పుట:Chali Jvaramu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరీక్ష్యార్ధమేర్పడిన 28 పిచికలలో 22 పిచికలకు ఈ వ్యాధితప్పకవచ్చినట్టు కనిపెట్టెను.

దోమ మూలముననే చలిజ్వరపు పురుగు వాపించుచున్నది

[1]అటుపిమ్మట ఇటలీదేశపు వైద్యులందరును దోమమూల మిక్కిలి శ్రమపడి పనిచేసి ఒక మనుష్యునినుండి ముననె చలి మరియొక మనుష్యునికి దోమ మూలముననే చలిజ్వరపు పురుగు వాపించుచున్నదని కనిపట్టిరి. వారు చలిజ్వరముగల రోగియొక్క నెత్తురున్ త్రాగిన దోమలను ఏమియున్ రోగములెని మనుష్యుల మీద కరిపించిరి. ఆ మనుష్యులకు కొన్ని దినములలో తప్పక చలి జ్వరము వచ్చుటయు, వారి నెత్తుటిఓ మలేరియాపురుగులు పెక్కువేలుగా వృద్ధి నొందుటయు పిమ్మట కనిపెట్టబడెను. ఈ విషయమునే ఇంగ్లాండు దేశములో ((Manson) మెన్ సన్ కూడ శోధించి స్థిరపరచెను. అది ఎట్లన చలిజ్వరపురోగిని కరచిన దోమలను ఇతర దేశముల నుండి లండను పట్టణమునకు రవాణాచేసి అక్కడ రోగములేని ఇద్దరు మనుష్యులమీద నిడు కరపించెను. ఈ యిద్దరికి కొన్ని దినములయిన పిమ్మట చలిజ్వరమువచ్చి వారి నెత్తురులో మలేరియా పురుగులు కనబడెను.

మలెరియా జ్వరముయొక్క వ్యాపకమునకు ఇట్లు తోడ్పడు మలేరియా పురుగును గూర్చియు దోమను గూర్చియు, ముందు ప్రకరణలలో తెలియగలదు.


  1. *దోమమూలముననె చలిజ్వరపుపురుగు వ్యాపించుచున్నది.