పుట:Chali Jvaramu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రకరణము

7


ను గాని ఏదినమున కాదినము సరియయిన కారణమును విచారించి తనకు తెలిసినంత వరకైనను వ్రాయుటలేదు. జాగ్రత్తగా వ్రాయవలెనని తలచెడు గ్రామాధికారికి గూడ ఏయేవ్యాధులు ఏయే తెగలక్రింద చేరునో తెలిసికొనుటకు ఆధారములు లేవు. జ్వర
భేదములు
కావున ఈ పుస్తకములో మొదటి ప్రకరణము నందు వివిధ జ్వరములకు గల బేదములను తెలుపబూని యున్నాను. ఇందుకొరకు ఆయాజ్వరములచే బాధపడిన రోగుల చరిత్రములను సంక్షేపముగ పటముల రూపకముగ వ్రాయించి ప్రత్యేకముగ తయారు చేయించితిని.

1-వ పటము జ్వరపుపుల్ల.

వివిధ జ్వరభేదములను సరిగా తెలిసికొన వలెనను నెడల 1-వ పటములో చూపబడిన జ్వరపుపుల్ల [1]యను నొక గాజుగొట్టముతో రోగియొక్క శరీర వేడిమిని కొలవవలెను. ఈపుల్లయందు మధ్యభాగమున తలవెండ్రుక కంటె సన్నముగ నుండు


  1. జ్వరపుపుల్ల:—దీనికి ఇంగ్లీషులో ధర్మామీటరు అని పేరు.