పుట:Chali Jvaramu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

55


దోమనుండి మరియొక తరము దోమ పుట్టుటకు సాధారణముగా 10 లేక 12 దినములకంటె ఎక్కువ కాలము పట్టదు. అనగా ఒక్క తల్లిదోమ నుండి వందలు వేలకొలది పిల్లలు రెండువారములలో తయారగును.

దొమలకు కండ్లు రెండును గలవుగాని యవి దూరపు వస్తువులను చూడలేవు. వాసనయును రుచి యును మనకంటె మిక్కిలి సూక్ష్మముగ కనిపెట్ట గలవు. దొమలు సాధారణముగా రాత్రులయందు మాత్రము సంచరించు జంతువులు. పగటి సమయమున చల్లని నిశ్శబ్దమైన స్థలములో నిద్రించును. ఇవి సూర్యాస్తమయము కాగానే మేయుటకును గ్రుడ్లు పెట్టుటకును బయలువెడలును. కాని మబ్బుదినములయందును, ఎండ చొరని అడవులలోను, చీకటి గదులలోను, ఇవి ఎల్లప్పుడు తిరుగుచుండును. స్టెగోమియా దోమ పగలు రాత్రి యనక సర్వదా మేత మేయుచుండును. వీని కింగ్లీషులొ పులిదోమలు (Tiger mosquitoes) అని పేరు.

దోమపిల్లలను పరీక్షించు విధము

ఇదివరకెన్నడును దొమపిల్లలను చూడని వారలు తమ దొడ్దిలోకి పోయి ఎక్కడనైనను 10 లెక 15 దినములనాటి నిలువనీళ్లున్న యెడల కనిపట్టవలెను.