పుట:Chali Jvaramu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

చ లి జ్వ ర ము


వెంబడిని చలియు కుదుపును పుట్టును. ముఖము వాడిపోయి నల్లబడును. పిమ్మట అధికమైన వణకు ప్రారంభించును. పండ్లుకరచుకొనిపోవును. శ్వాస చలితోడ కూడినదై ఎగుడు దిగుడు గా వచ్చును. మాట సగమువచును. నాడి నీరసించి వేగ మధిక మగును. ఇంటిలోనున్న దుప్పట్లు అన్నియు కప్పుకొనును. పాపము చలిమాత్రము తీరదు. ఒక్కకప్పుడు వాంతులును విరేచనములును ఉండవచ్చును. కాళ్లుచేతులు అమితముగ లాగికొని పోవును. చెవులలో ధ్వని బైలుదేరవచ్చును. దినమువిడిచి దినమువచ్చు సామాన్యజ్వరములో చలి కుదుపు తక్కువ జ్వరములకంటె హెచ్చుగానుండును. అరగంటవరకుగాని అంతకంటె హీచ్చుగగాని చలియుండవచ్చును. పిల్లలకు, కడుపు కనపడక పొవచ్చును. దీనికి బదులుగా బాలపాపచిహ్నము లనబడు ఈడ్పుగాని వాంతులుగాని రావచ్చును. చలి రామముందే జ్వరము కొంచెము ప్రారంభించి కుదుపుతో పాటు 104 మొదలు 106 డిగ్రీల వరకు హెచ్చును. పిమ్మట ఈ చలి భగభగ మను మంటలుగా మారును.

ఉష్ణదశ

2. ఉష్ణదశ ఉష్ణదశలో మంటలు మొదట అప్పుడప్పుడు వచ్చి తుదకు శరీరమంతయు ఒకటే