పుట:Chali Jvaramu.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


98

చ లి జ్వ ర ము

కొన్ని విషజాతుల చలిజ్వరములలోను, చలిజ్వరపు పురుగుచేకలిగిన జిగట విరేచనములలోను, ఒక మొతాదునకు 60 గ్రెయినుల క్వయినా కలిసిన నీళ్లను ఆసనము ద్వారా పిచ్చికారీ చేసినయెడల నామందు పేగులోనుండి రక్తములోనికిపోయి రోగికి స్వాస్థ్యము కలుగజేయును.

చలిజ్వరముతోకూడిన ఇతర వ్యాధులున్నయెడల వానికి ప్రత్యేకముగ చికిత్స చేయవలెను.

  పైనిచెప్పిన చికిత్సయంతయు రోగికి చలిజ్వరముతో పాటు ఇతర రోగములెమియు లెక యున్నప్పుడు మిక్కిలి యనుకూలముగ నడచును. కాని గుండెల యందు గాని, మొదడునందుగాని, ఇతర అవయవములందుగాని, మరియొక వ్యాధి ఏదైన నను చలిజ్వరములో మిశ్రమమై యున్నయెడల పై నుదాహరించిన్ చికిత్సకు తోడుగా నాయా వ్యాధులకు తగిన చికిత్సలను కూడ చేయుచుండవలెను. ఆ వ్యాధులను వాని చికిత్సలను గూర్చి ఇక్కడ వ్రాయుటలేదు. వ్యాధి నిదానము విషయములో ఎంత మాత్రము సందేహముగా నున్నను, రొగి తగ్ఫిన వైద్యుని సలహాను పుచ్చుకొనవలెను. ఏవైధ్యుని కయినను రోగముయొక్క నిదానమును గూర్చి సందేహ మున్న యెడల ఇతర వైద్యులతొ సంప్రదించవలెను.
           ---