పుట:Chali Jvaramu.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


110

చ లి జ్వ ర ము

టే గదిలో పరుండవలసి వచ్చినప్పుడు చలిజ్వరపు రోగులను దోమ తెరలలో పరుండబెట్టుదురు.

గ్రామమున కరమైలుకంటె దూరముననుండు నిండ్లలో నివసించెదరు.

 2.గ్రామమునకు అరమైలుకంటె దూరమున నుండి నిండ్లలో నివసించుట, అనేకమంది చలిజ్వరపు రోగులున్నచోట ఇతరులను కొందరను మాత్రము కాపాడవలెననిన ఈక్రిందిపద్దతి యుపయుక్తము. దోమలు అరమైలుకంటె హెచ్చుదూరము పరుగెత్తలేవను సిద్దాంతమునుబట్టి ఏర్పడుచున్నది. ఇది భాగ్యవంతులకు మాత్రము సామాన్యముగా నుపయోగకరము. చలిజ్వరముగలగ్రామములలో తగిన వీలుగలవారు ఆగ్రేఅమమునకు అరమైలికంటె దూరముగా ఇండ్లను కట్టుకొని ఆయిండ్లలో నివసింప వలెను. వారురాత్రులయందు తమయిండ్లనువిడిచి బయటకు పోకూడదు. తమకు చుట్టుపట్ల అరమైలు దూరములో దోమల కుపయుక్తములగు నిలువ నీరు చెరువూలోను గోతులలోను, లేకుండ వాని నన్నిటిని పూడ్చివేయవలెను. లేదా వానిలో చేపలనుపెంచి అప్పుడప్పుడా ప్రదేశముల నెల్ల పరీక్షించు చుండవలెను. ఆయిండ్లకుచుట్టు అరమైలు దూరములో ఊడ్పుచేలుగాని నీరు నిలకడగా పెట్టి పెంచు పైరులుగాని ఉండకూడదు. చలిజ్వరముగల తమసేవకుల నెవ్వరిని తమయింటి చుట్టు కాపురములు పెట్టుకొనకూడదు. వారలను రాత్రుల యందు తమ ఇంటిలో పరుండనీయకూ