పుట:Chali Jvaramu.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


17

మొదటి ప్రకరణము

టకు ప్రారంభించి 17-వ తేది నాటికి 98 డిగ్రీలకు వచ్చి యున్నది. మొదటి తేది మొదలు 17-వ తేదివరకు జ్వర్ము ఒక్కనాడైనను 98 1/2-కు అనగా సామాన్య శరీరవేడిమికి దిగలేదు. ఈ జ్వరమునము క్వయినా ఇచ్చుటవలన ప్రయోజనము కనబడలేదు.

1. పైన చెప్పబడిన రోగులకు ఆరు గురికి వచ్చిన జ్వరము వేరువేరు జాతిజ్వరముల లేక ఒకటే విధమైన జ్వరమా?

2. మొదటి ఇద్దరికిని క్వయినా ఇచ్చిన తోడనే జ్వరము నిలుచుటయేమి? 4-వ పటన్య్ కీబు వానికి క్వయినా ఇచ్చుటచేత ఒకదినము జ్వరము విడిచి మరుసటిదినము జ్వరము విడువక పోవుటకు కారణ మేమి?

3. పైన చెప్పబడిన జ్వరములు, క్రమముతపకుండ ఒకనికి దినదినమును, మరియొకనిని దినము విడిచి దినమును, ఇంకొకనికి 3 దినముల్ కొకసారియు వచ్చుటకును, 5-వ పటములోని వానికి ఏ విధమైన క్రమము లేకుండవచ్చుటకును ఏవైనను కారణము లున్నవా?

4. పైని 2,3,4,5,6 పటములలో జూపబడిన రోగులకు జ్వరము విడిచి విడిచి వచ్చుచుండెను.