పుట:Chali Jvaramu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రకరణము

3


జ్వరము వలన మంచం మీదనున్న వారము దినములలో కలుగు ఈనష్టమునకు, వీరలు పనిలో ప్రవేశించిన తరువాత చాలదినముల వరకు బలహీనతచేత పని తక్కువగా చేయుటవలన వారి యజమానులకు వచ్చునష్టమును, వీరు జ్వరముతొ బాధపడునప్పుడు వీరి ఉపచారము నిమిత్తమై పని చెడి ఇంటియొద్ద నిలిచియున్న వారికి కలుగు నష్టమును, మందులు పథ్యపానాదులు మొదలగువాని కగు కర్చుల నష్టమును ఈలెక్కలో చేరలేదు.

ఈ ప్రకారముగా ఇంతిం తనరాని ధననష్టమును శరీరారోగ్య నష్టమును కలుగజేయుచుండెడు ఈ జ్వరమును గూర్చి ఎంతవ్రాసినను వ్రాయవచ్చును. తమకు తెలియని విషయములలో తమ బాగుకొరకు ఎవరైన ఏదైనచెప్పిన విశ్వసించి తమ తప్పులను దిద్దుకొను స్వభావము మన ప్రజలయందు కొంచెమయినను కానరాదు. తమకు వంశపారంపర్యముగా తాతల నాటినుండి వచ్చు మూఢవిశ్వాసమును విడువరు.

ఒకానొక విధమైన పురుగు నీటి మూలమున మనశరీరములో ప్రవేశించుటచే 'కలరా' అను వ్యాధి కలుగుచున్నదని అజ్ఞానియగు కాపువానికి