పుట:Chali Jvaramu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

115


గ్రెయిను 'పొటాషియంబ్రోమైడు ' అను మందును చేర్చి నిమ్మకాయరసముతో జేసిన షర్బతుతో నాలుగు గంటల కొకసారి యిచ్చితిని.

15-వ తేది ఉదయమున వాంతులు తగ్గెను గాని జ్వరము నిలువలేదు. ఆ తేది సాయంకాలము 3 గ్రెయినుల క్వయినా హైడ్రోక్లోరైడును 10 చుక్కల అరిశుభ్రమైన నీతిలో కలిపి పిఱ్ఱమీది కండలోనికి చిన్న గాజు పిచికారితొ ఎక్కించితిని, 16-వ తేది సాయంకాలం 4గంటలకు జ్వరము 88 డిగ్రీలకు దిగియుండెను (పటము చూడుము) అయినను రెండు గ్రెయినుల క్వయినా హైడ్రోక్లోరైడు గల మందును నాలుగు గంటల కొక మోతాదు చొప్పున అనుదినము విడువక ఇచ్చుచుంటిని. కాని జ్వరము నిలువక క్రమమున క్రమముగ పటములో చూపిన ప్రకారము తిరిగి హెచ్చుచునే యుండెను.

19-వ తేది సాయంకాలం జ్వరము తిరిగి 103 డిగ్రీలవరకు వచ్చి యున్నందున ఈజ్వరము కాలజ్వరము (Kala Azar) ఏమోయని మిక్కిలి సందేహముతొ రోగిని తిరిగి శ్రద్ధగా పరీక్షించితిని. ఎడమడొక్కలో నుండు జ్వరపుగడ్డ (Spleen) తగ్గుచున్నట్లు కనుబడినను, కుడిప్రక్కను పైత్యకోశము (Liver) పెద్దదై చేతికి బాగుగ గడ్డవలెతెలియుచుండెను. అందుచే క్వయినాఎంత యిచ్చినను సరిగా నెత్తురులోనికి చేరుటలేదని యూహించి తిరిగి 8 గ్రెయినుల క్వయినాను మరియొక పిఱ్ఱమీది కండలోనికి పిచికారీ చేసితిని. కాల జ్వరము గూర్చి ప్రత్యేకముగ శోధనలను చేయుటకై సర్కారువారిచే నియమింపబదినన డాక్టరునకు ఈరోగిని చూపి సలహాపుచ్చుకొను నిమిత్తము ఆ డాక్టరునకు సమాచారముతెలిపితిని. కాని మరునాడు అనగా 20 తేది ఉదయము ఏడు గంటలకే రోగి యొక్క జ్వరము దిగిపోయి, శరీరవేడిమి 97 డిగ్రీలకు వచ్చియుండెను. ఆ తేది మొదలు మోతాదుకు రెండు గ్రెయినుల చొప్పున 'క్వయినా హైడ్రోక్లోరైడు ' దినమునకు 6 సార్లు ఇచ్చుచుంటిని. జ్వరము దిగిపోవుటచే కాలజ్వరము అనుమానము లేక పోయెను. రోగి నానాటికి ఆరోగ్యమును పొందుచున్నది. ఇంకను (2-9-=12) దినమున 6 గ్రెయినుల చొప్పున క్వయినా పుచ్చుకొనుచున్నది.