పుట:Chali Jvaramu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61

నాలుగవ ప్రకరణము

కోళ్లక్రింద పెట్టుకొను నీటిపళ్లములలోను, చీమలు రాకుండ బెల్లము, నెయ్యిమొదలగు పదార్దముల నుంచుకొను పళ్లెములలోను పోయునీటిని 10 లేక 15 దినములవరకు మార్చకుండ పెట్టిపెట్టినయెడల నట్టి నీటియందును, తరుచుగ నీదోమపిల్లలు కనబడును. ఇవి నూతులలోను, పగిలిపోయిన బుడ్లలోని నీళ్ల లోను, కుండపెంకులలోను, చెట్లతొర్రలలోని నిల్వ నీళ్ల లోనుకూద కనబడును.

దోమలయొక్క నైసర్గిక విరోధులు

పెద్దపెరిగిన తరువాత దోమలను అనేకములగు పక్షులు, చేపలు, పురుగులు, గబ్బిలములు, మొదలగు జంతువులు తిని నశింపుజేయును. సరిగాదొరినప్పుడు చీమలుకూడ దోమలను పట్టీ తినును. పెద్ద దోమలకంటె ననేకరెట్లు వీనిపిల్లలు సృష్టిలో నాశనము జెందుచున్నవి. కొన్నిజాతుల దోమపిల్లలే మరికొన్నిజాతులదోమపిల్లలను తినివేయును. కొన్ని నీటిపురుగులు ఈదోమపిల్లలను దొరికినప్పుడెల్లను విడువక మ్రింగివేయును. పరిగెలు మొదలగు కొన్ని చేపలు మిక్కిలి చమత్కారముగ నీదోమపిల్లలకై కాచియుండి వానినిపట్టి నశింపుజేయును. ఈచేపలు సామాన్యముగా అన్ని చోట్లను దొరకును. తగినన్ని చేపలుండి, దోమపిల్లలు దాగుకొనుట కనుకూల