పుట:Chali Jvaramu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటికూర్పునకు

సంపాదకీయ భూమిక.


ఇయ్యది మాచే బ్రచురింపబడిన ' కలరా ' గ్రంథమునకు రెండవదియగు వైద్యగ్రంథము. దీనిని డాక్టరు ఆచంట లక్ష్మీపతిగారు మాకొసంగిరి. ' కలరా ' అకస్మాత్తుగ బైబడు నదిగాన నయ్యది యనిన బ్రజలు భయకంపితులయి వెన్నెంటన జికిత్సల నరయు చుందురు. చలిజ్వరము ' కలరా ' కంటెను ఎక్కుడు అపాయకరమయిన దనుట ఈ గ్రంథములోని మొదటి కొన్నిపుటలు చదువువా రెల్లరకు దెల్లముగా గలదు. కాని ఇది మెల్లగ దెలియరాని విధమున నాటుకొని చెఱుపు చేయుటంజేసి ప్రజలకు విశేషము భయము పుట్టుటలేదు. భయము గల్గినంగాని ప్రతీకార మార్గములకు బూనుట మనకు పట్టుపడినదిగాదు. ఈ యభ్యాసమునకు స్వదేశీయుల బురికొల్పుట విద్యావంతుల కర్తవ్యము గదాయని తలంచి మేమీ గ్రంథమును వెలుపఱచితిమి. గ్రంథకర్తలగు ఆచంట - లక్ష్మీపతిగా రభినందనీయులు. ఆంధ్రలోక మీ గ్రంథము నుపయోగించి మమ్ముం గృతార్థుల నొనర్చెడునుగాత!

28-9-1912.

మద్రాసు.

సంపాదకుడు.