=12) దినమున 6 గ్రెయినుల చొప్పున క్వయినా పుచ్చుకొనుచున్నది.

40 దినములకు విడువకుండిన మరియొక చలిజ్వరముయొక్క పటముతొ చేర్చబడినది చూడనగును.

పటమున వ్రాసిన యుదాహరణములను బట్టి మనము తెలిసికొనవలసిన అంశములలో ముఖ్యమయినవి:--

1.చలిజ్వరము అందరి రోగులకు వాని లక్షణముల నన్నింటిని క్రమముగ సూపింపవు. ఒక్కొకప్పుడు ఈ జ్వరములు అనేక వ్యాధుల పోలియుండును.

2.వ్యాధి నిదానమునుగూర్చి తనకుసరిగా తెలియున ప్పుడు వైద్యుడు తొందరపడి అయిన మందును కాని మందును ఇయ్యక తనమనస్సునకు నిశ్చయమని తోచిన వ్యాధిని నిర్ధారణచేసికొని పట్టుదలతొ చికిత్స చేయవలెను.

3. చలిజ్వరములందు జీర్ణకోశములు సరిగాపని చేయనప్పుడు క్వయినాను ఎంతయిచ్చినను ప్రయోజనములేదు. అట్టి సమయములలో క్వయినాను నెత్తురులోనికి పీచికారి చేయుట యుత్తమము.

PRINTED AT THE INDIA PRINTING WORKS, MADRAS