పుట:Chali Jvaramu.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మూడవ ప్రకరణము

మలేరియా పురుగు

మలేరియా పురుగుమూల పదర్ధపు సముదాయము

  • చలిజ్వరముయొక్క కారణము చక్కగ తెలిసి కొనవలెనన్న మలేరియా పురుగు యొక్కజీవిత చరిత్రను మొదట తెలిసికొనవలెను. వేరొకమాట తెనుగు భాషలో లెనందున దీనికి పురుగు అనిపేరు పెట్టితిమేకాని దీనియొక్క నడవడికలు చదివిన పిమ్మట ఇది సామాన్యమైన పురుగుకాదని మీరు తెలిసి కొనగలరు. ఇది జీవశాస్త్రములోని వికారిణీ (Amoeba) వంటిది. విజ్ఞానచంద్రికా గ్రంధమూలలో ని 3-వ గ్రంధమగు జీవశాస్త్రముయొక్క మొదటి ప్రకరణము చూడు. ఇదియు దానివలెనె జీవస్ధానముగల మూలపదార్ధపు సముదాయము. 9-వ పటము చూడుము. దీనికి నోరు లేకున్నను నిదినెత్తురు త్రాగి వృద్ధిపొంది పిల్లలను పెట్టును. వీనిని ఒకదానిపైనొకటిని దొంతరగాపెట్టిన ఒక అంగుళము ఎత్తునకు 3000 మొదలు 24000 వేలవరకు పట్టును. దీనికి కాళ్లుచేతులు లేకున్నను నిది ఒక చోటనుండి మరి యొకచోటికి ప్రాకగలదు.